వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయపాల్‌తో భేటీ రద్దు: జైశంకర్ నిర్ణయంపై కమలా హారిస్ అసంతృతి

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికా పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అక్కడి చట్టసభ ప్రతినిధులతో భేటీని ఆకస్మికంగా రద్దు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే, దీని డెమోక్రాట్ సెనేటర్ కమలా హారిస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. భారతసంతతికి చెందిన కమలా హారిస్.. జైశంకర్ ఇలా వ్యవహరించడం సరైన పద్ధతి కాదన్నారు.

కాగా, జైశంకర్ తాను అమెరికా చట్టసభ ప్రతినిధులతో భేటీని రద్దు చేసుకోవడానికి గల కారణాలను వివరించారు. కాశ్మీర్‌పై అమెరికా ప్రతినిధుల సభలో పెండింగ్‌లో ఉన్న తీర్మానం సరిగా లేదని, అందుకే వారితో సమావేశంపై ఆసక్తి చూపింలేదని స్పష్టం చేశారు. కాగా, భారత అమెరికన్, కాంగ్రెస్ సభ్యురాలైన ప్రమీలా జయపాల్ గతంలో అమెరికా ప్రతినిధుల సభలో కాశ్మీర్ అంశంపై తీర్మానం ప్రవేశపెట్టారు.

Kamala Harris slams Jaishankars decision to not meet Congresswoman Jayapal over J&K resolution

జమ్మూకాశ్మీర్‌లో అన్ని కమ్యూనికేషన్లపై ఉన్న ఆంక్షలు వెంటనే ఎత్తివేయాలని భారత్‌ను కోరారు. అంతేగాక, కాశ్మీర్ ప్రజలకు మత స్వేచ్ఛ కల్పించాలని సూచించారు. అయితే, ఈ తర్మానాన్ని భారత్ వ్యతిరేకించింది. ఈ క్రమంలో అమెరికా పర్యటనలో భాగంగా జైశంకర్ భేటీ కావాల్సిన చట్టసభ ప్రతినిధుల బృందంలో ప్రమీలా జయపాల్ కూడా ఉన్నారు.

ఈ విషయం తెలుసుకున్న జైశంకర్.. సమావేశ బృందం నుంచి ప్రమీలా జయపాల్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఇందుకు వారు ఒపపుకోకపోవడంతో భేటీని ఆకస్మికంగా రద్దు చేసుకున్నట్లు అమెరికన్ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఈ విషయంపై జైశంకర్ కూడా స్పస్టతనిచ్చారు.

అమెరికన్ కాంగ్రెస్‌లో ఉన్న తీర్మానం గురించి తనకు తెలుసని, అది జమ్మూకాశ్మీర్‌లోని వాస్తవిక పరిస్థితులను అద్దం పడుతుందని తాను అనుకోవట్లేదని అన్నారు. అంతేగాక, భారత ప్రభుత్వం ఉద్దేశాలను కూడా తీర్మానంలో సరిగా పేర్కొనలేదని చెప్పింది. ఒక ఉద్దేశం, చర్చించే మనస్తత్వం ఉన్న వ్యక్తులను కలిసేందుకు తాను ఎప్పుడూ ఆసక్తి చూపిస్తానని, కానీ, ప్రమీలా జయపాల్ లాంటి వ్యక్తులు ఇప్పటికే ఓ అభిప్రాయపం ఉండి దాన్ని మార్చుకునేందుకు సిద్ధపడట్లేదని.. అందుకే ఈ సమావేశంపై తాను ఆసక్తి చూపలేదని వెల్లడించారు.

English summary
Top Democratic Senator Kamala Harris on Friday came out in support of her fellow Indian American Congresswoman Pramila Jayapal, with whom External Affairs Minister S Jaishankar refused to meet during his visit to the country early this week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X