• search
 • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కమలా హ్యారిస్ తాత ఏం చేసేవారో తెలుసా: 60 ఏళ్ల కిందటే ఒంటరిగా: చెన్నై టు కాలిఫోర్నియా

|

చెన్నై: కమలా హ్యారిస్.. ప్రస్తుతం ఈ పేరు దేశంలో మారుమోగిపోతోంది. అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి సెనెటర్‌గా విజయం సాధించినప్పటికంటే కూడా ఈ సారి ఆమె పేరు కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది. దీనికి కారణం- అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్ష పదవి కోసం పోటీ పడబోతుండటమే. ఈ ఏడాది నవంబర్‌లో నిర్వహించబోయే అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో కమలా హ్యారిస్ పోటీ చేయబోతున్నారు. ఉపాధ్యక్ష పదవి కోసం ఆమె పేరును జో బిడెన్ ఖరారు చేశారు. డెమొక్రటిక్ పార్టీ తరఫున కమలా హ్యారిస్ ఉపాధ్యక్ష ఎన్నికల బరిలో దిగారు.

ఎవరీ కమలా హ్యారిస్

ఎవరీ కమలా హ్యారిస్


దీనితో కమలా హ్యారిస్ ఎవరు? ఆమె కుటుంబ నేపథ్యమేంటీ? భారత్‌లో ఆమె మూలాలు ఎక్కడున్నాయి? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికీ కమలా హ్యారిస్ కుటుంబీకులు చెన్నైలో నివసిస్తున్నారు. డాక్టర్లుగా స్థిరపడ్డారు. అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్ష పదవి కోసం ఆమెను ఎంపిక చేయడం పట్ల ఆ కుటుంబంలో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. ఉపాధ్యక్ష ఎన్నికల్లో కమలా ఘన విజయాన్ని నమోదు చేస్తారనే ఆశాభావం ఆ కుటుంబ సభ్యుల్లో వ్యక్తమౌతోంది.

చరిత్ర సృష్టించిన కమలా హ్యారిస్: డెమొక్రాట్ల తరఫున ఎన్నికల బరిలో: తమిళ తల్లిచరిత్ర సృష్టించిన కమలా హ్యారిస్: డెమొక్రాట్ల తరఫున ఎన్నికల బరిలో: తమిళ తల్లి

తాత భారత రాయబారి..

తాత భారత రాయబారి..

కమలా హ్యారిస్‌ది ఉన్నత వర్గానికి చెందిన కుటుంబం. ఆమె తాత పీవీ గోపాలన్.. భారత రాయబారిగా పనిచేశారు. పలు దేశాల్లో ఆయన విధులను నిర్వర్తించారు. కమలా హ్యారిస్ తల్లి డాక్టర్ శ్యామలా గోపాలన్ 60 సంవత్సరాల కిందటే ఉన్నత విద్యను అభ్యసించడానికి ఒంటరిగా అమెరికాకు తరలి వెళ్లారు. ఓక్లాండోలో స్థిరపడ్డారు. కాలిఫోర్నియాలో చదువుకున్నారు. యూసీ బర్కెలిలో చదువుకున్నారు. అక్కడే డాక్టరేట్ పొందారు. బ్రెస్ట్ కేన్సర్ స్పెషలిస్ట్‌గా, పరిశోధకురాలిగా పేరు తెచ్చుకున్నారు. అదే సమయంలో జమైకాకు చెందిన డొనాల్డ్ హ్యారిస్‌ను ఆమె పెళ్లాడారు. డొనాల్డ్ హ్యారిస్.. జమైకాకు చెందిన ఎకనమిస్ట్.

 శ్యామలా హ్యారిస్ చెల్లెలు చెన్నైలో

శ్యామలా హ్యారిస్ చెల్లెలు చెన్నైలో

శ్యామలా హ్యారిస్ చెల్లులు డాక్టర్ సరళా గోపాలన్ ప్రస్తుతం చెన్నైలో నివసిస్తున్నారు. ఆమె డాక్టర్. తన సోదరి కుమార్తె అమెరికా ఉపాధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీ చేయబోతోండటం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుంచి తనకు కమలా హ్యారిస్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఈరోజుక్కూడా తరచూ తనతో ఫోనులో మాట్లాడుతుంటారని అన్నారు. చిన్నప్పటి నుంచీ కమలా హ్యారిస్‌లో అభ్యుదయ భావాలు ఉండేవని సరళా గోపాలన్ తెలిపారు. తాను చేయదలచుకున్నది, చెప్పదలచుకున్నది నిర్భయంగా, నిర్మొహమాటంగా అమలు చేస్తుంటారని అన్నారు. ఆమె ముక్కుసూటి తత్వమే ఈ స్థాయికి తీసుకెళ్లిందని అన్నారు.

  California earthquake : A magnitude 5.5 earthquake near Ridgecrest
   కెనడాలో కమలా హ్యారిస్ సోదరి..

  కెనడాలో కమలా హ్యారిస్ సోదరి..

  శ్యామలా హ్యారిస్‌కు ఇద్దరు కుమార్తెలు కాగా.. మరొకరు కెనడాలో స్థిరపడ్డారు. ఆమె పేరు మాయా హ్యారిస్. ఇద్దరూ స్నేహితుల్లా కలిసి మెలిసి ఉంటారని సరళా గోపాలన్ తెలిపారు. 1962లో మాయా హ్యారిస్ స్టాన్‌ఫర్డ్ లా స్కూల్‌లో చదువుకున్నారు. కార్పొరేట్ లాలో నిష్ణాతురాలిగా పేరు తెచ్చుకున్నారు. 29 ఏళ్ల వయస్సులోనే ఆమె లింకన్ లా స్కూల్ డీన్‌గా నియమితులు అయ్యారు. అమెరికాలో అతి చిన్న వయస్సులోనే న్యాయ కళాశాల డీన్‌గా నియమితులు కావడం అదే తొలిసారి. కమలా హ్యారిస్ కూడా న్యాయవాద వృత్తినే చేపట్టారు. అనంతరం ఆమె కాలిఫోర్నియా సెనెటర్‌గా విజయం సాధించారు.

  English summary
  Kamala Harris's grandfather PV Gopalan was an Indian diplomat and the US Senator had herself recalled how her grandfather had shaped her life and served as the greatest inspiration besides her mother Dr Shyamala Gopalan become a breast cancer specialist.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X