వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Kangana: కంగనా సిస్టర్స్ కు రిలీఫ్, డేట్ ఫిక్స్ చేసిన హైకోర్టు, ఆ రోజు పోలీసులకు మండితే అంతే !

|
Google Oneindia TeluguNews

ముంబాయి/ న్యూఢిల్లీ: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, క్వీన్ కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోళి తాత్కాలికంగా ఊపిరిపీల్చుకున్నారు. మూడుసార్లు సమన్లు జారీ చేసి విచారణకు హాజరుకావాలని ముంబాయి పోలీసులు సూచించినా క్వీన్ కంగనా, ఆమె సోదరి రంగోళి డోంట్ కేర్ అంటున్నారు. అయితే ఇదే సమయంలో ఎక్కడ పోలీసులు అరెస్టు చెయ్యడానికి ప్రయత్నిస్తారో అనే భయంతో బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోళి బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కంగనా రనౌత్ పిటిసన్ ను విచారణ చేసిన బాంబే హైకోర్టు కంగనా సిస్టర్స్ కు తాత్కాలికంగా రిలీఫ్ ఇచ్చింది. అయితే విచారణకు పోలీసుల ముందు హాజరుకావాలి హైకోర్టు డేట్ ఫిక్స్ చెయ్యడంతో కంగనా రనౌత్ సిస్టర్స్ కొంతకాలం తరువాత కచ్చితంగా పోలీసుల ముందు హాజరై ప్రజెంట్ సార్ అని చెప్పాల్సి ఉంటుంది. ఆ రోజు పోలీసులకు మండితే ఏం జరుగుతుందో ? అనే విషయం వేచి చూడాలి.

Aishwarya:డీకే కుమార్తె ఐశ్వర్య నిశ్చితార్థం, పొలిటికల్ వార్ పక్కనపెట్టి హాజరైన సీఎం, అందరూ హ్యాపీ!Aishwarya:డీకే కుమార్తె ఐశ్వర్య నిశ్చితార్థం, పొలిటికల్ వార్ పక్కనపెట్టి హాజరైన సీఎం, అందరూ హ్యాపీ!

కంగనా సిస్టర్స్ అమాయకులను రెచ్చగొట్టారు

కంగనా సిస్టర్స్ అమాయకులను రెచ్చగొట్టారు


బాలీవుడ్ నటి క్వీన్ కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోళి మతపరమైన ఆరోపణలు చేశారని, మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని, సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించేలా ప్రవర్తిస్తున్నారని ముంబాయికి చెందిన ప్రముఖ న్యాయవాది ఆలీ కాశీఫ్ దేశ్ ముఖ్ కోర్టులో ఆరోపించారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోళి ప్రజలను రెచ్చగొడుతున్నారని, అక్కాచెల్లెలు ఇద్దరూ రెచ్చిపోయి క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని న్యాయవాది ఆలీ కాశీఫ్ దేశ్ ముఖ్ బాంద్రా మెజిస్ట్రేట్ కోర్టులో మనవి చేశారు.

బాలీవుడ్, పొలికల్ సపోర్టు

బాలీవుడ్, పొలికల్ సపోర్టు

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ కు బాలీవుడ్ చిత్రపరిశ్రమలో మంచి పలుకుబడి ఉందని, సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న ఆముకు రాజకీయ నాయకులతో ఎక్కువ పరిచయాలు అయ్యాయని, నేను ఏమి చేసినా ఏమీ కాదు అనే ధైర్యంతో రెచ్చిపోతుందని న్యాయవాది ఆలీ కాశీఫ్ దేశ్ ముఖ్ ఆరోపించారు. రాజకీయ పలుకుబడి అడ్డంపెట్టుకుని ఇటీవల కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోళి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని న్యాయవాది ఆలీ కాశీఫ్ దేశ్ ముఖ్ కోర్టులో చెప్పారు.

కంగనా సిస్టర్స్ పై ఎఫ్ఐఆర్

కంగనా సిస్టర్స్ పై ఎఫ్ఐఆర్

ముంబాయి న్యాయవాది ఆలీ కాశీఫ్ దేశ్ ముఖ్ ఆరోపణలపై వివరాలు తెలుసుకున్న మెజిస్ట్రేట్ న్యాయస్థానం న్యాయమూర్తి బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోళిపై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ తయారు చేసి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ముంబాయి పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ఆదేశాలతో కంగనా రనౌత్, రంగోళిపై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ తయారు చేసిన ముంబాయి పోలీసులు కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోళిపై విచారణ చేపట్టారు.

ముంబాయి పోలీసులు అంటే లెక్కలేదా ?

ముంబాయి పోలీసులు అంటే లెక్కలేదా ?

బాలీవుడ్ బ్యూటీ క్వీన్ కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోళిపై కేసు నమోదు చేసిన ముంబాయి పోలీసులు విచారణకు హాజరుకావాలని ఈనెల మొదటి వారంలోనే ఇద్దరికీ సమన్లు జారీ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మూడుసార్లు సమన్లు జారీ చేసినా కంగనా రనౌత్ కాని, ఆమె సోదరి రంగోళి కాని ఇంతవరకు ముంబాయి పోలీసుల ముందు హాజరుకాలేదు. నవంబర్ 23వ తేదీ కచ్చితంగా హాజరుకావాలని కంగనా, ఆమె సోదరికి ముంబాయి పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అయినా కంగనా సిస్టర్స్ మాత్రం పట్టించుకోలేదు. ఇదే సమయంలో కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోళిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ముంబాయి పోలీసులు డిసైడ్ అయ్యారని తెలిసింది.

 ఎఫ్ఐఆర్ రద్దు చెయ్యండి

ఎఫ్ఐఆర్ రద్దు చెయ్యండి

ముంబాయి పోలీసులు తమ మీద కేసు నమోదు చేసి విచారణకు హాజరుకావాలని బెదిరిస్తున్నారని, మేము ఏ తప్పు చెయ్యలేదని, మా మీద నమోదైన ఎఫ్ఐఆర్ ను రద్దు చెయ్యాలని కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోళి బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తమ మీద విచారణ చెయ్యాలని బాంద్రా మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చెయ్యాలని కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోళి బాంబే హైకోర్టుకు మనవి చేశారు.

 జనవరి 8 డేట్ ఫిక్స్

జనవరి 8 డేట్ ఫిక్స్

బాంబే హైకోర్టులో కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోళని సమర్పించిన పిటిషన్ విచారణ జరిగింది. జనవరి 8వ తేదీ వరకు కంగనా రనౌత్, ఆమె సోదరి మీద ఎలాంటి చర్యలు తీసుకోరాదని బాంబే హైకోర్టు ముంబాయి పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో జనవరి 8వ తేదీ ముంబాయి పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలని కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోళనికి బాంబే హైకోర్టు సూచించింది. జనవరి 8వ తేదీ వరకు ఊపిరిపీల్చుకుంటున్నారు. అయితే ఆ రోజు కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోళి ఆ రోజు మాత్రం కచ్చితంగా పోలీసు అధికారుల ముందు హాజరుకావాల్సి ఉంటుంది. జనవరి 8వ తేదీ ఏం జరుగుతుందో ? అనే విషయం మాత్రం వేచిచూడాల్సిందే.

English summary
Kangana: Bollywood actress Kangana Ranaut, sister will appear before Mumbai cops on January 8, orders Bombay High Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X