• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Kangana effect: కంగనా దెబ్బకు మీడియాకు ఇండిగో బంపర్ ఆఫర్, 15 రోజు బ్యాన్, మేడమ్ అంతే!

|

ముంబాయి/ న్యూఢిల్లీ/ బెంగళూరు: బాలీవుడ్ క్వీన్, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఏదో ఒకరకంగా ప్రతినిత్యం మీడియాలో నానుతోంది. క్వీన్ కంగనా రనౌత్ విమానంలో ప్రయాణించే సందర్బంలో అదే విమానంలో ఉన్న 9 మంది మీడియా సిబ్బంది అనుచితంగా ప్రవర్తించారని ఆరోపణలు ఉన్నాయి. మీడియా సిబ్బంది కరోనా వైరస్ నియమాలు గాలికి వదిలేశారని, నిబంధనలు పాటించలేదని ఆరోపిస్తూ 15 రోజులు విమాన ప్రయాణాలపై ఇండిగో సంస్థ నిషేధం విదించింది. DGCA రూల్స్ పాటించలేదని విమాన ప్రయాణాలపై నిషేధం విదించడంతో కంగనా రనౌత్ మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. దసరా సందర్బంగా మీడియాకు కంగనా వలన ఇలా బంపర్ ఆఫర్ వచ్చింది.

Video viral: 150 మందిలో రేప్ సీన్, ఎడిటింగ్ లో ఎగిరింది, నెట్ లో ఫర్ సేల్, నటి ఆత్మహత్యాయత్నం !

మేడమ్ హాట్ టాపిక్

మేడమ్ హాట్ టాపిక్

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (SSR) అనుమానాస్పద మరణం తరువాత బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఏరోజు అయితే మహారాష్ట్ర ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏదో ఒకరకంగా మీడియాలో నానుతూనే ఉంది. చాన్స్ చిక్కినప్పుడల్లా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేతో పాటు ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే, శివసేన నాయకులను ఏకిపారేస్తున్న కంగనా రనౌత్ మీడియాకు మంచి విందు భోజనం అయ్యింది.

 బీజేపీకి జై కొట్టిన క్వీన్

బీజేపీకి జై కొట్టిన క్వీన్

మహారాష్ట్ర ప్రభుత్వం, శివసేన, కాంగ్రెస్ నాయకులపై విమర్శలు గుప్పిస్తున్న నటి కంగనా రనౌత్ బీజేపీకి పూర్తి మద్దతుదారుగా గుర్తింపు తెచ్చుకుంది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కంగనాకు భద్రత కేటాయించడం కూడా చర్చకు దారితీసింది. సామాన్యుల కష్టాలు గాలికి వదిలేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కంగనాకు జడ్ ప్లస్ భద్రత కేటాయించి కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి.

ఆ రోజు విమానంలో !

ఆ రోజు విమానంలో !

ఈనెల 9వ తేదీన చండీగఢ్ నుంచి ముంబాయికి ఇండిగో విమానం 6E-264 బయలుదేరింది. ఆ విమానంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తో పాటు మీడియా సిబ్బంది ఉన్నారు. ఆ సందర్బంలో విమానంలో బాలీవుడ్ నటి కంగనా రనౌతో మీడియా సిబ్బంది అనుచితంగా ప్రవర్తించారని ఆరోపణలు ఉన్నాయి. అనుమతి లేకుండా కంగనాను ఫోటోలు, వీడియోలు తీశారని మీడియాపై ఆరోపణలు చేశారు.

  Kangana Ranaut : రైతులను కించపరిచిన కంగనా పై FIR.. సారీ చెప్తానంటున్న బ్యూటీ! || Oneindia Telugu
   15 రోజులు బ్యాన్

  15 రోజులు బ్యాన్

  విమానంలో నటి కంగనా రనౌత్ విషయంలో 9 మంది ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బంది అనుచితంగా ప్రవర్తించారని, కరోనా నియమాలు గాలికి వదిలేసి సమదూరం పాటించకుండా సాటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించారని, ఆ 9 మంది మీడియా సిబ్బంది మీద అక్టోబర్ 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మా విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విదించామని ఇండిగో విమానయాన సంస్థ తెలిపింది.

  DGCA నియమాలు గాలికి ?

  DGCA నియమాలు గాలికి ?

  చండీగఢ్ నుంచి ముంబాయి వెళ్లిన ఇండిగో విమానంలో Directorate General of Civil Aviation (DGCA) నియమాలు పాటించడంలో 9 మంది ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బంది విఫలం అయ్యారని ఇండిగో విమాన సంస్థ ఆరోపించింది. నటి కంగనాతో అనుచితంగా ప్రవర్తించారని విచారణలో వెలుగు చూసిందని, అందుకే 9 మంది మీడియా సిబ్బందిపై 15 రోజులు విమాన ప్రయాణాలపై నిషేధం విదించామని ప్రముఖ విమాన సంస్థ ఇండిగో తెలిసింది. ఈ విషయంపై 9 మంది మీడియా సిబ్బందికి సమాచారం ఇచ్చామని ఇండిగో విమాన సంస్థ తెలిపింది. మొత్తం మీద మేడమ్ కంగనా రనౌత్ దెబ్బతో ఇప్పుడు మీడియా సిబ్బందికి సమస్యలు మొదలైనాయి.

  English summary
  Kangana effect: IndiGo has barred nine media persons for 15 days for unruly behaviour while they were on the same flight in which Bollywood actor Kangana Ranaut was heading to Mumbai from Chandigarh.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X