• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Kangana: క్వీన్ కు ఇన్ స్టాగ్రామ్ షాక్, కరోనాతో కంగనా కామిడీనా ?. మేడమ్ మారుతుందా ? లేదా ? !

|

ముంబాయి/చెన్నై: బాలీవుడ్ నటి, క్వీన్ కంగనాకు సోషల్ మీడియాలో షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. తనకు COVID పాజిటివ్ వచ్చిందని, ముంబాయిలోని తన సొంత ఇంటిలో హౌమ్ క్వారంటైన్ లో చికిత్స పొందుతున్నాను, తాను త్వరగా కొలుకోవాలని కోరుకుంటున్న తన సన్నిహితులు, అభిమానులకు చాలా థ్యాక్స్, ఈ చిన్న కరోనా వైరస్ నన్ను ఏమీ చెయ్యలేదు. నా శరీరంలో పార్టీ చేసుకుంటున్న కరోనాను చంపేసి త్వరలో మళ్లీ మీ ముందుకు వస్తాను, హరహర మహాదేవ్ అంటూ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఆమె ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులకు కోవిడ్ వచ్చిన విషయంలో క్లారిటీ ఇచ్చారు. కరోనాతో కంగనా కామిడీలు చేసోందా ?, మేడమ్ మారుతుందా ? లేదా ? అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ ఒక్క విషయంలో మళ్లీ కంగనాకు ఇన్ స్టాగ్రామ్ లో ఎదురు దెబ్బ తగిలింది. నిన్న ట్విట్టర్ అకౌంట్ శాస్వతంగా బ్లాక్ చెయ్యడంతో కంగనా మేడమ్ కు మైండ్ బ్లాక్ అయ్యి ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో తిక్కతిక్క స్టోరీలు రాస్తోందని ఆమెకు గిట్టనివాళ్లు విమర్శిస్తున్నారు.

CM wife:కన్నీళ్లు పెట్టుకున్న దుర్గా స్టాలిన్, 25 ఏళ్ల నాటి స్టోరీ రిపీట్, ఇద్దరూ ఇద్దరే,శుక్రవారం స్టాలిన్ కుCM wife:కన్నీళ్లు పెట్టుకున్న దుర్గా స్టాలిన్, 25 ఏళ్ల నాటి స్టోరీ రిపీట్, ఇద్దరూ ఇద్దరే,శుక్రవారం స్టాలిన్ కు

క్వీన్ కంగనాకు కోవిడ్ పరీక్షలు

క్వీన్ కంగనాకు కోవిడ్ పరీక్షలు

హిమాచల్ ప్రదేశ్ లోని ఇంటికి వెళ్లడానికి ముందు కంగనా రనౌత్ ముంబాయిలో కోవిడ్ పరీక్షలు చేసుకోవడంతో ఆమెకు కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని స్వయంగా బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఆమె ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో క్లారిటీ ఇచ్చారు. నాబాడీలోకి కరోనా వైరస్ వెళ్లి పార్టీ చేసుకుని ఎంజాయ్ చేస్తోందనే విషయం నాకు తెలిసిపోయింది. నా బాడీలో ఉన్న కరోనా వైరస్ ను అతి త్వరలో నేనే నాశనం చేస్తాను అంటూ కంగనా రనౌత్ ఆమె స్టైల్లో సోషల్ మీడియాలో సమాచారం ఇచ్చింది.

ఆఫ్ట్రాల్ కరోనా..... నన్ను ఏమీ చెయ్యలేదు

ఆఫ్ట్రాల్ కరోనా..... నన్ను ఏమీ చెయ్యలేదు

నా అభిమానులారా, దేశ ప్రజలారా, మీ మీద ఇలాంటి వైరస్ లు దుష్టశక్తుల్లా వాటి ప్రభావం చూపించాలని చూస్తే మీరు కామ్ గా ఉండకూడదు. ఇలాంటి వైరస్ లకు మీరు భయపడితే మిమ్మల్ని అది మరింత భయపెట్టే అవకాశం ఉంది, మీరు వైరస్ తో ధైర్యంగా పోరాటం చెయ్యండి ,అదే తోకముడుచుకుని వెళ్లిపోతుందని బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కూల్ గా చెప్పింది.

