చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Kamala Harris: కమలా హ్యారీస్ మా బంగారం, ఇంటింటికి, తమిళ తంబీల ప్రేమ, ట్రంప్ తలపై టవలేసి !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ వాషింగ్టన్: అమెరికా నూతన అధ్యక్షుడిగా డెమొక్రాటిక్ పార్టీ నేత జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా ప్రవాస భారతీయురాలు కమల హ్యారీస్ ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్బంగా అమెరికాలోని వారి అభిమానులతో పాటు భారతదేశంలో వారి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ప్రమాణస్వీకారం చేస్తున్న కమల హ్యారీస్ కు శుభాకాంక్షలు చెబుతూ తమిళనాడులో భారీగా ఫెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. కమల హ్యారీస్ కుటుంబ సభ్యులు సొంతఊరైన తులసేంద్రపురంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. మా ముద్దు బిడ్డ కమల హ్యారీస్ ఇక ముందు అమెరికా ఉపాధ్యక్షురాలు అహో అంటూ తమిళ తంబీలు పండుగ చేసుకుంటున్నారు.

extra aunty: భార్యతో సరసాలకు నో సిగ్నల్. రెచ్చి పోయిన ఆంటీ, అత్త కొంపకు నిప్పు పెట్టిన అల్లుడు !extra aunty: భార్యతో సరసాలకు నో సిగ్నల్. రెచ్చి పోయిన ఆంటీ, అత్త కొంపకు నిప్పు పెట్టిన అల్లుడు !

 ట్రంప్ కు టవలేసి పంపించేశారు

ట్రంప్ కు టవలేసి పంపించేశారు

గత ఏడాది నవంబర్ 3వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై జో బైడెన్ (78) పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించారు. అమెరికా ఉపాధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన ప్రవాస భారతీయురాలు కమల హ్యారీస్ సైతం ఆమె ప్రత్యర్థిపై ఘన విజయం సాధించారు.

 తమిళ ముద్దు బిడ్డ కమలా హ్యారీస్

తమిళ ముద్దు బిడ్డ కమలా హ్యారీస్

కమలా హ్యారీస్ కుటుంబ సభ్యులు తమిళనాడులోని తంజావూరు జిల్లాకు చెందిన వారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కమలా హ్యారీస్ తాత గోపాలన్ తమిళనాడులోని తంజావూరు జిల్లా మన్నార్ గుడి సమీపంలోని తులసేంద్రపురంకు చెందిన వారు. గోపాలన్ కుమార్తె శ్యామలా గోపాలన్ చెన్నైలో జన్మించారు. శ్యామలా గోపాలన్ కుమార్తె కమలా హ్యారీస్. గోపాలన్ మనమరాలు కమలా హ్యారీస్ అమెరికా ఉపాధ్యక్షురాలు అయ్యారని, ఈ రోజు మాకు నిజమైన పండుగ అంటూ తలసేంద్రపురంలోని స్థానికులు స్వీట్లు పంచిపెట్టుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు.

 దెబ్బకు ఊరు మొత్తం ఫ్లెక్సీలు

దెబ్బకు ఊరు మొత్తం ఫ్లెక్సీలు

తులసేంద్రపురంలోని ఇంటింటి దగ్గర, షాపుల దగ్గర, దేవాలయాలు, వీదుల్లో గోపాలన్, ఆయన కుమార్తె శ్యామలా గోపాలన్, మనుమరాలు కమలా హ్యారీస్ తోపాటు వారి కుటుంబ సభ్యులు ఉన్న ఫోటోలతో ఫెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. మా ముద్దు బిడ్డ అమెరికా ఉపాధ్యక్షురాలు అయ్యారంటే మా ఊరి కులదైవం ఆశీస్సులు ఉన్నాయని ఆ గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 గోపాలన్, కమలా హ్యారీస్ ఫ్యాన్స్

గోపాలన్, కమలా హ్యారీస్ ఫ్యాన్స్

కమలా హ్యారీస్ తల్లి శ్యామలా గోపాలన్ తల్లిదండ్రులు తంజావూర్ లోని మన్నార్ గుడి ప్రాంతానికి చెందిన వారు. కమలా హ్యారీస్ తాత గోపాలన్ పైంగనాడు సమీపంలోని తులసేంద్రపురానికి చెందిన వారు. బ్రిటీష్ కాలంలో కమలా హ్యారీస్ తాత గోపాలన్ సివిల్ సర్వీస్ అధికారిగా పని చేస్తూ మంచి పేరుప్రతిష్టలు సంపాధించుకున్నారు. 1930 తరువాత కమలా హ్యారీస్ కుటుంబ సభ్యులు అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.

 ముందు నుంచి కమలా మేడమ్ అంతే

ముందు నుంచి కమలా మేడమ్ అంతే

కమలా హ్యారీస్ 2016లో కాలిఫోర్నియా నుంచి సెనేటర్ గా ఎన్నికయ్యారు. గతంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో అటర్నీ జనరల్ గా పని చేసిన కమలా హ్యారీస్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని పని చేస్తూ అందరిలో మంచి పేరుప్రతిష్ట్రలు సంపాధించుకున్నారు. ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్ష ఎన్నికల్లో కమలా హ్యారీస్ పని చేశారు. అమెరికా ఎన్నికల్లో కమలా హ్యారీస్ విజయం సాధించాలని ఆమె సొంత ఊర్లో వారి కులదైవం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

 ఎన్నికల సమయంలో సేమ్ సీన్

ఎన్నికల సమయంలో సేమ్ సీన్

అమెరికా ఎన్నికలు జరిగిన గత ఏడాది నవంబర్ 3వ తేదీన తంజావూర్ లోని మన్నార్ గుడి సమీపంలోని తులసేంద్రపురంలోని గిరిజన దేవత అయిన అయ్యనార్ ఆలయంలో కమలా హ్యారీస్ పేరుతో ప్రత్యేక పూజలు, హోమాలు, యాగాలు నిర్వహించారు. అమెరికా ఎన్నికల్లో కమలా హ్యారీస్ విజయం సాధించాలని దేవుడిని ప్రార్థిస్తూ ప్రత్యేక ప్రత్యేక పూజలు, హోమాలు, యాగాలు నిర్వహించారు. ఆ రోజు నుంచి స్థానికులు చేసిన ప్రత్యేక పూజలు ఫలించడంతో ఇప్పుడు మళ్లీ ఆప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొనింది.

English summary
Kamala Harris: People in Thulasendrapuram village of Tamil Nadu put up hoardings and posters of US Vice President-elect Kamala Harris at their shops and homes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X