Kangana: ఫైర్ బ్రాండ్ కంగనా పై ఐదు సెక్షలతో ఎఫ్ఐఆర్, జస్ట్ సారీ చెబుతుందంట, ముంబాయి మసాలా !
బెంగళూరు/ ముంబాయి/ తుమకూరు: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, క్వీన్ కంగనా రనౌత్ పై ఐదు సెక్షన్ ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. న్యాయస్థానం ఆదేశాలతో ఫైర్ బ్రాండ్ నటి కంగనా రనౌత్ పై కేసు నమోదు చేసిన క్యాతసంద్ర పోలీసులు విచారణ పూర్తి చేసి కోర్టులో నివేదిక సమర్పించడానికి సిద్దం అయ్యారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన వ్యవసాయ బిల్లులపై నిరసన వ్యక్తం చేస్తున్న అన్నదాతలను ఉగ్రవాదులతో పోల్చిన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కు కష్టాలు ఎదురైనాయి. అన్నం పెట్టే అన్నదాతలను ఉగ్రవాదులతో పోల్చి రైతులను కించపరిచిందని నటి కంగనా రనౌత్ మీద కోర్టులో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు ఇప్పుడు కంగనా రనౌత్ పై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. అయితే తాను జస్ట్ సారీ చెబుతానని కంగనా కొవ్వు పట్టినట్లు చెప్పడంతో అన్నదాతలు మరింత మండిపడుతున్నారు.
Boss wife: బాస్ భార్యతో లింక్, పనోడికి ప్రతిరోజూ పండగే, బెడ్ రూమ్, వాష్ రూమ్, 100 వీడియోలతో, పాపం !

కేంద్ర ప్రభుత్వంతో ఢీకొట్టిన రైతులు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై కొంతకాలం నుంచి రైతన్నలు భగ్గుంటున్నారు. తమకు నష్టం కలిగించే ఈ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా అన్నదాతలు నిరసనలు వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా కొన్ని రోజుల క్రితం అన్నదాతల ఆందోళనలతో అట్టుడికిపోయింది. దేశవ్యాప్తంగా అన్నదాతలకు అనేక పార్టీలు, పలు సంఘ సంస్థలు, ప్రజలు, ఉద్యోగ సంఘాలు, మహిళా సంఘాలు, ఇలా దాదాపుగా ప్రతిరంగంలోని వారు మద్దతు తెలిపాయి.

కంగనాకు ఏం సంబంధం ?
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (SSR) అనుమానాస్పద మృతి కేసు, బాలీవుడ్ డ్రగ్స్ మాఫీయా కేసుల తరువాత ఒక్కసారిగా మహారాష్ట్ర ప్రభుత్వం, శివసేన, కాంగ్రెస్ పార్టీల నాయకులపై విరుచుకుపడుతున్న బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, క్వీన్ కంగనా రనౌత్ ఏదో ఒకరకంగా వార్తల్లో నిలుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లును దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అన్నదాతలు వ్యతిరేకిస్తున్నారు. రైతన్నలు ఆందోళనలు చేస్తున్న సమయంలో పనిపాట లేకుండా అక్కడా ఇక్కడ తిరుగుతున్న బాలీవుడ్ హీరోయిన్ క్వీన్ కంగనా రనౌత్ రైతులను ఉగ్రవాదులతో పోల్చుతూ ఓ ట్విట్ చెయ్యడం కలకలం రేపింది.

ముంబాయి టూ తుమకూరు
అన్నదాతలను ఉగ్రవాదులతో పోల్చుతూ నటి కంగనా రనౌత్ ట్విట్ చేసి రైతన్నలను అవమానించారని, ఆమె మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కర్ణాటక హైకోర్టు న్యాయవాది, తుమకూరు నివాసి ఎల్. రమేష్ నాయక్ సెప్టెంబర్ 22వ తేదీన కర్ణాటక డీజీపీ, తుమకూరు జిల్లా ఎస్పీకి ఇ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. నటి కంగనా రనౌత్ పై పోలీసులు కేసు నమోదు చేసి చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ న్యాయవాది రమేష్ నాయక్ తుముకూరు జేఎంఎఫ్ సీ న్యాయస్థానంలో కేసు పెట్టారు.

కంగనా తిక్కకుదిరింది
నటి కంగనా రైతులను ఉగ్రవాదులతో పోల్చుతూ చేసిన ట్వీట్, సోషల్ మీడియా కామెంట్లను కర్ణాటక హైకోర్టు న్యాయవాది రమేష్ తుముకూరు కోర్టుకు సమర్పించారు. కేసు వాదనలు పూర్తి అయ్యాయి. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తుమకూరు జేఎంఎఫ్ సీ న్యాయస్థానం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో తమని కించపరిచిన కంగనాకు తిక్క కుదురుతుందని అన్నదాతలు అంటున్నారు.

కంగనాపై ఐదు సెక్షల కింద కేసులు
కోర్టు ఆదేశాలతో తుమకూరులోని క్యాతసంద్ర పోలీసులు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై ఐపీసీ సెక్షన్ 44, 108, 153, 153 (ఎ), 504 ఐపీసీ- 1860 సెక్షన్ ల కింద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ తయారు చేసి విచారణ మొదలు పెట్టారు. రైతులను కించపరిచిన నటి కంగనా రౌనత్ కు కర్ణాటక పోలీసులు సరైనబుధ్ది చెబుతారని అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు.

అలా జరిగితే సారీ చెబుతా: కంగనా
రైతులను ఉగ్రవాదులతో పోల్చిన నటి కంగనా రనౌత్ మీద కేసు నమోదు కావడంతో ఆమె హడలిపోయింది. తాను రైతులను ఉగ్రవాదులతో పోల్చలేదని, వారు రోడ్ల మీద, రైలు పట్టాల మీద నిద్రపోతున్నట్లు నటిస్తున్నారని, నిరసన వ్యక్తంచేసే తీరు ఇదికాదని మాత్రమే ట్వీట్ చేశానని క్వీన్ కంగనా రనౌత్ వివరణ ఇచ్చుకునింది. ఒకవేళ పోలీసుల విచారణలో తాను తప్పు చేశాను అని రుజువు అయితే తాను రైతులకు క్షమాపణ (sorry) చెబుతానని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రౌనత్ తనదైన శైలీలో గర్వంగా సమాధానం ఇవ్వడంతో రైతులు మరింత మండిపడుతున్నారు. మొత్తం మీద అమ్మడు క్వీన్ కంగనా రనౌత్ తముకూరు కోర్టు మెట్టలు ఎక్కడానికి సిద్దం అవుతోందని తెలిసింది.