• search
 • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Kannada Ugliest Language In India: గూగుల్‌‌ తల్లిపై వీర కన్నడిగులు భగ్గు

|

బెంగళూరు: టాప్ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌పై కన్నడిగులు భగ్గుమంటోన్నారు. కన్నడ భషాభిమానులు నిప్పులు చెరుగుతోన్నారు. బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ నినదిస్తోన్నారు. కోట్లాది కన్నడిగులు ఏకమయ్యారు. సామాన్యుడి నుంచి సెలెబ్రిటీల వరకు..చిరు ఉద్యోగి స్థాయి నుంచి ముఖ్యమంత్రి, పార్టీల అధినేతల వరకు.. అందరిదీ ఒకే డిమాండ్. కర్ణాటక ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసింది. గూగుల్‌పై చట్టపరమైన చర్యలకూ సిద్ధపడుతోంది.

అసభ్యకరమైన భాషగా..

దీనికి కారణం.. గూగుల్ ఇచ్చిన ఓ చిన్న సమాచారం. కన్నడను అసభ్యకరమైన భాష (Kannada ugliest language)గా చూపించింది గూగుల్ తల్లి. భారతీయ భాషల్లో అసభ్యకరమైనదేది అంటూ నెటిజన్లు చేసిన సెర్చ్‌కు గూగుల్ తల్లి ఇచ్చిన సమాధానం.. కన్నడ. తొలుత debtconsolidationsquad.com అనే వెబ్‌సైట్‌ దీన్ని తొలుత బయటపెట్టింది. ఆ తరువాత ఈ ఆర్టికల్‌ను ఆ వెబ్‌సైట్ తొలగించింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కార్చిచ్చులా అంటుకుందీ వ్యవహారం.

కోట్లాది మంది మనోభావాలతో..

దేశ భాషల్లో ప్రధానమైదిగా, దక్షిణాదిన ప్రధాన రాష్ట్రంగా.. కోట్లాదిమందికి మాతృభాషగా, సంస్కృతానికి కాస్త దగ్గరగా ఉండే కన్నడను అసభ్యకరమైనదిగా చూపించడం పట్ల కర్ణాటక ప్రజలు మండిపడుతున్నారు. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా ఒక్కటయ్యారు. ఓటమెరుగని విజయనగర సామ్రాజ్యానికి పుట్టినిల్లయిన ప్రాచీన భాషను అసభ్యకరమైనదిగా చూపించడం పట్ల నెటిజన్లు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోన్నారు. అధికార భారతీయ జనతా పార్టీకి చెందిన పలువురు నేతలు, మంత్రులు తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోన్నారు.

చారిత్రక సంపదగా..

ప్రపంచం గర్వించదగ్గ మహా కవులు, మహారాజులను అందించిందని, అలాంటి కన్నడ భాషను కించపరచడాన్ని ఏ ఒక్క కన్నడిగుడు కూడా సహించబోడని చెబుతున్నారు. గూగుల్ యాజమాన్యం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోన్నారు. దేశభాషల్ల అత్యంత సుందరమైనది, సరళమైనదిగా గుర్తింపు పొందిన కన్నడను అసభ్యకరమైదిగా పోల్చడం పట్ల బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కన్నడ భాషాభిమానులు డిమాండ్ చేస్తోన్నారు.

చట్టపరమైన చర్యలకు

ఈ ఉదంతం పట్ల కర్ణాటక ప్రభుత్వం కూడా స్పందించింది. గూగుల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సమాయాత్తమౌతోంది. ఒకట్రెండు రోజుల్లో గూగుల్ యాజమాన్యానికి నోటీసులను పంపిస్తామని కర్ణాటక సాంస్కృతిక శాఖ మంత్రి అరవింద్ లింబావళి తెలిపారు. గూగుల్ కన్నడ భాషను కించపరిచిందనే విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పారు. గూగుల్ చేసిన ఈ పనిని క్షమించకూడదని మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్ (సెక్యులర్) అధినేత కుమారస్వామి అన్నారు.

  Bengaluru లో Pranitha Subhash Nitin Raju Marriage | గొప్ప మనసున్న నటి || Oneindia Telugu

  నిధి సుబ్బయ్య, రాగిణి ద్వివేది,

  నిధి సుబ్బయ్య, రాగిణి ద్వివేది, శ్వేతా చెంగప్ప, జ్యోతి అకుల్ బాలాజీ వంటి సెలెబ్రిటీలు స్పందించారు. కన్నడ భాష గొప్పదనాన్ని వివరిస్తూ ట్వీట్లు చేశారు. ట్విట్టర్‌లో కన్నడ భాష పోటెత్తింది. #QueenOfAllLanguagesKannada, #KannadaQueenOfAllLanguages అనే హ్యాష్‌ట్యాగ్‌తో హోరెత్తించారు. గూగుల్ క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు.

  English summary
  The Karnataka government on Thursday said it will take legal action against tech giant Google following outrage over a search result that showed Kannada as India’s "ugliest language".
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X