• search
 • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అమ్మాయిలు, ఆంటీల జీవితాలు నాశనం, ప్లేబాయ్ కథ క్లోజ్, వీడి కేసు వాదిస్తే ఇంట్లోకి రానివ్వరు, లాయర్లు

|

చెన్నై/నాగర్ కోవిల్: సోషల్ మీడియాలో అమ్మాయిలు, ఆంటీలతో పరిచయం పెంచుకుని వారిని నమ్మించి మోసం చేసి పోర్నో వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి వారి జీవితాలతో చెలగాటం ఆడుకున్న ప్లేబాయ్ కాశీ (26) కథ క్లోజ్ అవుతోంది. ఇప్పటికే అనేక మంది కేసులు పెట్టడంతో అరెస్టు అయిన ప్లేబాయ్ కాశీకి చుక్కెదురైయ్యింది. అమ్మాయిలు, వివాహిత మహిళల జీవితాలతో చెలగాటం ఆడటమే కాకుండా భూ దందాలు, స్కామ్ లు, సెటిల్ మెంట్లతో పాటు పోర్నో వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన కామాంధుడు కాశీ కేసు వాదిస్తే మనల్ని ఇంట్లోకి కూడా రానివ్వరని, అతని కేసు వాదించకూడదని న్యాయవాదుల సంఘం నిర్ణయించింది. కాశీని కోర్టుకు తీసుకు వస్తే ఆ రోజు విధులు బహిష్కరించాలని న్యాయవాదుల సంఘం తీర్మానించింది. అమ్మాయిల జీవితాలతో చెలగాటం ఆడాడని నమోదైన అనేక కేసులతో పాటు కాశీ నియమాలు ఉల్లంఘించి పోలీసు అధికారులు తల మీద పెట్టుకునే టోపి పెట్టుకుని ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పెట్టాడని ఇప్పుడు మరో కేసు నమోదు కావడంతో ప్లేబాయ్ కాశీ మరింత ఇబ్బందులకు గురైనాడు.

Lockdown: కాలేజ్ అమ్మాయిలతో హైటెక్ వ్యభిచారం, డ్రగ్స్, బీర్లు, బిరియానీలు, బ్లాక్ మెయిల్ !

 లేడీ డాక్టర్ దెబ్బతో రీల్ తిరిగింది

లేడీ డాక్టర్ దెబ్బతో రీల్ తిరిగింది

తమిళనాడులోని నాగర్ కోవిల్ గణేశపురంకు చెందిన తంగపాండియన్ కుమారుడు కాశీ అలియాస్ సుజ్జి (26) మీద చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రి లేడీ డాక్టర్ ఫిర్యాదు చెయ్యడంతో మొదటి కేసు నమోదు చేశారు. లేడీ డాక్టర్ ఫిర్యాదు చెయ్యడంతో ఇప్పటికే కొత్తార్ పోలీసులు కాశీని అరెస్టు చేశారు. అమ్మాయిలు, ఆంటీలను మోసం చేశానని స్వయంగా కాశీ పోలీసుల విచారణలో అంగీకరించాడు. పోలీసు కస్టడీలో కాశీ అనేక విషయాలు బయటపెట్టాడు.

 ఆంటీ కేసుతో భాదితులు క్యూ

ఆంటీ కేసుతో భాదితులు క్యూ

నాగర్ కోవిల్ ప్రాంతానికి చెందిన ఓ వివాహిత మహిళను కాశీ మోసం చేశాడని వెలుగు చూసింది. రెండు సంవత్సరాల క్రితం నాగర్ కోవిల్ కు చెందిన వివాహిత మహిళను నమ్మించి ఆమెను లొంగదీసుకుని రాసలీలలు సాగించాడని, తరువాత రహస్యంగా తీసిన నగ్న వీడియోలు, ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసి ఆమె దగ్గర భారీ మొత్తంలో నగదు, రూ. 2. 50 లక్షల విలువైన బంగారు నగలు లూటీ చేశాడని కన్యాకుమరి జిల్లా ఎస్పీ ఎన్. శ్రీనాథ్ తెలిపారు. చెన్నై లేడీ డాక్టర్, నాగర్ కోవిల్ వివాహిత మహిళ ఫిర్యాదు చేసిన తరువాత కాశీ చేతిలో మోసపోయిన అమ్మాయిలు, వివాహిత మహిళలు ఒక్కొక్కరు ధైర్యంగా ముందుకు వచ్చి కాశీ మీద కేసులు పెడుతున్నారు.

కాశీ అండ్ కో గ్యాంగ్

కాశీ అండ్ కో గ్యాంగ్

నాగర్ కోవిల్ లోని కాశీ ఫ్రెండ్స్ ఇళ్లల్లో సోదాలు చేసిన పోలీసులు అతనికి సంబంధించిన ల్యాప్ టాప్ లు, సీక్రెట్ కెమెరాలు, మొబైల్ ఫోన్లు, సీక్రెట్ మొబైల్ వాచ్ లు స్వాధీనం చేసుకున్నారు. కాశీ ఒక్కడే ఇంత దందా చెయ్యడానికి అవకాశం లేదని, అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చెయ్యడానికి అతని వెనుక చాల పెద్ద గ్యాంగ్ ఉందని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 100 మందికి పైగా అమ్మాయిలు, వివాహిత మహిళల జీవితాలతో చెలగాటం ఆడుకున్న కాశీ వెనుక పెద్ద గ్యాంగ్ ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కాశీ అండ్ కో టీం మీద పోలీసులు నిఘా వేశారు.

