• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Kangana: రేప్ కేసులో క్వీన్ బాడీగార్డు అరెస్టు, వేరే అమ్మాయితో పెళ్లి ?, వేరే కులం, బ్యూటీషియన్!

|

బెంగళూరు/ముంబాయి/చెన్నై: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ బాడీగార్డును ముంబాయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు అయ్యారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి బ్యూటీషియన్ మీద అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ బాడీగార్డు కుమార్ హెగ్డే వేరే యువతిని పెళ్లి చేసుకోవడానికి సర్వం సిద్దం చేసుకుంటున్న సమయంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.

తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన దగ్గరే డబ్బులు తీసుకుని వెళ్లి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని కులకడానికి కంగనా బాడీగార్డు కుమార్ సిద్దం అయ్యాడని బాధితురాలు కేసు పెట్టింది. వేరే రాష్ట్రంలో తలదాచుకున్న కుమార్ హెగ్డేని పక్కాప్లాన్ ప్రకారం ముంబాయి పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

Illegal affair: మార్కెట్ లో వదిన, మరిది ?, బాహుబలి టైపులో కత్తితో అన్న, జస్ట్ మిస్!Illegal affair: మార్కెట్ లో వదిన, మరిది ?, బాహుబలి టైపులో కత్తితో అన్న, జస్ట్ మిస్!

బ్యూటీషియన్ లేడీ

బ్యూటీషియన్ లేడీ

బాలీవుడ్ హీరోయిన్, ఫైర్ బ్రాండ్ క్వీన్ కంగనా రనౌత్ కు కర్ణాటకలోని మండ్యకు చెందిన కుమార్ హెగ్డే బాడీగార్డుగా పని చేస్తున్నాడు. ముంబాయిలో హీరోయిన్ కంగనా రనౌత్ కు బాడీగార్డుగా పని చేస్తున్న కుమార్ క్వీన్ సన్నిహితులు, ఆమె బంధువులు చాలా క్లోజ్ అని వెలుగు చూసింది. ముంబాయిలోని అంథేరిలో నివాసం ఉంటున్న బ్యూటీషియన్ తో కుమార్ చాలా సన్నిహితంగా ఉంటున్నాడు.

 8 సంవత్సరాలు లవ్!

8 సంవత్సరాలు లవ్!

ముంబాయికి చెందిన బ్యూటీషియన్, బాడీగార్డు కుమార్ గత 8 సంవత్సరాల నుంచి స్నేహితులు అని వెలుగు చూసింది. తరువాత తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన కుమార్ గత జూన్ నెల నుంచి ముంబాయిలోని అథేరిలో ప్రత్యేకంగా ఫ్లాట్ తీసుకుని తనతో సహజీవనం చేశాడని బ్యూటీషియన్ ఆరోపిస్తున్నది.

ఖర్చులకు రూ. 50 వేలు ఇచ్చాను

ఖర్చులకు రూ. 50 వేలు ఇచ్చాను

మూడు నెలల తరువాత నిన్ను కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని కుమార్ తనకు మాట ఇచ్చాడని బ్యూటీషియన్ అంటున్నది. మా అమ్మ చనిపోయారని, అంత్యక్రియలు చెయ్యడానికి కర్ణాటకలోని తన సొంత ఊరైన మండ్యకు వెళ్లాలని తన దగ్గర రూ. 50 వేలు తీసుకుని వెళ్లాడని ముంబాయి బ్యూటీషియన్ స్థానిక అంథేరి పోలీసులకు చెప్పింది.

ఫ్రెండ్ ఫోన్ చేస్తే అసలు విషయం తెలిసింది

ఫ్రెండ్ ఫోన్ చేస్తే అసలు విషయం తెలిసింది

తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన కుమార్ తన దగ్గరే రూ. 50 వేలు తీసుకుని ఊరికి వెళ్లిపోయి అప్పటి నుంచి తనకు కనీసం ఫోన్ చెయ్యలేదని బ్యూటీషియన్ ఆరోపిస్తున్నది. మండ్యలో వేరే అమ్మాయితో కుమార్ పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయ్యాడని స్వయంగా కుమార్ స్నేహితుడు ఒకరు మే 11వ తేదీన తనకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడని, అప్పుడే తనను కుమార్ మోసం చేస్తున్నాడని తనకు తెలిసిందని బ్యూటీషియన్ ఆరోపిస్తున్నది.

 వేరే అమ్మాయితో కుమార్ కు పెళ్లి

వేరే అమ్మాయితో కుమార్ కు పెళ్లి

తనను పెళ్లి చేసుకుంటానని తనను నమ్మించి గత ఏడాది జూన్ నుంచి తన మీద కంగనా రనౌత్ బాడీగార్డు కుమార్ అత్యాచారం చేశాడని, తనను లైంగికంగా వాడుకుని తనను మోసం చేశాడని, అతన్ని అరెస్టు చేసి తనకు న్యాయం చెయ్యాలని బ్యూటీషియన్ ముంబాయిలోని అంథేరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది.

జూన్ 5వ తేదీ పెళ్లికి ఏర్పాట్లు

జూన్ 5వ తేదీ పెళ్లికి ఏర్పాట్లు

జూన్ 5వ తేదీన సొంత ఊర్లో కుమార్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సర్వం సిద్దం చేశారని ముంబాయిలోని బ్యూటీషియన్ కు సమాచారం అందింది. కుమార్ తల్లి తనకు ఫోన్ చేసి మాకులం వేరు, నీ కులం వేరు, అందుకే మా కొడుకు కుమార్ తో నీ పెళ్లి చెయ్యడానికి మాకు ఇష్టం లేదని చెప్పిందని, తరువాత నేను కుమార్ కు సంప్రధించడానికి అనేక ప్రయత్నాలు చేసినా అది సాధ్యం కాలేదని బ్యూటీషియన్ ముంబాయి పోలీసులకు చెప్పింది.

    Mayawati పై Randeep Hooda జోక్, #ArrestRandeelHooda అంటూ డిమాండ్ || Oneindia Telugu
    పెళ్లి కొడుకు కుమార్ అరెస్టు

    పెళ్లి కొడుకు కుమార్ అరెస్టు

    కర్ణాటకలోని మండ్య జిల్లాలోని కేఆర్ పేట సమీపంలోని హెగ్డదహళ్ళిలో కుమార్ తలదాచుకున్నాడని ముంబాయి పోలీసులకు సమాచారం అందింది. మండ్యలోని హెగ్గదహళ్ళికి చేరుకున్న ముంబాయి పోలీసులు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ బాడీగార్డు కుమార్ హెగ్డేని అరెస్టు చేశారు. కుమార్ ను విచారణ చెయ్యడానికి అతన్ని ముంబాయి తీసుకెళ్లారు. మొత్తం మీద రేప్ కేసులో కంగనా రనౌత్ బాడీగార్డు కుమార్ కర్ణాటకలో అరెస్టు కావడం హాట్ టాపిక్ అయ్యింది.

    English summary
    Kangana: Bollywood Actor Kangana Ranaut bodyguard Kumar Hegde arrested in Mandya over allegation of rape.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X