• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Kangana: దెబ్బకు హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్, మేడమ్ మాటలు నేర్చింది !

|

బెంగళూరు/ ముంబాయి: కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన వ్యవసాయ బిల్లులపై నిరసన వ్యక్తం చేస్తున్న అన్నదాతలను ఉగ్రవాదులతో పోల్చిన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కు కష్టాలు ఎదురైనాయి. అన్నం పెట్టే అన్నదాతలను ఉగ్రవాదులతో పోల్చి రైతులను కించపరిచిందని నటి కంగనా రనౌత్ మీద కోర్టులో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. రైతులను కించపరిచిన మేడమ్ కంగనాకు చెమటలు పడుతున్నాయి. మాటలు నేర్చిన మేడమ్ తన మీద నమోదైన కేసు ఎఫ్ఐఆర్ ను రద్దు చెయ్యాలని మనవి చేస్తూ కంగనా రనౌత్ ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు.

Illegal affair: కొడుకు ఫ్రెండ్ తో ఆంటీ మస్త్ మజా, అసలే పండ్లు, భర్తుకు తెలిసిపోయి !Illegal affair: కొడుకు ఫ్రెండ్ తో ఆంటీ మస్త్ మజా, అసలే పండ్లు, భర్తుకు తెలిసిపోయి !

 అన్నదాతల ఆవేదన

అన్నదాతల ఆవేదన

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై కొంతకాలం నుంచి రైతన్నలు భగ్గుంటున్నారు. తమకు నష్టం కలిగించే ఈ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా రైతన్నలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కొంతకాలం నుంచి అన్నదాతల ఆందోళనలతో అట్టడుకిపోయింది. దేశవ్యాప్తంగా అన్నదాతలకు అనేక పార్టీలు, పలు సంఘ సంస్థలు, ప్రజలు, ఉద్యోగ సంఘాలు, మహిళా సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి.

 కంగనా రచ్చరచ్చ

కంగనా రచ్చరచ్చ

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసు, బాలీవుడ్ డ్రగ్స్ మాఫీయా కేసుల తరువాత ఒక్కసారిగా మహారాష్ట్ర ప్రభుత్వం, శివసేన, కాంగ్రెస్ పార్టీల నాయకులపై విరుచుకుపడుతున్న బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, క్వీన్ కంగనా రనౌత్ ఏదో ఒకరకంగా వార్తల్లో నిలుస్తున్నారు.

 వాళ్లు ఉగ్రవాదులా ?

వాళ్లు ఉగ్రవాదులా ?

కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లును దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అన్నదాతలు వ్యతిరేకిస్తున్నారు. అన్నదాతలు రోడ్లు ఎక్కడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతన్నలు ఆందోళనలు చేస్తున్న సమయంలో గత ఏడాది సెప్టెంబర్ నెలలో బాలీవుడ్ హీరోయిన్ క్వీన్ కంగనా రనౌత్ రైతులను ఉగ్రవాదులతో పోల్చుతూ ఓ ట్విట్ చెయ్యడం కలకలం రేపింది.

 లాయర్ దెబ్బతో కంగనా హడల్

లాయర్ దెబ్బతో కంగనా హడల్

అన్నదాతలను ఉగ్రవాదులతో పోల్చుతూ నటి కంగనా రనౌత్ ట్విట్ చేసి రైతన్నలను అవమానించారని, ఆమె మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కర్ణాటక హైకోర్టు న్యాయవాది, తుమకూరు నివాసి ఎల్. రమేష్ నాయక్ గత ఏడాది సెప్టెంబర్ 22వ తేదీన కర్ణాటక డీజీపీ, తుమకూరు జిల్లా ఎస్పీకి ఇ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. నటి కంగనా రనౌత్ పై పోలీసులు కేసు నమోదు చేసి చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ న్యాయవాది రమేష్ నాయక్ అక్టోబర్ 9వ తేదీన తుముకూరు జేఎంఎఫ్ సీ న్యాయస్థానంలో కేసు పెట్టారు.

 మాటలు నేర్చిన మేడమ్

మాటలు నేర్చిన మేడమ్

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులను ఉగ్రవాదులతో పోల్చిన నటి కంగనా రనౌత్ మీద కేసు నమోదు కావడంతో ఆమె హడలిపోయింది. తాను రైతులను ఉగ్రవాదులతో పోల్చలేదని, వారు రోడ్ల మీద, రైలు పట్టాల మీద నిద్రపోతున్నట్లు నటిస్తున్నారని, నిరసన వ్యక్తం చేసే తీరుఇది కాదని మాత్రమే ట్వీట్ చేశానని క్వీన్ కంగనా రనౌత్ వివరణ ఇచ్చుకుంది. ఇదే సమయంలో కంగనా రనౌత్ మేడమ్ మాటలు భలే నేర్చిందని పలువురు అన్నదాతలు విమర్శించారు.

 హైకోర్టుకు హీరోయిన్ కంగనా

హైకోర్టుకు హీరోయిన్ కంగనా

నటి కంగనా రైతులను ఉగ్రవాదులతో పోల్చుతూ చేసిన ట్వీట్, సోషల్ మీడియా కామెంట్లను కర్ణాటక హైకోర్టు న్యాయవాది రమేష్ తుముకూరు కోర్టుకు సమర్పించారు. క్యాతసంద్ర పోలీసులు విచారణ చేసి కోర్టులో నివేదిక సమర్పించారు. ఇప్పటికే తుమకూరు కోర్టులో కేసు వాదనలు జరిగాయి. కోర్టు దెబ్బకు హడలిపోయిన కంగనా రనౌత్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది.

 సార్..... ఎఫ్ఐఆర్ రద్దు చెయ్యండి

సార్..... ఎఫ్ఐఆర్ రద్దు చెయ్యండి

తన మీద పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను రద్దు చేస్తూ తనను కేసు నుంచి విముక్తి కల్పించాలని కంగనా రనౌత్ కర్ణాటక హైకోర్టులో మనవి చేసింది. కంగనా రనౌత్ పిటిషన్ కర్ణాటక హైకోర్టులో వచ్చే వారంలో విచారణకు వచ్చే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు. హీరోయిన్ కంగనా మీద ఇప్పటికే ముంబాయి, ఢిల్లీ, తుమకూరుతో పాటు వివిద చోట్ల కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే.

English summary
Kangana: Actor Kangana Ranaut seeks Karnataka High Court to quash an FIR registered against her.Tumakuru court ordered FIR against her for controversial tweets on the farmers protests.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X