వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కన్నయ్యలాల్ హత్య: నిందితులకు పాకిస్థాన్ ఇస్లామిక్ సంస్థతో సంబంధాలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉదయ్‌పూర్‌లో దర్జీని దారుణంగా హత్య చేసిన ఇద్దరు నిందితుల్లో ఒకరైన గౌస్ మహ్మద్‌కు పాకిస్థాన్‌కు చెందిన దావత్-ఏ-ఇస్లామీ సంస్థతో సంబంధాలు ఉన్నాయని, 2014లో కరాచీని సందర్శించినట్లు రాజస్థాన్ పోలీస్ చీఫ్ బుధవారం తెలిపారు. టైలర్ కన్హయ్య లాల్ హత్యకు సంబంధించి మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ఎంఎల్ లాథర్ మీడియా సమావేశంలో తెలిపారు.

"నిందితుల్లో ఒకరైన గౌస్ మహ్మద్‌కు కరాచీకి చెందిన ఇస్మాలిస్ట్ సంస్థ దావత్-ఎ-ఇస్లామీతో సంబంధాలు ఉన్నాయి. అతను 2014లో కరాచీని సందర్శించాడు. ఇప్పటివరకు ఇద్దరు ప్రధాన నిందితులతో సహా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని లాథర్ చెప్పారు.

రాజస్థాన్ హోం మంత్రి రాజేంద్ర యాదవ్ కూడా మీడియాతో మాట్లాడుతూ.. గౌస్ మహ్మద్‌కు పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నాయని, పొరుగు దేశంలో శిక్షణ పొందాడని చెప్పారు.

రియాజ్ అఖ్తరీ, గౌస్ మహ్మద్ అనే ఇద్దరు వ్యక్తులు మంగళవారం ఉదయపూర్‌లోని తన దుకాణంలో కన్హయ్య లాల్‌ను కత్తులతో నరికి చంపారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో భారీ నిరసనలు వెల్లువెత్తాయి. ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన వీడియో క్లిప్‌లో, దుండగుల్లో ఒకరు ఆ వ్యక్తిని తల నరికి చంపారని, ప్రధాని నరేంద్ర మోడీని కూడా బెదిరించారని చెప్పారు.

 Kanhaiya Lal Murder: Accused Ghouse Mohammad Has Links With Pakistan-Based Outfit: Rajasthan DGP

రియాజ్ అఖ్తరీ, గౌస్ మహ్మద్‌లను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం, IPCలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఘౌస్ మహ్మద్ 2014లో దావత్-ఎ-ఇస్లామీ, కరాచీని సందర్శించినట్లు లాథర్ చెప్పాడు. "ఈ ఔట్‌ఫిట్లకు ముంబై, ఢిల్లీలో కార్యాలయాలు ఉన్నాయి. రియాజ్ వెల్డర్‌గా పని చేస్తుండగా, ఘౌస్ కొన్ని చిన్న పనుల్లో ఉన్నాడు. ప్రత్యేకమైన ఆయుధాన్ని ఉపయోగించినట్లు కూడా కనుగొనబడింది. కన్హయ్యను హత్య చేసేందుకు నిందితులు నాలుగైదు రోజులపాటు రెక్కీ నిర్వహించినట్లు తెలిపారు.

నలుగురైదుగురు వ్యక్తులు తనను వెంబడిస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని జూన్ 15న కన్హయ్య పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. "పరిస్థితి తీవ్రతను అంచనా వేయడంలో స్థానిక పోలీసులు విఫలమయ్యారు. కన్హయ్య ఫిర్యాదుపై సమర్థవంతమైన చర్య తీసుకోలేదని రాష్ట్ర పోలీసు చీఫ్ చెప్పారు. "నిన్న అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ని సస్పెండ్ చేశామని, ఈరోజు ఎస్‌హెచ్‌ఓ నిర్లక్ష్యంగా పనిచేసినందుకు సస్పెండ్ అయ్యారని" ఆయన అన్నారు.

మరోవైపు, ఈ దారుణ హత్యకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) సవరణ చట్టం (యూఏపీఏ) కింద కేసు నమోదు చేసింది. NIA బృందాలు ఉదయ్‌పూర్‌కు చేరుకున్నాయి, ఈ విషయంపై వేగవంతమైన దర్యాప్తు కోసం అవసరమైన చర్యలు ప్రారంభించారు.

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. "రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో నిన్న జరిగిన కన్హయ్య లాల్ తేలి దారుణ హత్య కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) చేపట్టాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆదేశించింది. ఈ ఘటనకు ఏదైనా సంస్థ ప్రమేయం, అంతర్జాతీయ సంబంధాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు.

English summary
Kanhaiya Lal Murder: Accused Ghouse Mohammad Has Links With Pakistan-Based Outfit: Rajasthan DGP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X