వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేదన వర్ణించలేను: కూచిభొట్ల హత్యపై ప్రధాని మోడీకి కాన్సాస్‌ గవర్నర్‌ లేఖ

అమెరికాలో ఓ జాత్యహంకార కాల్పుల్లో మృతిచెందిన శ్రీనివాస్‌ కూఛిబొట్ల మృతిపై కాన్సాస్‌ గవర్నర్‌ శామ్ బ్రౌన్‌బ్యాక్‌ దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన ఓ లేఖ రాశారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమెరికాలో ఓ జాత్యహంకార కాల్పుల్లో మృతిచెందిన శ్రీనివాస్‌ కూఛిబొట్ల మృతిపై కాన్సాస్‌ గవర్నర్‌ శామ్ బ్రౌన్‌బ్యాక్‌ దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన ఓ లేఖ రాశారు.

మోడీకి గవర్నర్ లేఖ

మోడీకి గవర్నర్ లేఖ

కేన్సస్‌లో జాతి వివక్షకు, అసహనానికి చోటు లేదని లేఖలో బ్రౌన్‌బ్యాక్ పేర్కొన్నారు. శ్రీనివాస్‌, అలోక్‌లపై హింసాత్మక దాడికి విచారం వ్యక్తంచేస్తున్నట్లు తెలిపారు. కూచిభొట్ల శ్రీనివాస్‌ భార్య, అతడి కుటుంబ సభ్యుల వేదనను మాటల్లో వర్ణించలేమని పేర్కొన్నారు.

వేదన వర్ణించలేను..

వేదన వర్ణించలేను..

సత్యమే ఎప్పుడూ గెలుస్తుందని గవర్నర్ చెప్పారు. ఘటన జరిగిన సమయంలోనే గవర్నర్ బ్రౌక్‌బ్యాక్ స్పందించారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్ణకరమని అన్నారు. ఇలాంటి జాత్యహంకార దాడులకు అమెరికాలో తావులేదన్నారు.

గవర్నర్ రాసిన లేఖ..

గవర్నర్ రాసిన లేఖ..

కాగా, అమెరికాలో వరుస దాడులు జరుగుతుండటంతో అక్కడి ప్రవాస భారతీయులు, ఇక్కడి వారి కుటుంబాల్లో ఆందోళనకర వాతావరణం నెలకొంది. శ్రీనివాస్ కూచిభొట్ల హత్యకు ముందు వరంగల్‌కు వంశీ అనే యువకుడు కూడా అమెరికాలో జరిగిన కాల్పుల్లో మృతి చెందాడు.

శ్రీనివాస్ హత్యపై గవర్నర్ దిగ్భ్రాంతి..

శ్రీనివాస్ హత్యపై గవర్నర్ దిగ్భ్రాంతి..

ఆ తర్వాత గుజరాత్‌కు చెందిన ఓ వ్యాపారిని అమెరికాలోని అతని నివాసం వద్దనే దుండగులు కాల్చి చంపారు. ఐదు రోజుల క్రితం తెలంగాణకు చెందిన ఓ యువతిపైనా అమెరికాలో దాడి జరిగడం గమనార్హం.

English summary
Kansas Governor Sam Brownback has written a letter to Prime Minister Narendra Modi expressing "profound regret" at the terrible act of violence against Indian nationals last month and said that acts of hate and intolerance have no place in his state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X