వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిర్భయ దోషులతో ఇందిరా జై సింగ్‌ను జైలులో ఉంచాలి, ఆమె లాంటి వారే మృగాళ్లకు జన్మనిస్తారు: కంగనా రనౌత్

|
Google Oneindia TeluguNews

ప్రముఖ న్యాయవాది ఇందిరా జై సింగ్‌పై సినీనటి కంగానా రనౌత్ విరుచుకుపడ్డారు. నిర్భయ దోషులతోపాటు ఆమెను జైలులో ఉంచాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఇందిరా జై సింగ్.. నిర్భయ తల్లి తల్లిదండ్రులకు క్షమాభక్ష ప్రసాదించొచ్చు కదా అని అనడంతో తేనెతుట్టేను కదిపినట్లైంది. ఇందిరా వ్యాఖ్యలపై నిర్భయ పేరెంట్స్ వెంటనే ఖండించారు.

కంగనా రియాక్షన్..

కంగనా రియాక్షన్..


ఇటీవల ఇందిరా జై సింగ్ నిర్భయ తల్లి ఆశాదేవి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీలా ఎందుకు మారకూడదని ప్రశ్నిస్తున్నారు. రాజీవ్ గాంధీని హతమార్చిన నళినిపై సోనియా గాంధీ క్షమించారని గుర్తుచేశారు. అలా నిర్భయ తల్లి ఎందుకు ఆలోచించకూడదని కోరారు. గురువారం కంగనా రనౌట్ నటించిన ‘పంజా' సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో కంగనా రనౌత్ మాట్లాడారు.

దోషులతోపాటు ఉంచాలి

దోషులతోపాటు ఉంచాలి

నిర్భయ దోషులతోపాటు ఇందిరా జై సింగ్‌ను జైలులో ఉంచాలి అని కోరారు. నిర్భయంపై దారుణంగా ప్రవర్తించిన మృగాళ్లపై ఎందుకు ఇందిరా దయచూపుతున్నారో అర్థం కావడం లేదని కంగనా అన్నారు. అంతేకాదు ఇలాంటి మహిళలు అలాంటి నీచులకు జన్మనిస్తారు అని విమర్శించారు.

బహిరంగంగా..

బహిరంగంగా..

నిర్భయ దోషులను బహిరంగంగా ఉరితీయాలని ఇదివరకు కంగనా రనౌత్ డిమాండ్ చేశారు. లైంగికదాడి చేసి, హతమార్చేందుకు కారణమైన వారు మైనర్ల, మేజర్లా అని కూడా చూడొద్దు అని కోరారు. వారిని బహిరంగ ప్రదేశంలో ఉరి తీయాలని, దీంతో మరొకరు నేరేం చేయాలంటే భయపడుతారని చెప్పారు. దోషులకు శిక్ష విధించాలని నిర్భయ తల్లిదండ్రులకు చాలా రోజుల నుంచి పోరాటం చేస్తున్నారని గుర్తుచేశారు. నేరం చేస్తే శిక్ష ఇలా ఉంటుందని ప్రపంచానికి తెలియజేయకుండా.. చీకటి గదిలో ఉరి తీస్తే ప్రయోజనం ఏమీ ఉండదని కంగనా రనౌత్ అభిప్రాయపడ్డారు.

ఇదీ నేపథ్యం..

ఇదీ నేపథ్యం..

2012లో పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై ఆరుగురు మృగాళ్లు లైంగికదాడి చేసి, దాడి చేసిన సంగతి తెలిసిందే. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోగా.. దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. దోషి రామ్ సింగ్, తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకోగా.. మరొకడు జువైనల్ హోం నుంచి బయటకొచ్చాడు. మరో నలుగురు పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్, ముఖేశ్ కుమార్ జైలులో ఉన్నారు. వీరికి కోర్టు ఉరిశిక్ష విధించగా.. గవర్నర్, రాష్ట్రపతి క్షమాభిక్ష కూడా తిరస్కరించడంతో.. ఫిబ్రవరి 1వ తేదీన దోషులకు తీహార్ జైలులో ఉరితీయనున్నారు.

English summary
Indira Jaising should be kept in jail along with the Nirbhaya convicts Kangana Ranaut said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X