వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శాంతిని కాపాండండి, వాటిని పట్టించుకోవద్దు, ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి, చాలెంజింగ్ స్టార్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మండ్య లోక్ సభ ఎన్నికల సందర్బంగా తన అభిమానులు శాంతిని కాపాడాలని చాలెంజింగ్ స్టార్ దర్శన్ మనవి చేశారు. మండ్య లోక్ సభ ఎన్నికలు సవ్యంగా జరగడానికి తన ప్రతి అభిమాని సహకరించాలని, ప్రత్యర్థుల ఆరోపణలు పట్టించుకోరాదని దర్శన్ మనవి చేశారు.

లోక్ సభ ఎన్నికల్లో బళ్లారి శ్రీరాములు పోటీ ? సిట్టింగ్ ఎంపీకి షాక్, హైకమాండ్ ఒత్తిడి: ఎలా!లోక్ సభ ఎన్నికల్లో బళ్లారి శ్రీరాములు పోటీ ? సిట్టింగ్ ఎంపీకి షాక్, హైకమాండ్ ఒత్తిడి: ఎలా!

మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా రెబల్ స్టార్ అంబరీష్ సతీమణి, ప్రముఖ నటి సుమలత పోటీ చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సుమలతకు స్యాండిల్ వుడ్ ప్రముఖ హీరోలు దర్శన్, యష్ మద్దతు ఇస్తూ ప్రచారం చేస్తున్నారు.

Kannada actor Darshan requested to his fans for peaceful election in Mandya in Karnataka.

దర్శన్, యష్ ల ఎన్నికల ప్రచారాన్ని జీర్ణించుకోలేని కొందరు జేడీఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో వారిని నీచంగా కించపరుస్తూ పోస్టులు పెడుతున్నారు. జేడీఎస్ కార్యకర్తల తీరుపై దర్శన్ అభిమానులు మండిపడుతున్నారు. జేడీఎస్ నాయకులు, కార్యకర్తలకు వ్యతిరేకంగా దర్శన్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

సీఎం కొడుకు నామినేషన్, రూ. లక్షల్లో ప్రజల ఆస్తికి హాని, మూడు ఎఫ్ఐఆర్ లు, హీరోకు షాక్!సీఎం కొడుకు నామినేషన్, రూ. లక్షల్లో ప్రజల ఆస్తికి హాని, మూడు ఎఫ్ఐఆర్ లు, హీరోకు షాక్!

ఈ విషయాలు మొత్తం గమనించిన హీరో దర్శన్ తన ఫేస్ బుక్, ట్వీట్టర్ లో అభిమానులకు మనవి చేస్తూ పోస్టు చేశారు. ఎన్నికల సమయంలో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం సహజం అని, వాటిని సీరియస్ గా తీసుకోకూడదని దర్శన్ మనవి చేశారు.

తన మీద విమర్శలు చేస్తున్నారని అభిమానులు ఎలాంటి ఆందోళన చెయ్యకూడదని, ఎన్నికలు సవ్యంగా జరగడానికి అందరూ సహకరించాలని దర్శన్ మనవి చేశారు. సోషల్ మీడియాలో తన మీద జరుగుతున్న ఇలాంటి ప్రచారాల గురించి అభిమానులు కొంచెం కూడా పట్టించుకోకూడదని దర్శన్ తెలిపారు.

English summary
Kannada actor Darshan requested to his fans for peaceful election in Mandya in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X