వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాటి ఎమ్మెల్యే మీద దాడి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు, నెల రోజులు మాయం, గోవాలో, పార్టీ వేటు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ మీద దాడి చేసిన కంప్లీ ఎమ్మెల్యే జేఎన్. గణేష్ ను ఎట్టకేలకు రామనగర జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. గురువారం కంప్లీ ఎమ్మెల్యే గణేష్ ను కోర్టు ముందు హాజరుపరుస్తామని పోలీసు అధికారులు తెలిపారు. పొరుగు రాష్ట్రంలో (గోవా) గణేష్ ను అరెస్టు చేశారని ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. అయితే పోలీసులు మాంత్రం గోవాలో గణేష్ ను అరెప్టు చేశామని అధికారికంగా చెప్పడం లేదు.

నెల రోజులు మాయం

నెల రోజులు మాయం

బెంగళూరు నగర శివార్లలోని బిడిది సమీపంలోని ఈగల్టన్ రిసార్టులో జనవరి 19వ తేదీ రాత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ మీద కంప్లీ ఎమ్మెల్యే దాడి చేశారని బిడిది పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కోర్టులో సమర్పించారు. అప్పటి నుంచి ఎమ్మెల్యే గణేష్ మాయం అయ్యాడు. చివరికి నెల రోజుల తరువాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గణేష్ ను పోలీసులు అరెస్టు చేశారు.

వేటు వేసిన కాంగ్రెస్ పార్టీ

వేటు వేసిన కాంగ్రెస్ పార్టీ

సాటి ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ మీద దాడి చేశారని కంప్లీ ఎమ్మెల్యే గణేష్ ప్రాథమిక సభ్యత్వం రద్దు చేశామని కేపీసీసీ ప్రకటించింది. ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ మీద దాడి చేశారని నమోదు అయిన కేసులో తనకు ముందస్తు జామీను మంజూరు చెయ్యాలని ఎమ్మెల్యే గణేష్ తన న్యాయవాదుల తరపున ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే పోలీసులు అరెస్టు చెయ్యడంతో గణేష్ న్యాయవాదులు బుధవారం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను వాపస్ తీసుకున్నారు.

కులం పేరుతో దూషించాడు

కులం పేరుతో దూషించాడు

పోలీసులు కేసు నమోదు చెయ్యడంతో మాయం అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గణేష్ అజ్ఞాతస్థలం నుంచి తన ఫేస్ బుక్ లో దాడి విషయంలో వివరణ ఇచ్చారు. గొడవ జరగడానికి మొత్తం ఆనంద్ సింగ్ కారణం అని, తాను దాడి చెయ్యలేదని, ఆయనే టేబుల్ మీద పడటంతో గాయాలైనాయని వివరించాడు. తనను తక్కువ జాతి వాడు అంటూ ఆనంద్ సింగ్ దూషించాడని కంప్లీ ఎమ్మెల్యే గణేష్ ఫేస్ బుక్ లో ఆరోపించాడు.

 సాటి ఎమ్మెల్యే మద్దతు

సాటి ఎమ్మెల్యే మద్దతు

కంప్లీ ఎమ్మెల్యే గణేష్ ఇంటికి మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి బుధవారం వెళ్లారు. గొడవకు కంప్లీ ఎమ్మెల్యే గణేష్ కారణం కాదని, కావాలనే ఆయన్ను బలిపశువు చేశారని రమేష్ జారకిహోళి అన్నారు. గణేష్ ను కులం పేరుతో దూషించారని, గొడవ జరిగిన సమయంలో ప్రత్యక్షసాక్షి అయిన ఎమ్మెల్యే భీమానాయక్ అసలు విషయం చెప్పాలని రమేష్ జారకిహోళి అన్నారు. గణేష్ మంత్రి అయ్యే అవకాశాలు చాల ఎక్కువగా ఉన్నాయని, ఆయన కేసు నుంచి బయటపడుతారని రమేష్ జారకిహోళి తెలిపారు.

English summary
Kampli MLA JN Ganesh who is accused in onslaught case has been arrest by Ramangara police in Goa. Ganesh attacked on Congress MLA Anand Singh in Eagelton resort on January 19. He was absconding from January 21.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X