కిడ్నాప్, అక్రమ రివాల్వర్ కేసులో బిగ్ బాస్ సెలబ్రిటీ అరెస్టు, అక్రమ సంబంధం, భర్త!
బెంగళూరు: బార్ అండ్ రెస్టారెంట్ సప్లేయర్ ను కిడ్నాప్ చేసి రివాల్వర్ తో బెదిరించిన కేసులో కన్నడ బిగ్ బాస్ రియాలిటీ షో సెలబ్రిటీని బెంగళూరులోని జ్ఞానభారతీ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. కిడ్నాప్, అక్రమంగా రివాల్వర్ పెట్టుకున్నాడనే కేసులో కన్నడ బిగ్ బాస్ రియాలిటీ షో సెలబ్రిటీ సునామి కిట్టి అలియాస్ కిట్టి తదితరుల మీద కేసులు నమోదు అయ్యాయి.
బార్ అండ్ రెస్టారెంట్
కన్నడ బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొన్న సునామి కిట్టి మంచి క్రేజ్ సంపాధించుకున్నాడు. సునామి కిట్టి, అతని స్పేహితులు అర్జున్, యోగేంద్ర, సునీల్ తదితరులు 8 మంది కారులో జ్ఞానభారతీలోని కుఠీర్ బార్ అండ్ రెస్టారెంట్ కు వెళ్లి సప్లేర్ గిరీష్ కు తౌసిక్ అనే వ్యక్తి ఫోటో చూపించి అతని గురించి విచారించారు.
అక్రమ సంబంధం
తౌసిక్, దీపా (సునామి కిట్టి స్నేహితుడు సునీల్ భార్య) అప్పుడప్పుడు భోజనానికి ఇక్కడికి వస్తుంటారని, తానే వారికి కావలసిన ఆహారపదార్తాలు సప్లే చేస్తుంటానని సప్లేయర్ గిరీష్ చెప్పాడు. తౌసిక్, దీపా వచ్చే ముందు తనకు ఫోన్ చేసి టేబుల్ బుక్ చేసుకుంటారని గిరీష్ సమాధానం ఇచ్చాడు.
దీపా భర్తకు అనుమానం
ఫిబ్రవరి 25వ తేదీ తౌసిక్, దీపా బార్ అండ్ రెస్టారెంట్ కు వచ్చారని, భోజనం కొంచెం తిని బిల్లు చెల్లించుకుండా వెళ్లిపోయారని సప్లేయర్ గిరీష్ చెప్పాడు. తరువాత ఫోన్ చేసిన తౌసిక్ దీపా భర్తకు తన మీద అనుమానం వచ్చిందని, బిల్లు తరువాత చెల్లిస్తానని, తన ఫోన్ నెంబర్ ఎవ్వరికీ ఇవ్వద్దని చెప్పాడని గిరీష్ వివరించారు.
రివాల్వర్ తో వార్నింగ్
అదే రోజు బార్ అండ్ రెస్టారెంట్ సప్లేయర్ గిరీష్ ను బిగ్ బాస్ సెలబ్రిటీ సునామి కిట్టి తదితరులు కారులో కిడ్నాప్ చేశారు. తౌసిక్ ఇల్లు చూపించాలని గిరీష్ ను చిత్రహింసలు పెట్టారు. తరువాత తౌసిక్ కు గిరీష్ తో ఫోన్ చేయించి రాత్రి 11 గంటల సమయంలో గురగుంటపాళ్య ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరకు రావాలని చెప్పించారు.
తౌసిక్ కిడ్నాప్, హత్యాయత్నం
గురగుంటపాళ్య ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరకు వెళ్లిన తౌసిక్ ను కారులో కిడ్నాప్ చేశారు. అనంతరం హోరమావు సమీపంలోని ఫాం హౌస్ దగ్గరకు తీసుకెళ్లారు. తౌసిక్ మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేసి కత్తితో పోడిచి హత్యాయత్నం చేశారని గిరీష్ పోలీసులకు చెప్పాడు.
రివాల్వర్ తో వార్నింగ్
తౌసిక్ ను కిడ్నాప్ చేసిన విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని గిరీష్ తల మీద పాయింట్ గన్ తో బెదిరించి అతని దగ్గర ఉన్న మొబైల్ ఫోన్, ఏటీఎం కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లాక్కొని వదిలేశారు. గిరీష్ ఫిర్యాదు చెయ్యడంతో రంగంలోకి దిగిన పోలీసులు బిగ్ బాస్ సెలబ్రిటీ సునామి కిట్టి, అర్జున్, యోగేంద్ర అనే ముగ్గురిని శనివారం అరెస్టు చేసి మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.