• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కమల్‌ప్రీత్ కౌర్: ‘అభినందనలు చెప్పిన తర్వాత డిస్కస్ త్రో అంటే ఏంటని అడుగుతారు’

By BBC News తెలుగు
|

టోక్యో ఒలింపిక్స్‌లో డిస్కస్ త్రోలో అద్భుతమైన ప్రదర్శనతో భారత అథ్లెట్ కమల్‌ప్రీత్ కౌర్ ఫైనల్‌కు చేరారు.

ఫైనల్స్‌లో చోటు సంపాదించడం ద్వారా భారతీయుల్లో మరో పతకంపై ఆమె ఆశలు చిగురింపజేశారు.

ఆగస్టు 2న ఈ ఫైనల్స్ జరగబోతున్నాయి. క్వాలిఫైయింగ్ రౌండ్‌లో 64 మీటర్ల దూరానికి ఆమె డిస్కస్‌ను విసిరారు.

25ఏళ్ల కమల్‌ప్రీత్ స్వస్థలం పంజాబ్‌లోని ఓ మారుమూల గ్రామం. ఇటీవల కమల్‌ప్రీత్ తన సొంత రికార్డును తానే తిరగరాశారు.

https://twitter.com/Media_SAI/status/1421340899032715264

ఒలింపిక్స్‌కు వెళ్లకముందు బీబీసీ కరస్పాండెంట్ వందన కమల్‌ప్రీత్‌‌తో మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు.

వందన: మీ మనసులో ఏముంది?

కమల్‌ప్రీత్‌: ఒలింపిక్స్‌లో పతకం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. నా ఆటతీరును కూడా మెరుగు పరచుకోవాలి. మిగతాది దేవుడికే వదిలేస్తున్నా.

వందన: నేటి యువతలో చాలా మందికి క్రికెట్ గురించి తెలుసు. కానీ డిస్కస్ త్రో గురించి మాత్రం చాలా కొద్ది మందికే తెలుసు. దీని గురించి యువతకు ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారా?

కమల్‌ప్రీత్‌: దాదాపు అందరికీ క్రికెట్ గురించి తెలుసు. కానీ డిస్కస్ త్రో గురించి చాలా మందికి తెలియదు. నేను పతకాలు సాధించినప్పుడు కొందరు ఫోన్‌చేసి మరీ అభినందనలు చెబుతాయి.

అయితే, డిస్కస్ త్రో అంటే ఏమిటి అని అడుతుంటారు. దాన్ని నువ్వు ఎలా విసురుతున్నావ్ అని అడుగుతారు. దీని గురించి తెలుసుకోవడం చాలా తేలిక. ఒక చక్రాన్ని వీలైనంత దూరం విసరడమే.

కమల్‌ప్రీత్ కౌర్

వందన: మీకు క్రికెట్ అంటే ఇష్టమని, మీరు క్రికెట్ కూడా ఆడాలని అనుకున్నారని విన్నాను. అది నిజమేనా?

కమల్‌ప్రీత్‌: అవును. నాకు సమయం దొరికినప్పుడు క్రికెట్ ఆడతాను. నిజంగా నాకు క్రికెట్ ఒక ప్యాషన్‌ లాంటిది. ఎప్పుడు సమయం దొరికినా, ఆడేందుకు ప్రయత్నిస్తుంటా.

వందన: స్పోర్ట్స్‌లో పురుషులతో పోలిస్తే, మహిళలకు ఎక్కువ సవాళ్లు ఎదురవుతుంటాయి. మీకు అలాంటి సవాళ్లు ఏమైనా ఎదురయ్యాయా?

కమల్‌ప్రీత్‌: అమ్మాయిలకు పెళ్లి చేయడం గురించే అందరూ ఆలోచిస్తుంటారు. డిగ్రీ పూర్తయిన వెంటనే పెళ్లి చేసేయాలని అనుకుంటారు. స్పోర్ట్స్ వద్దని చెబుతారు. ఇంటి పనులు చేసుకోవాలని సూచిస్తారు. ''స్పోర్ట్స్ వల్ల నీకు ఏం వస్తుంది?’’అని అడుగుతారు. నా జీవితంలోనూ ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి.

కమల్‌ప్రీత్ కౌర్

వందన: మీరు మారుమూల గ్రామం నుంచి వచ్చారు. మీకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి?

కమల్‌ప్రీత్‌: మా కుటుంబ సభ్యుల్ని ఒప్పించడమే అన్నింటికంటే పెద్ద సవాల్. చదువుపైనే దృష్టిపెట్టమని వారు చెప్పేవారు. కానీ నేను పట్టుబట్టేదాన్ని. దీంతో స్పోర్ట్స్‌లో కొనసాగేందుకు వారు అనుమతించారు.

మా ప్రాంతంలో ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. నాకు శిక్షణ ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవడానికి కొంత సమయం పట్టింది. నాకు ముందే, ఇలాంటి ఇన్‌స్టిట్యూట్‌ల గురించి తెలుసుంటే, నేను 2016లోనే ఒలింపిక్స్‌కు వెళ్లుండేదాన్ని.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Kamalpreet Kaur: ‘After saying congratulations, ask what is a discus throw’
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X