Kangana: క్వీన్ కంగనా సిస్టర్స్ కు షాక్, కేసు పెట్టండి, కోర్టు ఆర్డర్, పొలిటికల్ సపోర్ట్ తో !
ముంబాయి/ బెంగళూరు/ న్యూఢిల్లీ: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోళికి కోర్టులో చుక్కెదురైయ్యింది. క్వీన్ కంగనా, ఆమె సోదరి రంగోళిపై కేసు నమోదు చేసి విచారణ చెయ్యాలని ముంబాయి పోలీసులకు అంథేరి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, క్వీన్ కంగనా రనౌత్ మీద మరో దేశద్రోహం కేసు నమోదు అయ్యింది. ఇప్పటికే బాలీవుడ్ క్వీన్ కంగనా మీద కొన్ని కేసులు నమోదైనాయి. మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నించిందని, పొలిటికల్ సపోర్టుతో కంగనా, ఆమె సోదరి రంగోళి రెచ్చిపోతున్నారని ఆరోపణలు వచ్చాయి. కంగనా, రంగోళిపై ముంబాయిలో కేసు నమోదు అయ్యింది. కోర్టు ఆదేశాలతో ముంబాయి పోలీసులు కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోళిపై విచారణ మొదలుపెట్టారు.
love story: వీడే పిల్లనాయాలు, వీడికి మళ్లీ ఓ బుడ్డోడా ? ఆడుకోమంటే అమ్మానాన్న ఆట ఆడేశాడు!

కంగనా ఏం చేశారంటే !
ముంబాయికి చెందిన ప్రముఖ న్యాయవాది ఆలీ కాశీఫ్ దేశ్ ముఖ్ బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోళిపై ముంబాయిలో కేసు పెట్టారు. మతపరమైన ఆరోపణలు చేస్తున్నారని, మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని, సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించేలా నటి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోళి ప్రజలను రెచ్చగొడుతున్నారని న్యాయవాది ఆలీ కాశీఫ్ దేశ్ ముఖ్ అంథేరి మెజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు.

చిల్లర చేష్టలు చేస్తున్నారు
బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోళి మతపరమైన ఆరోపణలు చేస్తున్నారని, మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని, సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించేలా ప్రవర్తిస్తున్నారని న్యాయవాది ఆలీ కాశీఫ్ దేశ్ ముఖ్ కోర్టులో ఆరోపించారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోళి ప్రజలను రెచ్చగొడుతున్నారని, క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని న్యాయవాది ఆలీ కాశీఫ్ దేశ్ ముఖ్ అంథేరి మెజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు.

రంగోళి రాద్దాంతం చేస్తోంది
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సోదరి రంగోళి ఇటీవల చేసిన ట్విట్ లను న్యాయవాది ఆలీ కాశీఫ్ దేశ్ ముఖ్ కోర్టు ముందు సమర్పించారు. అంబోలి పోలీసులకు ఫిర్యాదు చేసినా నటి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోళి మీద పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని న్యాయవాది ఆలీ కాశీఫ్ దేశ్ ముఖ్ కోర్టులో ఫిర్యాదు చేశారు.

చాల పవర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు బాలీవుడ్ లో మంచి పలుకుబడి ఉందని, సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న తరువాత రాజకీయ నాయకులతో ఆమెకు ఎక్కువ పరిచయాలు అయ్యాయని, తాను ఏమి చేసినా ఏమీ కాదు ? అనే ధైర్యంతో రెచ్చిపోతుందని న్యాయవాది ఆలీ కాశీఫ్ దేశ్ ముఖ్ ఆరోపించారు. రాజకీయ పలుకుబడి అడ్డంపెట్టుకుని ఇటీవల కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోళి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని, దేశద్రోహానికి పాల్పడుతున్నారని న్యాయవాది ఆలీ కాశీఫ్ దేశ్ ముఖ్ కోర్టులో చెప్పారు.

మీ పని మీరు చెయ్యండి
న్యాయవాది ఆలీ కాశీఫ్ దేశ్ ముఖ్ ఆరోపణలపై వివరాలు తెలుసుకున్న అంథేరి మెజిస్ట్రేట్ న్యాయస్థానం న్యాయమూర్తి భగత్ టి. చిరాపే బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోళిపై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ తయారు చేసి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ముంబాయి పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

కంగనా సిస్టర్స్ కు షాక్
ముంబాయి కోర్టు ఆదేశాలతో బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోళికి మరోసారి ముంబాయి పోలీసుల నుంచి కష్టాలు ఎదురైనాయి.
ఇప్పటికే ముంబాయిలో కంగనాపై ఓ కేసు నమోదైయ్యింది. మహారాష్ట్ర ప్రభుత్వం తనను జైల్లో పెట్టడానికి ప్రయత్నాలు చేస్తోంది, తాను త్వరలో జైలుకు వెళ్లడానికి సిద్దంగా ఉన్నానని, ఇలాంటి బుడ్డ బెదిరింపులకు భయపడనని బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మహారాష్ట్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పిన విషయం తెలిసిందే.