పద్మశ్రీ అవార్డు వెనక్కి ఇస్తున్నా: మహదేవ
బెంగళూరు: దేశంలో అసహనం పెరిగిపోతున్నదని, తనకు ఇచ్చిన అవార్డులు తిరిగి ఇచ్చేస్తున్నానని ప్రముఖ కన్నడ సాహితీవేత్త దేవనూరు మహదేవ తెలిపారు. దేవనూరు మహదేవ తీసుకున్న నిర్ణయాన్ని పలువురు సమర్థిస్తుంటే, అనేక మంది ఆయన మీద మండిపడుతున్నారు.

శనివారం దేవనూరు మహదేవ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. తనకు వచ్చిన కేంద్ర సాహిత్య అకాడమి అవార్డును, పద్మశ్రీ అవార్డును తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాలని నిర్ణయం తీసుకున్నానని ఆయన స్పష్టం చేశారు.
సాహితీవేత్త అనే గుర్తింపుతో పాటు సమాజసేవ చేస్తున్న దేవనూరు మహదేవ కన్నడిగులకు సుపరిచితుడు. 1991లో ఆయన వ్రాసిన ‘కుసుమ బాలే' అనే పుస్తకానికి కేంద్ర ప్రభుత్వం సాహిత్య అకాడమి అవార్డు ఇచ్చి సత్కరించింది. అదే విదంగా మమదేవ శక్తివంచన లేకుండా సమాజసేవ చేస్తున్నారు.

దేశంలో అసహనం పెరిగిపోతున్నదని, కొందరు కావాలనే సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని,అందుకు నిరసనగా తనకు ఇచ్చిన రెండు అవార్డులను తిరిగి ఇచ్చేయాలని మహదేవ నిర్ణయించారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.