• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

CBCID ఎంట్రీ:ప్లేబాయ్ కాశీ కథ క్లోజ్, వీఐపీలు, నటుడు,పోలీసు అధికారి భార్యలు, కూతుర్లు,ల్యాప్ టాప్ లో

|

చెన్నై/ కన్యాకుమారి: సోషల్ మీడియాను టార్గెట్ చేసుకుని సుమారు 100 మంది అమ్మాయిలు, ఆంటీలకు గాలం వేసి నగ్న వీడియోలు, ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసి వారి జీవితాలతో చెలగాటం ఆడిన ప్లేబాయ్ కాశీ పాపం పండిపోయింది. కామాంధుడు కాశీ కేసును CBCIDకి అప్పగించారు. ఇప్పుడు కాశీతో సన్నిహితంగా ఉన్న ఆ వీఐపీల భార్యలు ఎవరు ? నటుడి కుమార్తె ఎవరు ? పోలీసు అధికారి కుమార్తె ఎవరు ? అని అధికారులు పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. ఇప్పటికే కాశీకి చెందిన ల్యాప్ టాప్ ను పోలీసు అధికారులు ల్యాబ్ కు పంపించి పరిశీలించి అందులోని వీడియోలు, ఫోటోల గుంరించి ఆరా తియ్యడంతో ప్లేబాయ్ తో సన్నిహితంగా ఉన్న వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

Lockdown: భర్తను వదిలేసి ప్రియుడి బెడ్ రూంలో భార్య రొమాన్స్, పెట్రోల్ పోసి ఇద్దరిని తగలబెట్టిన భర్త

ప్లేబాయ్ ఆరాచకాలు !

ప్లేబాయ్ ఆరాచకాలు !

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్ కోవిల్ లో నివాసం ఉంటున్న కాశీ (26) అనే యువకుడు సోషల్ మీడియాలో సుమారు వంద మంది అమ్మాయిలు, వివాహిత మహిళలను వలలో వేసుకున్నాడు. తరువాత కాశీ అమ్మాయిలు, ఆంటీలతో రాసలీలలు సాగిస్తున్న సమయంలో రహస్యంగా పోర్న్ వీడియోలు, ఫోటోలు తీసి వారిని బ్లాక్ మెయిల్ చేశాడు.

ఆస్తులు, కబ్జాలు, దందాలు

ఆస్తులు, కబ్జాలు, దందాలు

అమ్మాయిలు, వివాహిత మహిళలను నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసిన కాశీ, అతని స్నేహితులు ఆ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బ్లాక్ మెయిల్ చేసి అనేక మంది వివాహిత మహిళలు, యువతుల ఇళ్లను స్వాధీనం చేసుకున్నాడని, భారీ మొత్తంలో నగదు, నగలు లాక్కొన్నాడని, వారి ఆస్తులు కబ్జా చేశాడని, మనీలాండరింగ్ కు పాల్పడ్డాడని ఇప్పటికే అనేక మంది ఫిర్యాదు చెయ్యడంతో కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణ చెయ్యడంతో అనేక వాస్తవాలు వెలుగు చూశాయి.

 విదేశాల్లో ఫ్రెండ్

విదేశాల్లో ఫ్రెండ్

ఇప్పటికే మూడు సార్లు కోర్టు అనుమతితో సుమారు 10 రోజులకు పైగా కాశీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. కామాంధుడు కాశీ చెప్పిన వివరాల ఆధారంగా అశ్లీల వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేసిన గినో (19) అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. కాశీ స్నేహితుడు ఒకరు సింగపూర్ లో తలదాచుకున్నాడని, అతన్ని అరెస్టు చెయ్యడానికి పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. సింగపూర్ లోని కాశీ స్నేహితుడిని అరెస్టు చెయ్యడానికి పోలీసులు అన్ని ఎయిర్ పోర్టుల్లో అధికారులను అలర్ట్ చేశారు.

వీఐపీలు, నటుడి కుమార్తె, భార్యల వీడియోలతో షాక్

వీఐపీలు, నటుడి కుమార్తె, భార్యల వీడియోలతో షాక్

కాశీ ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్న పోలీసులు షాక్ కు గురైనారు. కాశీలోని ల్యాప్ టాప్ లో బిగ్ షాట్స్ ఫ్యామిలీలకు చెందిన అమ్మాయిలు, వివాహిత మహిళల నగ్న వీడియోలు, ఫోటోలు ఉన్నాయని వెలుగు చూసింది. ప్రముఖ నటుడి కుమార్తె, మహిళా వైద్యులు, మహిళా ఇంజనీర్లు, అమ్మాయిలు, వారి తల్లులు, ఓ పోలీసు ఇన్స్ పెక్టర్ కుమార్తె, పలువురు వ్యాపారవేత్తల కుమార్తెలు కాశీ వలలో పడి మోసపోయారని లాప్ టాప్ లోని వివరాల ఆధారంగా బయటపడిందని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

 సీబీసీఐడీ చేతికి కామాంధుడి కేసు

సీబీసీఐడీ చేతికి కామాంధుడి కేసు

కామాంధుడు కాశీకి చెందిన ల్యాప్ టాప్ లో కొందరు వీఐపీల భార్యలకు చెందిన నగ్న వీడియోలు ఉండటంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. మనకు ఎక్కడ వచ్చిన రామాయణం అంటూ స్వయంగా పోలీసు అధికారులు కాశీ కేసును సీబీసీఐడీకి అప్పగించడానికి కొన్ని రోజుల క్రితమే సిద్దం అయ్యారు. ఇప్పుడు కాశీ కేసును సీబీసీఐడీ అధికారులకు అప్పగించారు. తమిళనాడు పోలీసులు ఇన్ని రోజులు దర్యాప్తు చేసిన కాశీ కేసులోని నివేదికలు, ఎఫ్ఐఆర్ ను మంగళవారం సీబీసీఐడీ అధికారులకు అప్పగించారని తెలిసింది.

కామాంధుడి కథ క్లోజ్ !

కామాంధుడి కథ క్లోజ్ !

ప్లేబాయ్ కాశీకి చెందిన ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్ లు, రహస్య కెమెరాలను ఇప్పటికే స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని కోర్టులో సమర్పించారు. కాశీకి చెందిన ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్లును సీబీసీఐడీ అధికారులు పరిశీలించారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీలతో పాటు ఆ కేసు నివేదికను తీసుకున్న సీబీసీఐడీ అధికారులు కాశీ కేసు విచారణ వేగవంతం చేశారని తెలిసింది. కాశీతో సన్నిహితంగా ఉన్న కొందరు వీఐపీల భార్యలు, వారి పిల్లలు, నటుడి కుమార్తె, మహిళా వైద్యులు, మహిళా ఇంజనీర్లు, ఆంటీలు ఇప్పుడు ఎక్కడ మమ్మల్ని విచారణకు పిలుస్తారో ? అని ఆందోళన చెందుతున్నారని ఓ సీనియర్ పోలీసు అధికారి అంటున్నారు.

English summary
Kanniyakumari Nagarcoil Kasi case have been transferred to CBCID in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more