వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీని చంద్రబాబు బాగా నమ్మారు: టీడీపీ దీక్షకు కనిమొళి మద్దతు, కేంద్రంపై పైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

కడప: స్టీల్ ప్లాంట్ కోసం దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, బీటెక్ రవిల దీక్షకు డీఎంకే పార్టీ నాయకురాలు కనిమొళి మంగళవారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఏడు రోజులుగా దీక్ష చేస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవడం దారుణం అని మండిపడ్డారు.

అదే జరిగితే జనసేన కథ ముగిసినట్లే: పవన్‌కు హెచ్చరిక, తెరవెనుక ఏం జరుగుతోంది?అదే జరిగితే జనసేన కథ ముగిసినట్లే: పవన్‌కు హెచ్చరిక, తెరవెనుక ఏం జరుగుతోంది?

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్నదమ్ముల లాంటి వారని చెప్పారు. రాష్ట్రాల గురించి కేంద్రం పూర్తిగా మరిచిపోయిందని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రత్యేక హోదాను తుంగలో తొక్కిందన్నారు. బీజేపీకి హిందుత్వం తప్ప, మరో సమస్య పట్టదన్నారు.

Kanimozhi supports TDP MP and MLC deeksha for Kadapa steel plant

ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల వైపు నిలబడతారని భావించి చంద్రబాబు నాయుడు ఆయనను నమ్మారని, విశ్వసించారని, అందుకే మద్దతు పలికారని ఆమె చెప్పారు. కానీ ప్రధాని అందరి నమ్మకాన్ని వమ్ము చేశారన్నారు. బీజేపీ ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదన్నారు. ఎన్నికల సమయంలో రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోడీ హోదా ఇస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు మరిచిపోయారన్నారు. బీజేపీ అసలు రంగు ఇప్పుడు బయటపడిందన్నారు.

English summary
DMK leader Kanimozhi on Tuesday supported TDP MP CM Ramesh and MLC Btech Ravi's deeksha for Kadapa steel plant.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X