వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కపిల్ మిశ్రాపై అసెంబ్లీలోనే ఆప్ ఎమ్మెల్యేల దాడి

ఆప్ నుండి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్యే కపిల్ మిశ్రాపై ఆప్ ఎమ్మెల్యేలు ఢిల్లీ అసెంబ్లీలోనే బుదవారం నాడు దాడికి దిగారు. పరిస్థితిని అదుపుచేసేందుకుగాను మార్షల్స్ కపిల్ మిశ్రాను బలవంతంగా అసెంబ్లీ నుండి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆప్ నుండి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్యే కపిల్ మిశ్రాపై ఆప్ ఎమ్మెల్యేలు ఢిల్లీ అసెంబ్లీలోనే బుదవారం నాడు దాడికి దిగారు. పరిస్థితిని అదుపుచేసేందుకుగాను మార్షల్స్ కపిల్ మిశ్రాను బలవంతంగా అసెంబ్లీ నుండి బయటకు తీసుకెళ్ళారు.

ఆప్ గుండాలు తనపై దాడికి యత్నించారని కపిల్ మిశ్రా ఆరోపించారు. అయితే కేజ్రీవాల్ బెదిరింపులకు తాను భయపడేది లేదన్నారు. కేజ్రీవాల్ బండారం మొత్తం బయటపెడతానని చెప్పారు.

Kapil Mishra heckled, thrashed in Delhi Assembly by AAP MLAs

సభలో తనకు మాట్లాడేందుకు అవకాశం కూడ ఇవ్వలేదని కపిల్ మిశ్రా ఆరోపించారు. కేజ్రీవాల్ బండారాన్ని బయటపెడతానని ఆయన వ్యాఖ్యానించారు. సభలో తనకు మాట్లాడుతుండగానే ఆప్ ఎమ్మెల్యేలు దాడికి దిగారని ఆయన చెప్పారు.

తనపై దాడిచేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నవ్వుతున్నారని, అలాగే డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా ఆప్ ఎమ్మెల్యేలను దాడికి ప్రోత్సహించారని కపిల్ మిశ్రా ఆరోపించారు.

జీఎస్టీ పై చర్చించేందుకు ఢిల్లీ అసెంబ్లీ బుదవారం నాడు ప్రత్యేకంగా సమావేశమైంది. అయితే కపిల్ మిశ్రాకు ఆప్ ఎమ్మెల్యేలకు మధ్య అసెంబ్లీ జరుగుతుండగా వాగ్వావాదం చోటుచేసుకొంది. మిశ్రాను బయటకు వెళ్ళాలని స్పీకర్ కోరాడు. ఆయన బయటకు వెళ్ళకుండా ఉండడంతో ఆప్ ఎమ్మెల్యేలు ఆయనపై దాడికి దిగారు.

English summary
The Delhi Assembly on Wednesday witnessed high drama when sacked minister Kapil Mishra was attacked by Aam Aadmi Party MLAs and others, after which the speaker ordered him to be marshalled out of the house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X