వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

57 మందికి కరోనా, ఏడుగురికి గర్భం ఘటనలో సందేహాలు: పరిమితికి మించి విద్యార్థులు, అప్పుడే ఎందుకు..?

|
Google Oneindia TeluguNews

కాన్పూర్ వసతిగృహంలో గల 57 మందికి కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. అయితే షెల్టర్ హోంలో వసతి, భద్రతపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వసతి గృహంలో పనిచేసే వారికి ఈ నెల 15వ తేదీన కరోనా వైరస్ ఉంది అని నిర్ధారణ అయ్యింది. కానీ 17వ తేదీ వరకు వైరస్ సోకిన వారి సంఖ్య 33కు చేరుకుంది. రెండురోజులకు మరో 16 మందికి వైరస్ పాకింది. మరునాడు 8 మందికి వైరస్ సోకడంతో మొత్తం సంఖ్య 58కి చేరింది. తర్వాత అధికారులు నిద్రలేచి షెల్టర్ మూసివేశారు. మిగతావారిని ఇతర కేంద్రాలకు తరలించారు. అంటే మొదట్లోనే గుర్తిస్తే ఇంతమందికి వైరస్ సోకేది కాదు కదా అని ప్రజా సంఘాలు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి.

నిబంధనలు బేఖాతరు..

నిబంధనలు బేఖాతరు..

దీనికితోడు ఇక్కడ 100 మంది విద్యార్థులను ఉంచడానికి మాత్రమే అవకాశం ఉంది. కానీ 171 మంది పిల్లలను కుక్కారు. ఆ నిబంధనలను పాటించిన.. వైరస్ వేగంగా ప్రబలి ఉండేది కాదు. దీంతోపాటు జూన్ 15వ తేదీన షెల్టర్ హోం సీజ్ చేస్తే.. వైరస్ ఒకరితోనే పోయేది. రెండోసారి కేసులు వెలువడిన 17వ తేదీన సీజ్ చేసిన కొంచెం మేలు అని ని మేధావులు అంటున్నారు. ఇప్పుడు 57 మందికి సోకి.. విద్యార్థుల భవితను ప్రశ్నార్థకం మార్చిందని చెబుతున్నారు.

ఏడుగురు బాలికలు ప్రెగ్నెంట్..

ఏడుగురు బాలికలు ప్రెగ్నెంట్..

అంతేకాదు వసతిగృహంలో మొత్తం ఏడుగురు బాలికలు గర్భం దాల్చారు. ఇందులో ఐదుగురికి కరోనా వైరస్ కూడా సోకింది. ఇద్దరు మాత్రం నెగిటివ్ వచ్చింది. గర్భం దాల్చిన ఒక బాలికకు హెచ్ఐవీ పాజిటివ్ కూడా వచ్చిందని విషయం విస్తుగోలిపింది. ఘటనపై విచారణ జరుపుతున్నామని అధికారులు చెబుతున్నారు.

ప్రియాంక ఫైర్..

ప్రియాంక ఫైర్..


కాన్పూర్ షెల్టర్ హోం ఘటనపై కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ మండిపడ్డారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు. ముజఫర్ నగర్, డియోరియా షెల్టర్ హోంలో జరిగిన ఉదంతాలను ప్రియాంక గాంధీ గుర్తుచేశారు. బాలికలు గర్భం దాల్చారనే అంశంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. వారు షెల్టర్ హోంకు రాకముందే ప్రెగ్నెంట్ అయ్యారని వారు చెబుతున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని.. నిజ నిజాలు బయటపెడుతామని కాన్పూర్ కమిషనర్ తెలిపారు.

English summary
probe into the Kanpur shelter home case, where 57 girls tested positive for coronavirus, has revealed that the administration didn’t seal the building after the first case was recorded on June 15.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X