 దుబాయ్ లో ష్రెండ్ ?

దుబాయ్ లో ష్రెండ్ ?

కామాంధుడు కాశీకి నాగర్ కోవిల్ లోని అబ్జ్వర్ స్ట్రీట్ లో నివాసం ఉంటున్న డెసన్ జినో (19) అనే యువకుడు సహకరించాడని పోలీసులు గుర్తించారు. డెసన్ జినోకు 19 ఏళ్ల కూడా పూర్తి కాలేదని, అతనికి క్రిమినల్ మైండ్ ఉందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. డెసన్ జినోతో పాటు దుబాయ్ లో ఉంటున్న కాశీ ఫ్రెండ్ కూడా అమ్మాయిలు, వివాహిత మహిళల రహస్య ఫోటోలు, పోర్న్ వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

 అమ్మాయిలు, ఆంటీలతో దందాలు

అమ్మాయిలు, ఆంటీలతో దందాలు

సోషల్ మీడియాలో వల వేసిన అమ్మాయిలు, ఆంటీలను అడ్డం పెట్టుకుని కాశీ, అతని స్నేహితులు భూ దందాలు, స్కాంలు, పోర్న్ వీడియోల వ్యాపారం చేశారని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయిల జీవితాలతో చెలగాటం ఆడటమే కాకుండా చాలా దందాలతో కాశీకి, అతని స్నేహితులకు సంబంధాలు ఉన్నాయని పోలీసు అధికారులు అంటున్నారు.

 పోలీసు యూనీఫాంతో గేమ్స్

పోలీసు యూనీఫాంతో గేమ్స్

అమ్మాయిలు, ఆంటీలకు వల వెయ్యడానికి కాశీ ఖరీదైన దుస్తులు వేసుకుని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇదే సమయంలో నోట్ల కట్టలు వెనుక పెట్టుకుని, పోలీసు అధికారులు గర్వంగా తల మీద పెట్టుకునే టోపిని పెట్టుకుని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అవి వైరల్ అయ్యాయి. అమ్మాయిల జీవితాలతో చెలగాటం ఆడటమే కాకుండా మా యూనీఫాం, టోపీ పెట్టుకుని గేమ్స్ ఆడుతావా ? అంటూ కాశీ మీద పోలీసులు మరో కేసు నమోదు చేశారు.

లాయర్లు ఏకగ్రీవ తీర్మానం

లాయర్లు ఏకగ్రీవ తీర్మానం

కామాంధుడు కాశీ మీద ఇప్పటికే అనేక కేసులు నమోదు కావడంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. అమ్మాయిలు, వివాహిత మహిళల జీవితాలతో చెలగాటం ఆడిన కాశీని విడిపించడానికి అతని కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు లాయర్లను ఆశ్రయించారు. అయితే కాశీ తరపున కేసు వాదించకూడదని నాగర్ కోవిల్ న్యాయవాదుల సంఘం ఏకగ్రీవ తీర్మానం చేసింది.

  #Watch : A Woman With Infant Travelling Between Train Bogies
   కాశీ వెనుక వీఐపీలు ?

  కాశీ వెనుక వీఐపీలు ?

  కాశీ ఒక్కడే ఇంత దందా చెయ్యడానికి అవకాశం లేదని, అమ్మాయిల జీవితాలతో చెలగాటం ఆడాడటమే కాకుండా అతను భూ దందాలు, స్కాంలు, సెటిల్ మెంట్లు చేశాడని పోలీసు అధికారులు అంటున్నారు. కాశీ వెనుక వీఐపీలు, బడా నాయకులు ఉన్నారని, అందు వలన అతని కేసు ఎవ్వరూ వాదించకూడదని నాగర్ కోవిల్ న్యాయవాదుల సంఘం నిర్ణయించింది. కాశీని కోర్టు ముందు హాజరుపరిచన రోజు మనం విధులు బహిష్కరించాలని నాగర్ కోవిల్ న్యాయవాదుల సంఘం తీర్మానించింది.

  కాశీ కేసు వాదించకూడదని నాగర్ కోవిల్ న్యాయవాదులు నిర్ణయించడంతో అతనికి బెయిల్ మంజూరు చేయించడం చాలా కష్టంగా మారింది. కామాంధుడు కాశీకి న్యాయవాది చిక్కే వరకు అతను జైలుకే పరిమితం కానున్నాడని ఓ సీనియర్ పోలీసు అధికారి అంటున్నారు.

  English summary
  Tamil Nadu: Kanyakumari Nagercoil lawyers in nagercoil has decided boycott to appear in court for Nagercoil kasi. Kanyakumari district police arrested a 19-year-old youth who was the accomplice of sexual predator Kasi alias Suji in Nagercoil.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more