• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కంగనా రనౌత్ కు వై-ప్ల‌స్ కేట‌గిరి భ‌ద్ర‌త.. న‌టి కుబ్రాసైత్ వ్యాఖ్యలపై కంగనా సోదరి రంగోలి పంచ్

|

సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ఆత్మహత్య విషయంలో బాలీవుడ్ లో నెపోటిజం, నియంత పోకడలపై ఒంటరి పోరాటం చేస్తున్న కంగనారనౌత్ మహారాష్ట్ర ప్రభుత్వంపై కూడా నిప్పులు చెరుగుతున్నారు. ఆమె వ్యాఖ్యలు చిలికిచిలికి గాలివానగా మారగా తాజాగా ఈ వ్యవహారంలో రాజకీయ దుమారం రేగింది. కంగనాకు భద్రత విషయంలో కూడా వివాదం కొనసాగుతుంది .

బ్యాడ్ బాయ్ బిలియనీర్స్ ఇండియా .. షేక్ చేస్తున్న వెబ్ సీరీస్ ..ఆపాలని కోర్టుకెక్కిన రామలింగరాజు

 కంగనాకు వై ప్లస్ కేటగిరీ భద్రతపై వివాదం

కంగనాకు వై ప్లస్ కేటగిరీ భద్రతపై వివాదం

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కు కేంద్ర మంత్రిత్వ శాఖ వై ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించే విషయం తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో కంగనా రనౌత్ కు ప్రాణహాని ఉందని, ఆమె భద్రతపై సన్నిహితులు ఆందోళన వ్యక్తం చేయడంతో ఆమె సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ భద్రత కల్పించడానికి ముందుకు వచ్చింది. దీంతో కేంద్రం కూడా ఆమెకు వై కేటగిరీ భద్రతను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. కంగనా రనౌత్ కు వై ప్లస్ కేటగిరి భద్రత కల్పించడం పై నటి కుబ్రా సైత్ అసహనం వ్యక్తం చేశారు.

 నటి కుబ్రా సైత్ వ్యాఖ్యలకు కంగనా సోదరి రంగోలి కౌంటర్

నటి కుబ్రా సైత్ వ్యాఖ్యలకు కంగనా సోదరి రంగోలి కౌంటర్

సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆమె కంగనా రనౌత్ కు వై ప్లస్ కేటగిరి భద్రత కల్పించడానికి తాను కడుతున్న టాక్స్ లో నుంచి వీటికి డబ్బులు వెళ్లడం లేదు కదా అంటూ విమర్శలు గుప్పించారు. నటి కుబ్రా సైత్ వ్యాఖ్యలకు చురకలంటించారు కంగనా రనౌత్ సోదరి రంగోలి. కుబ్రా వ్యాఖ్యలపై దీటుగా స్పందించిన రంగోలి క్యూరియాసిటీతో అడుగుతున్నా ... ఇంతకీ ఎంత టాక్స్ కడుతున్నారేంటి అంటూ పంచ్ వేశారు . సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ హత్య తర్వాత జరిగిన పరిణామాలు చిలికి చిలికి గాలివానగామారగా తాజాగా బాలీవుడ్ లో ఒక వర్గం కంగనా రనౌత్ కు మద్దతుగా నిలిచింది. మరో వర్గం ఆమెను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను ఏకవచనంతో సంబోధిస్తూ.. కంగనా దుమారం

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను ఏకవచనంతో సంబోధిస్తూ.. కంగనా దుమారం

ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా కంగనా రనౌత్ పై నిప్పులు చెరుగుతుంది. ముంబై ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ గా ఆమె చేసిన వ్యాఖ్యలు మహా సర్కార్ కు ఆగ్రహం తెప్పించాయి. కంగనా రనౌత్ ముంబై రాక, అదే సమయంలో నిబంధనలను అతిక్రమించి కంగనా కార్యాలయంలో మార్పులు చేశారని బీఎంసీ అధికారులుకంగనా రనౌత్ కార్యాలయాన్ని కూల్చివేయడం మొదలుపెట్టారు. కంగనా కార్యాలయం కూల్చివేతపై బొంబే హైకోర్టు స్టే ఇవ్వడం వంటి పరిణామాల నేపథ్యంలో కంగనా రనౌత్ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను ఏకవచనంతో సంబోధిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కంగనా వర్సెస్ మహా సర్కార్ గా మారిన సుశాంత్ ఆత్మహత్య కేసు వివాదం

కంగనా వర్సెస్ మహా సర్కార్ గా మారిన సుశాంత్ ఆత్మహత్య కేసు వివాదం

మహారాష్ట్ర కోసం తన రక్తాన్ని ధారపోస్తానంటూ వ్యాఖ్యానించారు. అప్పటి నుండి ఇప్పటి వరకూ ఈ వ్యవహారంలో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కంగనా రనౌత్ కు వై ప్లస్ కేటగిరి భద్రత కల్పించడంపై రాజకీయ కోణం ఏదైనా ఉందా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం మహా సర్కార్ పై , సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో బాలీవుడ్ ప్రముఖులపై ఒంటరి పోరాటం చేస్తున్న కంగనారనౌత్ కు ప్రజల నుంచి భారీగా మద్దతు లభిస్తోంది .

  TV Actress Sravani కేసులో ట్విస్ట్, DevaRaj Reddy వెర్షన్ ఇదీ ! || Oneindia Telugu
   ఇండియా విత్ కంగనా హ్యాష్ ట్యాగ్ ట్రెండ్

  ఇండియా విత్ కంగనా హ్యాష్ ట్యాగ్ ట్రెండ్

  ఇండియా విత్ కంగనా హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తూ అభిమానులు కంగనారనౌత్ కు బాసటగా నిలుస్తున్నారు. కంగనా రనౌత్ వర్సెస్ మహా సర్కార్ గా మారిన ఈ వివాదం ఏ మలుపు తీసుకుంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది. కంగనా రనౌత్ వెనుక బలమైన రాజకీయ్ శక్తులు పని చేస్తున్నాయన్న అనుమానాలు చాలా మందికి కలుగుతున్నాయి.

  English summary
  Kangana Ranaut’s sister Rangoli has taken to social media and reacted to Kubbra Sait’s recent tweet about kangana y plus category security. Earlier, Kubbra raised a question on the ‘Y-plus’ security given to Kangana by the Home Ministry and asked if the bill was going out of her taxes. Kangana’s sister Rangoli was quick to react to her post asked Kubbra, “Just out of curiosity, how much tax have you paid?”
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X