• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కన్నడ నటుడు దారుణ హత్య: పట్టపగలు ఇంట్లోనే ఘాతుకం..

|

కర్ణాటకలో దారుణం జరిగింది. పట్టపగలే నటుడు సురేంద్ర బంట్వాల్‌ హత్యకు గురయ్యాడు. సురేంద్ర రౌడీ నేపథ్యం ఉంది. దీంతో పోలీసులు రౌడీ షీట్ కూడా తెరిచారు. కానీ బుధవారం పగలే హత్య జరగడంతో కలకలం రేగింది. సురేంద్ర కన్నడతోనే కాదు తుళు చిత్రాల్లో కూడా నటించారు. అయితే కొందరితో ఆయనకు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని తెలుస్తోంది. అందువల్లే సురేంద్ర హత్యకు గురై ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

కర్ణాటకలో గల బంట్వాల్‌ తాలుకాలో బీసీ రోడ్డులో సురేంద్ర ఉంటున్నారు. అపార్టుమెంట్‌లో ఉండగా, కొందరు దుండగులు వచ్చి హత్య చేసినట్టు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గతంలో బీజేపీ నాయకులను బెదిరించిన కేసులో సురేంద్ర జైలుకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఇటీవలే బెయిల్‌ మీద విడుదలయ్యారని సమాచారం.

kannada Actor Surendra bantwal hacked to death..

సురేంద్ర సోఫాలో కూర్చొని ఉండగా.. దుండగులు కత్తితో పొడిచారు. అతని ఒంటిపై చాలా గాయాలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలే హత్యకు దారితీశాయని.. ఘటనాస్థలానికి క్లూస్ టీం చేరుకుంది. డాగ్ స్క్వాడ్‌తో ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు.

సురేంద్ర కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తుళు సినిమా 'ఛలి పొలిలు', కన్నడ సినిమా 'సవర్ణ దీర్ఘ సంధి'లో సురేంద్ర బంట్వాల్ నటించి.. మంచి పేరు తెచ్చుకున్నారు.

English summary
actor surendra bantwal was brutally murdered inside his apartment in bantwal taluk on wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X