• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నన్ను రేప్ చేయడానికి బీజేపీ అనుమతించాలా?: సంజయ్ రౌత్‌పై కంగనా రనౌత్ ఫైర్ : గవర్నర్‌తో భేటీ

|

అక్రమ నిర్మాణం సాకుతో బాంద్రాలోని తన ఆఫీసును ముంబై మున్సిపల్ అధికారులు కూల్చేసిన ఘటనపై ఫిర్యాదు చేసేందుకుగానూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆదివారం సాయంత్రం మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీని ముంబైలోని రాజ్ భవన్ లో కలిశారు. అంతకుముందు, తన వెనుక బీజేపీ ఉందంటూ ఆరోపణలు చేసిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ను ఉద్దేశించి నటి సంచలన వ్యాఖ్యలు చేశారు.

కంగనా రనౌత్‌కు సీఎం ఘాటు హెచ్చరిక - మౌనాన్ని బలహీనతగా చూడొద్దు - కరోనాపై ఉద్ధవ్ ఠాక్రే కొత్త ప్లాన్

కంగనా లొల్లికి అసలు కారణమిదే..

కంగనా లొల్లికి అసలు కారణమిదే..

సుశాంత్ సింగ్ ఆత్మహత్య, కంగనా రనౌత్ వ్యవహారంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆదివారం నాటి ‘సామ్నా' పత్రికలో సుదీర్ఘ వ్యాసం రాశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్ పుత్ వర్గం ఓట్లను పొందేందుకే బీజేపీ దురుద్దేశ పూర్వకంగా సుశాంత్ సింగ్ ఆత్మహత్యను రాజకీయం చేస్తున్నదని, మహారాష్ట్రను అవమానపరిచిన వారికి మద్దతిస్తూ బిహార్‌ లో గెలవాలనుకుంటున్నదని, కంగనా వెనుక ఉన్నది కాషాయనేతలే అని అందరికీ తెలుసని రౌత్ పేర్కొన్నారు. కొందరికి ముంబై ప్రాధాన్యత కేవలం డబ్బు సంపాదించేందుకేనని, ముంబైని ఎవరైనా రేప్‌ చేసినా వారికి పట్టదని, ఇలాంటి తరుణంలోనే మహారాష్ట్ర ఒక్కటిగా నిలవాలని రౌత్ రాసుకొచ్చారు. సామ్నాలో ఆయన రాసిన కామెంట్లపై కంగన ట్విటర్ లో స్పందించారు.

అంటే రేప్ కు అనుమతించాలా?

అంటే రేప్ కు అనుమతించాలా?

తనకు బీజేపీ అండ ఉందనడంపై నటి కంగనా అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ‘‘నిజమే, డ్రగ్ రాకెట్ మాఫియాను బద్దలు కొట్టిన వారికి బీజేపీ మద్దతివ్వడం అత్యంత దురదృష్టకరం. అలా మద్దతు ఇచ్చేకంటే.. శివసేన గుండాలు నాపై దాడి చేయడానికి, నన్ను రేప్ చేయడానికి బీజేపీ మద్దతివ్వాల్సింది కదా.. అంతేనంటారా సంజయ్ జీ?'' అని కంగన సెటైర్లు వేశారు. బీజేపీతో నటికి దగ్గరి సంబంధాలున్నాయని చర్చ జరుగుతుండగానే, ఆమెకు గవర్నర్ నుంచి పిలుపు రావడం గమనార్హం.

మూత్రంలో నీళ్లు కలిపిన నటి రాగిణి - డ్రగ్స్ కేసులో సీబీఐ, డాక్టర్లకు చుక్కలు - సంజనాతో ఫైటింగ్

గవర్నర్ తో కంగనా భేటీ

గవర్నర్ తో కంగనా భేటీ

నటి కంగనా రనౌత్ ఆఫీసును బృహన్ ముంబై మున్పిపల్ కార్పొరేషన్(బీఎంసీ) అధికారులు కూలగొట్టడాన్ని మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఇదివరకే తప్పు పట్టడం తెలిసిందే. సీఎం ఉద్ధవ్ ఠాక్రే ముఖ్య సలహాదారుకు తన అసంతృప్తిని తెలిపిన గవర్నర్.. ఆదివారం కంగనాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. సాయంత్రం 4.30కు రాజ్ భవన్ వచ్చిన కంగనా తాను ఎదుర్కొంటున్న సమస్యలను కోశ్యారీకి వివరించి, న్యాయం చేయాల్సిందిగా అభ్యర్థించారు. గవర్నర్ ను కలిసిన సందర్భంలో కంగనా వెంట ఆమె సోదరి రంగోలి కూడా ఉన్నారు.

కంగ‌నా మాజీ ప్రియుడి వీడియోలు వైరల్

కంగ‌నా మాజీ ప్రియుడి వీడియోలు వైరల్

మహారాష్ట్ర ప్రభుత్వం, కంగనా రనౌత్ ల మధ్య వివాదం కొనసాగుతున్న వేళ... నటి మాజీ ప్రియుడు అధ్యాయ‌న్ సుమ‌న్ కీలక విషయాలు బయటపెట్టాడు. కంగనాకు డ్రగ్స్ అలవాటు ఉందని, తన ముందే ఎన్నోసార్లు మాదక ద్రవ్యాలను సేవించిందని, కొకైన్ తీసుకోవాలంటూ తనను కూడా ఒత్తిడి చేసిందని సుమన్ పేర్కొనడం సంచలనంగా మారింది. ఆయన ఇంటర్వ్యూల ఆధారంగా మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం కంగ‌నాపై ద‌ర్యాప్తుకు ఆదేశించడం తెలిసిందే. ప్రస్తుతం ఇటర్నెట్ లో సుమన్ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

English summary
Actor Kangana Ranaut meets Maharashtra Governor Bhagat Singh Koshyari at Raj Bhavan, in Mumbai on sunday. before that, Kangana Ranaut hit back at Sanjay Raut over his 'BJP backing Kangana' remark in a Saamana article, and asked if the saffron party let "Shiv Sena goons rape and openly lynch" her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X