• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Kangana VS Roopa: నటి, ఐపీఎస్ దీపావళి మాటల యుద్దం, నీ పని నువ్వు చేసుకో, కంగనా..... నీకేం పనిలేదా?

|

బెంగళూరు/ ముంబాయి: బాలీవుడ్ హాట్ బ్యూటీ, క్వీన్ కంగనా రనౌత్ ఏదో ఒకరకంగా ప్రముఖలపై పంచ్ లు వేస్తూ కాలం గడుపుతోంది. మహారాష్ట్ర సీఎం, శివసేన, కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఇప్పటికే తీవ్రస్థాయిలో విరుచుకుపడిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇప్పుడు కర్ణాటక ఐపీఎస్ అధికారిణి డి. రూపా పై ఆమె మాటలతో ప్రతాపం చూపిస్తున్నారు. దీపావళి పండగ సందర్బంగా టపాకాయలు కాల్చడం భారతదేశ సంస్కృతి కాదని ట్వీట్ చేసిన ఐపీఎస్ లేడీ ఆఫీసర్ రూపా మీద కంగనా ఫైర్ అయ్యారు. నువ్వు ప్రభుత్వ ఉద్యోగి, భారతదేశ చరిత్ర, హిందూ సంస్కృతి తెలుసుకుని మాట్లాడండి, నోటికి ఏది వస్తే అది మాట్లాడటం, సోషల్ మీడియాలో ట్వీట్ లు చేసి ప్రజలను తప్పదోవ పట్టించకండి, మీ పని మీరు చేసుకోండి అంటూ కంగనా ఉచిత సలహా ఇచ్చింది. కంగనా నీ పని నువ్వు చేసుకో, నీకేం పనిపాట లేదా ? అంటూ నెటిజన్లు కంగనాపై విరుచుకుపడుతున్నారు.

Ex lover:నగ్న ఫోటోలు, వీడియోల దెబ్బకు రూ. 1. 25 కోట్లు స్వాహా, మాజీ ప్రియుడి ఎఫెక్ట్, సోషల్ మీడియాలోEx lover:నగ్న ఫోటోలు, వీడియోల దెబ్బకు రూ. 1. 25 కోట్లు స్వాహా, మాజీ ప్రియుడి ఎఫెక్ట్, సోషల్ మీడియాలో

ఐపీఎస్ లేడీ ఆఫీసర్

కర్ణాటక ఐపీఎస్ లేడీ ఆఫీసర్ డి. రూపా అంటే తెలియని వాళ్లు ఉండరు. అక్రమాస్తుల కేసులో బెంగళూరు సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న వీకే. శశికళ నటరాజన్ జైల్లో ఎంత లగ్జరీ లైఫ్ గడుపుతున్నారో అనే విషయం ప్రపంచానికి సాక్షాలతో సహ చూపించిన ఐపీఎస్ అధికారిని రూపా అప్పట్లో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు. లేడీ ఐపీఎస్ అధికారి రూపా దెబ్బకు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి నెచ్చలి శశికళ నటరాజన్ సైలెంట్ అయిపోయారు.

రూపా ఏం చెప్పారంటే ?

దీపావళి పండుగ సందర్బంగా బాణాసంచా (టపాకాయలు) కాల్చడం మన హిందూ సాంప్రధాయం కాదు ఐపీఎస్ అధికారిని డి. రూపా ట్వీట్ చేశారు. టపాకాయలు కాల్చడం మనదేశ సంస్కృతి కాదని, మన పురాణాల్లో, మన కావ్యాల్లో ఎక్కడా బాణాసంచా కాల్చాలని చెప్పలేదని, యూరప్ దేశాల నుంచి మనకు ఆ సంస్కృతి భారతదేశానికి వచ్చిందని, మొదట టపాకాయలు యూరప్ దేశాల నుంచి భారతదేశానికి వచ్చాయని ఐపీఎస్ లేడీ ఆఫీసర్ డి. రూపా నవంబర్ 14వ తేదీన ట్వీట్ చేశారు. కరోనా వైరస్ కారణంగా బాణాసంచా కాల్చడాన్ని ప్రభుత్వం నిషేధించిన తరువాత ఐపీఎస్ అధికారిని డి. రూపా ఈ ట్వీట్ చేశారు.

నేను ఉన్నానని పైకిలేచిన కంగనా

కర్ణాటక ఐపీఎస్ అధికారిని డి. రూపా ట్వీట్ విషయంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చజరిగింది. దీపావళి పండుగ సందర్బంగా బాణాసంచా, టపాకాయలు కాల్చడం భారతదేశ సంస్కృతి, మన సంప్రాధాయలను మనం గౌరవించకపోతే ఎలా ? ప్రభుత్వం ఇప్పుడు బాణాసంచాను బ్యాన్ చేసిందని మీరు అలా మాట్లాడుతున్నారని, బాణాసంచాను నిషేధించాలని ప్రజలకు మీరు పరోక్షంగా చెబుతున్నారని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. ఇదే సమయంలో నేను ఉన్నాను అంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కర్ణాటక ఐపీఎస్ అధికారిని రూపా మీద విరుచుకుపడ్డారు.

నీ పని నువ్వు చేసుకో.... చరిత్ర గురించి చెబుతావా ?


మీరు ఐపీఎస్ అధికారి, ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ప్రజలకు సేవ చెయ్యడం మానేసి మాకు ఉచిత సలహాలు ఇస్తావా ? అంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఐపీఎస్ అధికారిని రూపా మీద విరుచుకుపడుతూ ట్వీట్ చేశారు. మిడిమిడి జ్ఞానంతో, అజ్ఞానంగా ఇలాంటి ఉచిత సలహాలు ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బాలీవుడ్ నటి క్వీన్ కంగనా రనౌత్ ట్వీట్ చేస్తూ ఐపీఎస్ అధికారిని రూపాపై విమర్శలు చేశారు.

కంగనా.... నీకు ఏం సంబంధం ?

సోషల్ మీడియాలో విమర్శలు ఎక్కువ కావడంతో ఐపీఎస్ అధికారి రూపా ఆమె ట్వీట్ ను బ్లాక్ చేశారు. ఇప్పటికే నోటిదూలతో అనేక కేసులతో సతమతం అవుతున్న నటి కంగనా రనౌత్ కు నెటిజన్లు చరకలు అంటిస్తున్నారు. కష్టపడి ఐపీఎస్ అధికారి అయిన రూపాకు మీరు ఉచిత సలహాలు ఇస్తున్నారా, మీ పని మీరు చూసుకోండి, దీనికి మీకు ఎమిటి సంబంధం ?, అన్నింటికి నేను ఉన్నాను అంటూ పైకి ఎగిరిపడకు అంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మీద నెటిజన్లు మండిపడుతున్నారు.

English summary
Kangana: Deepavali firecrackers war of words between Karnataka IPS D Roopa and twitter users and actor Kangana Ranaut.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X