వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాందహార్ హైజాక్‌పై ‘రా’ మాజీ చీఫ్ సంచలనం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) మాజీ చీఫ్ ఏఎస్ దౌలత్ కాందహార్ విమానం హైజాక్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాందహార్ హైజాక్‌ను ఆపడానికి పక్కా ప్రణాళికలు రూపొందించినా.. ఢిల్లీలో కూర్చుని పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారుల వల్లే ఆ హైజాక్‌ను ఆపలేకపోయామని చెప్పారు.

ఆయన రచించిన ‘కాశ్మీర్: ది వాజ్‌పేయి ఇయర్స్' అనే పుస్తకంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ఖాట్మాండు నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే విమానం హైజాక్ అయినట్టు సమాచారం అందింది. ఇంధనం కోసం విమానం కొద్ది సమయం అమృతసర్‌లో ఆగింది. ఆ సమయంలో ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు అప్పటి పంజాబ్ పోలీస్ చీఫ్ సరబ్‌జీత్ సింగ్ పక్కా ప్రణాళికలు రూపొందించారు' అని చెప్పారు.

Kandahar hijack was ''goofed up'': Former RAW chief

‘సుశిక్షితులైన కమాండోలను కూడా సిద్ధం చేశారు. అయితే దీనికి అనుమతివ్వాల్సిన ఢిల్లీ పెద్దలు మాత్రం వెనకడుగు వేశారు. దీంతో ఉగ్రవాదులు విమానాన్ని కాందహార్‌కి తీసుకెళ్లి వారి డిమాండ్లు నెరవేర్చుకున్నార'ని దౌలత్ తన పుస్తకంలో రాశారు.

అధికారుల నిర్వామకంతో విమాన హైజాకార్ల ముందు మనం దద్దమ్మలమైపోయామని ఆయన వాపోయారు. అయితే అందుకు బాధ్యులైన అధికారుల పేర్లను మాత్రం ఆయన వెల్లడించలేదు. ‘జైష్-ఎ-మహ్మద్' వ్యవస్థాపకుడు మౌలనా మసూద్ అజహర్‌తోపాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను విడిపించుకునేందుకే కాందహార్ హైజాక్ జరిగిన విషయం తెలిసిందే.

English summary
The Kandahar hijack was "goofed up" as no one wanted to take a decision fearing loss of life, according to former RAW chief AS Dulat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X