Kangana: మేడమ్ తో పెట్టుకున్న ఎమ్మెల్యేకి సీన్ సితార, మూడు రాష్ట్రాల్లో ఐటీ దాడులు, పాపం !
ముంబాయి/ సోలాపూర్: బాలీవుడ్ నటి, క్వీన్ కంగనాతో పెట్టుకున్న ఎమ్మెల్యేకి ఆదాయపన్ను శాఖ అధికారులు సినిమా చూపించారు. మేడమ్ సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లిన ఎమ్మెల్యే నానా రచ్చ చేశాడు. కంగనాతో పెట్టుకున్న అయ్యగారి కంపెనీలు, కార్యాలయాలపై ఐటీ శాఖ అధికారులు మూడు రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు చెయ్యడం కలకలం రేపింది.
Social Media: అమ్మాయిలు, ఆంటీలు టార్గెట్, సరదా, జల్సా కోసం ఏం చేశాడంటే, 50 మందితో !
హీరోయిన్ పై ఎమ్మెల్యే ఫైర్
మధ్యప్రదేశ్ లోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నీల్ దాగా కొంతకాలం నుంచి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మీద విరుచుకుపడుతూ ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా, ఆ పార్టీలో చురుకైన నాయకుడిగా నీలై దాగాకు మంచి పేరు పలుకుబడి ఉంది. ఎమ్మెల్యేగా నీలై దాగా ఓ వెలుగు వెలుగుతున్నాడు.
కంగనాతో పెట్టుకున్నాడు.... పాపం
గత కొంతకాలం నుంచి బాలీవుడ్ హీరోయిన కంగనా మీద కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నీలై దాగా విమర్శలు చేస్తున్నాడు. రైతుల ఆందోళనపై విమర్శలు చేసిన కంగనా మీద కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నీలై దాగా తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. కొంతకాలంగా కంగనా మీద తీవ్ర విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నీలై దాగా హాట్ టాపిక్ అయ్యాడు.
జస్ట్ మూడు రాష్ట్రాలు.....14 చోట్ల రైడ్
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నీలై దాగాకు ఆయిల్ వ్యాపారం ఉంది. ఆయిల్ వ్యాపారంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నీలై దాగా జోరుగానే సంపాధిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నీలై దాగాకు చెందిన మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కోల్ కత్తా, మహారాష్ట్రలోని ముంబాయి, సోలాపూర్ లోని ఆయన కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ (IT) అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు.
దెబ్బకు మైండ్ బ్లాక్
ఆయిల్ వ్యాపారంతో పాటు ఎమ్మెల్యే నీలై దాగాకు విద్యాసంస్థలు ఉన్నాయి. నీలై దాగా ఫ్యాక్టరీలు, కార్యాలయాలు, విద్యాసంస్థల్లో అవినీతి జరిగిందని ఆరోపణలు రావడం వలనే తాము సోదాలు చేశామని, రికార్డులు పరిశీలిస్తున్నామని ఐటీ శాఖ అధికారులు చెప్పారు. నీలై దాగా తండ్రి వినోద్ దాగా కూడా మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయ్యారు. ఇటీవల కంగనా నటిస్తున్న సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నీలై దాగా నానా హంగామా చేసిన విషయం తెలిసిందే.