బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విలన్లకు ‘చావు’ ముందే తెలుసు: చివరి మాటలు ఇవే

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కన్నడ సినిమా మాస్తి గుడి క్రైమాక్స్ చిత్రీకరణ సమయంలో జలసమాధి అయిన ఇద్దరు విలన్లకు తాము చనిపోతాము అని ముందు తెలిసినట్లు ఉందని వెలుగు చూసింది. అందుకు సాక్షం క్రైమాక్స్ షూటింగ్ చిత్రీకరణ ప్రారంభం అయ్యే ముందు వారు మీడియాకు చెప్పిన మాటలే.

షూటింగ్ కైమాక్స్: ఇద్దరు విలన్ల జలసమాధి ( వీడియో)

తిప్పగూండనహళ్ళి జలాశయం (చెరువు) దగ్గర సినిమా షూటింగ్ జరిగే సమయంలో అక్కడికి మీడియాను ఆహ్వానించారు. షూటింగ్ ప్రారంభం కాకముందు విలన్లు అనీల్, ఉదయ్ టీవీ చానల్స్ తో పాటు సోషల్ మీడియా, ప్రింట్ మీడియాతో మాట్లాడారు.

మూడో సారి రాకుంటే అదే అర్థం

మూడో సారి రాకుంటే అదే అర్థం

నీళ్లలో దూకడం మా కర్తవ్యం. రెండు సార్లు పైకి వచ్చి మూడో సారి పైకి రాకపోతే ఆ దేవుడు మమ్మల్ని తీసుకు వెళ్లాడని అర్థం. అయితే మమల్ని రక్షించడానికి ఇక్కడ బోట్ తో సిబ్బంది సిద్దంగా ఉన్నారని అనీల్, ఉదయ్ మీడియాకు చెప్పారు.

దేవుడు ఏ నిర్ణయం తీసుకున్నా సరే

దేవుడు ఏ నిర్ణయం తీసుకున్నా సరే

నాకు స్విమ్మింగ్ ( ఈత) వచ్చు. అయితే నేను గజఈతగాడు కాదు. 20 అడుగుల ఎత్తు నుంచి నీళ్లలోకి దూకి ఈత కొట్టిన అనుభవం ఉంది. అయితే మొదటి సారి 100 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకుతున్నాను. నేను బావిలో ఈత నేర్చుకున్నాను. ఇలాంటి పెద్ద జలాశయం (చెరువు)లో ఇంత వరకు ఈత కొట్టలేదు. రెండు సార్లు పైకి వచ్చి మూడో సారి పైకి రాకపోతే నేను దేవుడి దగ్గరకు వెళ్లిపోయానని అర్థం. అనీల్ చెప్పిన చివరి మాటల క్లిప్పంగ్స్ ఇప్పుడు కన్నడ టీవీ చానెల్స్ లో పదేపదే ప్రసారం చేస్తున్నారు.

ప్రతినాయకుడు ఉదయ్ చివరి మాటలు ఇవే

ప్రతినాయకుడు ఉదయ్ చివరి మాటలు ఇవే

నాకు స్విమ్మింగ్ వస్తుంది. అయితే పెద్ద స్విమ్మర్ ను కాదు. నన్ను నేను రక్షించుకోవడానికి స్మిమ్మింగ్ నేర్చుకున్నాను. నేను నా స్నేహితుడు అనీల్, హీరో విజయ్ కలిసి పై నుంచి నీళ్లలోకి దూకుతున్నాం. నేను ఆ ఇద్దరి ముఖాలు చూసి కిందకు దూకేస్తాను. తరువాత ప్రాణాలతో భయటకు రావడం అనేది ఆ దేవుడి చేతిలో ఉంది. నేను మాత్రం ఏమీ చెయ్యలేను కదా ? అని ఓ టీవీ చానల్ తో అన్నాడు. అయితే సిబ్బంది వచ్చి మమల్ని రక్షిస్తారని ఆశిస్తున్నాను అని ఉదయ్ చెప్పాడు.

హీరో విజయ్ కు లైఫ్ జాకెట్ వేశారు

హీరో విజయ్ కు లైఫ్ జాకెట్ వేశారు

హీరో విజయ్, విలన్లు అనీల్, ఉదయ్ ముగ్గురు 100 అడుగు ఎత్తు నుంచి నీళ్లలోకి దూకవలసి ఉంది. అయితే సినిమా యూనిట్ సభ్యులు మాత్రం హీరో విజయ్ కు మాత్రం లైఫ్ జాకెట్ ఇచ్చారు. ఇద్దరు విలన్లకు కనీసం షర్టులు కూడలేవు.

ముందే తెలిసి ఇలా అన్నారా

ముందే తెలిసి ఇలా అన్నారా

మాస్తిగుడి సినిమా ప్రతినాయకులు అనీల్, ఉదయ్ ఇద్దరి చివరికి నిమిషయంలో చెప్పిన మాటలు అక్షరాల నిజయం అయ్యాయి. తమ శక్తిని దారపోసి ఒడ్డుకు చేరాలని ప్రయత్నించిన ఇద్దరిని ఆ యమరాయుడు తీసుకు వెళ్లారు. ఆ ఇద్దరిని సినిమా యూనిట్ సభ్యులతో పాటు ఆదేవుడు కాపాడలేకపోయాడు. సినిమా యూనిట్ సభ్యులు అనీల్, ఉదయ్ లకు లైఫ్ జాకెట్లు వేసి ఉంటే వారు ప్రాణాలతో భయటపడేవారని పోలీసులు అంటున్నారు.

English summary
Tragedy Strikes Kannada Movie 'Maasti Gudi'. 2 Actors Drown in Tippagondanahalli Lake while shooting Climax scene. Here is the detailed report about the Last words of Anil and Uday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X