వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Kangana:ప్రపంచంలోనే పనికిరాని సీఎం ఎవరంటే ? క్వీన్ కంగనా ఫైర్, కాశ్యప్ ఏమైనా పిస్తానా, చంపేస్తారా?

|
Google Oneindia TeluguNews

ముంబాయి/ న్యూఢిల్లీ/ బెంగళూరు: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (SSR) అనుమానాస్పద మృతి కేసు, ముంబాయి, బాలీవుడ్ డ్రగ్స్ మాఫియా కేసులు బయటకు వచ్చిన తరువాత మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే, శివసేన నాయకుల మీద బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, క్వీన్ కంగనా రనౌత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. ప్రపంచంలోనే అసమర్థ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే అని క్వీన్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే, శివసేన నాయకులను ఫెవికల్ పట్టుకున్నట్లు క్వీన్ కంగనా రనౌత్ గట్టిగా పట్టుకోవడంతో ఆ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. అసమర్థ సీఎం ఉద్దవ్ ఠాక్రేని, ఆయన్ టీమ్ మెంబర్స్ ను ఎవ్వరూ ప్రశ్నించకూడదా ? ఇదెక్కడి న్యాయం ? అనురాగ్ కాశ్యప్ ఏమైనా పిస్తానా ? అంటూ కంగనా రనౌత్ సోషల్ మీడియాలో ప్రశ్నించడంతో కలకలం రేపింది.

Khiladi wife: కొవ్వు కరిగించాలని భార్య జిమ్ కు, జిమ్ మాస్టర్ కు ఫ్రూట్ జ్యూస్, భర్తకు ఖాళీ గ్లాస్!Khiladi wife: కొవ్వు కరిగించాలని భార్య జిమ్ కు, జిమ్ మాస్టర్ కు ఫ్రూట్ జ్యూస్, భర్తకు ఖాళీ గ్లాస్!

 యూట్యూబర్ పై కక్ష ?

యూట్యూబర్ పై కక్ష ?

మహారాష్ట్ర ప్రభుత్వం తీరును ప్రశ్నించిన వారు అందరూ జైలుకు పోవాల్సిందేనా ? అంటూ క్వీన్ కంగనా రనౌత్ ప్రశ్నించారు. హరియాణాకు చెందిన యూట్యూబర్ సాహిల్ చౌదరి మహారాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకు ఆయన్ను అరెస్టు చేసి జైలుకు పంపించారని బాలీవుడ్ నటి క్వీన్ కంగనా రనౌత్ విచారం వ్యక్తం చేశారు.

 ఆ హక్కు చౌదరికి ఉంది

ఆ హక్కు చౌదరికి ఉంది

ప్రభుత్వాలను ప్రశ్నించడం ప్రజల హక్కు అనే విషయం అధికారంలో ఉన్న నాయకులు మరిచిపోకూడదని నటి కంగనా రనౌత్ గుర్తు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సాహిల్ చౌదరి మీద ఎవరో కేసు పెట్టడం, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యడం జరిగిందని నటి కంగనా రనౌత్ ఆరోపించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే సాహిల్ చౌదరిని అరెస్టు చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం అతన్ని జైల్లో పెట్టిందని నటి కంగనా రనౌత్ విచారం వ్యక్తం చేశారు.

అనురాగ్ కాశ్యప్ పిస్తానా ?

బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కాశ్యప్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని నటి పాయల్ ఘోష్ నెత్తినోరు మొత్తుకుంటున్నా ఆయన మీద ఎలాంటి కేసులు నమోదు కాలేదని నటి కంగనా రనౌత్ ఆరోపించారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కాశ్యప్ దర్జాగా, స్వేచ్చగా తిరుగుతున్నాడని, అతనేమైనా పిస్తానా ? అంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మహారాష్ట్ర ప్రభుత్వం మీద విరుచుకుపడింది.

 ప్రపంచంలోనే అసమర్థ సీఎం

ప్రపంచంలోనే అసమర్థ సీఎం

ప్రజలకు న్యాయం చేస్తామని అధికారంలోకి వచ్చిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే అదే ప్రజలను కాల్చుకుని తింటున్నారని నటి కంగనా రనౌత్ విమర్శించారు. ప్రపంచంలోనే అసమర్థ సీఎం ఎవరైనా ఉన్నారంటే అది మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఒక్కరే అంటూ బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ట్వీట్ చెయ్యడం కలకలం రేపింది.

Recommended Video

Deepika Padukone : NCB ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరై 3 సార్లు బోరున ఏడ్చేసిన Deepika Padukone
 మన ఇళ్లను పగలకొట్టి మనల్నే చంపేస్తారు !

మన ఇళ్లను పగలకొట్టి మనల్నే చంపేస్తారు !

మన ఇళ్లను పగలకొట్టి (ముంబాయిలో నటి కంగనా రనౌత్ భనం కొట్టేశారు) మనల్ని చంపడమేనా మీ ప్రభుత్వ లక్షం ?, దీనికి ఎవరెవరు బదులిస్తారు ? అంటూ నటి కంగనా రనౌత్ మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయిన కాంగ్రెస్ పార్టీని ట్యాగ్ చేస్తూ ఆమె సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురుపిస్తోంది. మొత్తం మీద బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇటు మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వం, సీఎం ఉద్దవ్ ఠాక్రే, శివసేన, కాంగ్రెస్ పార్టీ నాయకులను సోషల్ మీడియాలో ఊడ్చేస్తోంది. మహారాష్ట్ర VS క్వీన్ కంగనా రనౌత్ వ్యవహారం ఎక్కడికి వెలుతుందో అంటూ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

English summary
Kangana: Bollywood Actress Kangana Ranaut Again Hits Back At Maharashtra Chief Minister Uddhav Thackeray.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X