పోయేది ఏముందని మేడమ్ ఉచిత సలహాలు

పోయేది ఏముందని మేడమ్ ఉచిత సలహాలు

కరోనా వైరస్ మామూలుగా వచ్చిపోయే జ్వరం లాంటిదే, మనం దాని మీద పోరాటం చేస్తే అదే పారిపోతుంది అంటూ క్వీన్ కంగనా ఆమె అభిమానులకు ఓ ఉచిత సలహా ఇచ్చేశారు. కరోనా నుంచి మా ప్రాణాలు దక్కితే అదే చాలు దేవుడా అంటున్న ప్రజలకు క్వీన్ కంగనా రనౌత్ కరోనా విషయంలో ఇంత నిర్లక్షంగా ఉచిత సలహాలు ఇవ్వడంతో ఆమె అభిమానులు, ప్రజలు షాక్ అయ్యారు.

కరోనాతో కంగనా కామిడి చేస్తోందా ?

కరోనాతో కంగనా కామిడి చేస్తోందా ?

భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు ఇప్పుడు కరోనా మహమ్మారితో పోరాటం చేస్తున్నాయి. కరోనాను ఎలా జయించాలి ? అంటూ కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు నానా తంటాలు పడుతున్నాయి. ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో 98 శాతం లాక్ డైన్ అమల్లోకి వచ్చేసింది. ఇలాంటి సమయంలో కరోనాతో కంగనా కామిడీ చేస్తోందని విమర్శలువచ్చాయి.

 కంగనాకు ఏమైనా మతిపోయిందా ?

కంగనాకు ఏమైనా మతిపోయిందా ?

ఇలాంటి సమయంలో కరోనా వైరస్ ను ఓ చిన్న జబ్బు అంటూ నటి కంగనా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపిస్తోందని, ఆమెకు ఏమైనా మైండ్ బ్లాక్ అయ్యిందా ? అంటూ అనేక మంది విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో పదేపదే కంగనా రౌతన్ ఇష్టం వచ్చినట్లు స్టేట్ మెంట్లు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నదని పలువురు నెటిజన్లు మండిపడ్డారు.

దెబ్బకు డిలీట్

దెబ్బకు డిలీట్

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ విషయంలో ప్రజలను అయోమయానికి గురి చేస్తున్న క్వీన్ కంగనా రనౌత్ చేసిన పోస్టును ఇన్ స్టాగ్రామ్ డిలీట్ చేసింది. ఈ విషయంలో నటి కంగనా మరోపోస్టు చేశారు. తాను చేసిన పోస్టును ఇన్ స్టాగ్రామ్ డిలీట్ చేసింది, ఈ అకౌంట్ లో నేను మరో వారం రోజులకంటే ఎక్కువగా ఉండను అంటూ మరో స్టోరీ పోస్టు చేసింది.

  Sonu Sood Helps Suaresh Raina | Oneindia Telugu
  మేడమ్ మారుతుందా ? లేదా ..... అంతేనా

  మేడమ్ మారుతుందా ? లేదా ..... అంతేనా


  ఇటీవల పశ్చిమ బెంగాల్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ క్వీన్ కంగనా రనౌత్ ట్టిట్టర్ ఖాతాను శాస్వతంగా బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ట్విట్టర్ అకౌంట్ ను బ్యాన్ చేసినా నటి కంగనా రనౌత్ మాత్రం ఆమె ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో చరుకుగా ఉంటున్నారు .ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ కూడా చిన్న ఝలక్ ఇవ్వడంతో నటి కంగనా రనౌత్ ఇక ముందు సోషల్ మీడియాలో అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆమె అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

  English summary
  Kangana: After Twitter Suspension, Instagram takes down Bollywood actress Kangana Ranaut’s post on COVID-19.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X