వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కంగనా వర్సెస్ ఉద్ధవ్: కూల్చిన భవనం పునర్నిర్మించనన్న కంగనా.. భగత్ సింగ్ ను తలపించావన్న విశాల్

|
Google Oneindia TeluguNews

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కు సినీ పరిశ్రమకు చెందిన ఒక వర్గం మద్దతును ప్రకటిస్తుంటే, మరో వర్గం ఆమెను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య నాటినుండి బాలీవుడ్ లోని కొందరు సినీ ప్రముఖులపై, మహారాష్ట్ర సర్కార్ పై నిప్పులు చెరుగుతున్నారు కంగనారనౌత్. ఆ తర్వాత ఆమె ముంబైని పాక్ ఆక్రమిత కాశ్మీర్ గా అభివర్ణించడంతో దుమారం రేగింది. ముంబైలోని కంగనా రనౌత్ భవనాన్ని నిబంధనలకు విరుద్ధంగా మార్చారంటూ కూల్చివేతకు దిగడం, ఆ తర్వాత కంగనా రనౌత్ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే నుద్దేశించి ఘాటుగా వ్యాఖ్యలు చేస్తూ ఒక వీడియోను విడుదల చెయ్యటం పెను దుమారాన్ని రేపాయి.

 కూల్చిన భవన శిధిలాలు అలాగే .. ధైర్యం చేసిన స్త్రీ సంకల్పానికి ప్రతీకగా

కూల్చిన భవన శిధిలాలు అలాగే .. ధైర్యం చేసిన స్త్రీ సంకల్పానికి ప్రతీకగా

కంగనా రనౌత్ కు సంబంధించిన భవన నిర్మాణంలో ఉల్లంఘనలు జరిగాయని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ బుధవారం కూల్చివేసిన తన కార్యాలయ భవనాన్ని పునరుద్ధరించబోనని కంగనా రనౌత్ ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ట్వీట్ చేసిన ఆమె "నేను జనవరి 15 న నా కార్యాలయం ప్రారంభించాను, కరోనా కారణంగా ఆ తర్వాత నుండి నేను పని చేయలేదు, దాన్ని పునరుద్ధరించడానికి డబ్బు లేదు, నేను బీఎంసీ అధికారులు కూల్చిన తన భవన శిధిలాలను ఈ ప్రపంచంలో ఎదగటానికి ధైర్యం చేసిన స్త్రీ సంకల్పానికి చిహ్నంగా అలాగే ఉంచుతాను . మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో ఆమె నిరంతర వాగ్వాదానికి సంకేతంగా "కంగనా వర్సెస్ ఉద్దవ్" అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఆమె జోడించారు.

కంగనా రనౌత్ ధైర్యాన్ని కొనియాడుతున్న పలువురు

కంగనా రనౌత్ ధైర్యాన్ని కొనియాడుతున్న పలువురు

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అందించిన సెక్యూరిటీ గార్డులతో కంగనా సెప్టెంబర్ 9 న బిఎంసి కూల్చివేత చేపట్టిన కొన్ని గంటల తరువాత ముంబై చేరుకుంది. గురువారం, ఆమె తన భవనాన్ని సందర్శించి, నష్టాన్ని అంచనా వేశారు .శివసేన నాయకుడు సంజయ్ రౌత్‌తో మాటల యుద్ధం తరువాత కంగనా తన భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేయడంతో వై-ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అందించారు. తాజా పరిణామాల నేపథ్యంలో కంగనా రనౌత్ ధైర్యసాహసాలను పలువురు సినీ ప్రముఖులు మెచ్చుకుంటున్నారు.

కంగనాను భగత్ సింగ్ తో విశాల్ పోల్చడం ఆసక్తికర చర్చ

కంగనాను భగత్ సింగ్ తో విశాల్ పోల్చడం ఆసక్తికర చర్చ

కంగనా రనౌత్ ఉద్దేశిస్తూ హీరో విశాల్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో మాటల యుద్ధం కొనసాగిస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ దక్షిణాది సినీ నటుడు విశాల్ మద్దతు పలకడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది శివసేన నేతలతో ఆమె తల పడుతున్నాడని ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ తో విశాల్ పోల్చడం ఆసక్తికర చర్చకు కారణమవుతుంది ఒక సెలబ్రిటీ నే కాకుండా సామాన్యులు సైతం ప్రభుత్వాన్ని నిలదీయడం అనే సందేశాన్ని సమాజానికి ఇచ్చినందుకు అభినందనలు అంటూ విశాల్ కంగనా రనౌత్ ను ఉద్దేశించి పేర్కొన్నారు.

కంగనా నీ గట్స్ కు హ్యాట్స్ ఆఫ్ .. విశాల్ ట్వీట్

కంగనా నీ గట్స్ కు హ్యాట్స్ ఆఫ్ .. విశాల్ ట్వీట్

కంగనా.. నీ గట్స్ కి హాట్సాఫ్. ఏది తప్పు ఏది ఒప్పు అనే విషయాలను వ్యక్తపరచడానికి నువ్వు ఎప్పుడు వెనకాడలేదు అంటూ ఆయన పోస్ట్ చేశారు. నీకు సంబంధించిన విషయం కాకపోయినా, వాటి గురించి నువ్వు మాట్లాడి, ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నావు . అయినా ధైర్యంగా నిలబడ్డావు. 1920లో భగత్ సింగ్ ను ఇప్పుడు నీ వైఖరి తలపించింది అంటూ కొనియాడారు. తప్పు ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఎదురుగా ఎవరైనా మాట్లాడొచ్చు అని నువ్వు ఒక ఉదాహరణ చూపించావు అంటూ కంగనారనౌత్ ధైర్యాన్ని హీరో విశాల్ ప్రశంసించారు.

చిలికి చిలికి గాలివానలా కంగనా వివాదం

చిలికి చిలికి గాలివానలా కంగనా వివాదం

ప్రస్తుతం కంగనారనౌత్ వర్సెస్ మహారాష్ట్ర సర్కార్ గా మారిన ఈ ఘర్షణలో కొందరు కంగనారనౌత్ ధైర్యాన్ని ప్రశంసిస్తుంటే, మరికొందరు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఆమెకు వై ప్లస్ కేటగిరి భద్రత ఇవ్వడంపై కూడా చాలామంది నిప్పులు చెరుగుతున్నారు. టాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఘటన రేపిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారి రాజకీయ దుమారానికి కారణమైంది. ఇది ఇంకా కొనసాగే అవకాశం కనిపిస్తుంది .

English summary
Actor Kangana Ranaut in a tweet said that, as a symbolic gesture, she will not renovate the portions of her office that were demolished by the Brihanmumbai Municipal Corporation. hero vishal appriciated kangana's guts in a tweet .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X