వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓల్డ్ మంక్ సృష్టికర్త కపిల్ ఇక లేరు: ఇష్టమైన బ్రాండ్ అంటూ పూనంపాండే విచారం

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఓల్డ్ మంక్ సృష్టికర్త ఇక లేరు : పూనమ్ పాండే ఏమందంటే ?

ముంబై: ప్రముఖ లిక్కర్ వ్యాపారి, డార్క్ రమ్ ఓల్డ్ మంక్ సృష్టికర్త బ్రిగేడియర్ కపిల్ మోహన్ కన్నుమూశారు. జనవరి 6వ తేదీన తుది శ్వాస విడిచారు. కాగా, ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘజియాబాద్‌లోని మోహన్ నగర్‌లోని తన నివాసంలో ఆయన గుండెపోటుతో మృతి చెందారు.

రూ.3.21కోట్లతో పట్టుబడ్డ జెట్‌ ఎయిర్‌వేస్ ఉద్యోగిని: ఏం జరుగుతోందంటే.?రూ.3.21కోట్లతో పట్టుబడ్డ జెట్‌ ఎయిర్‌వేస్ ఉద్యోగిని: ఏం జరుగుతోందంటే.?

మోహన్ మేకిన్ లిమిటెడ్ పేరుతో 1954లో ఓల్డ్ మంక్ రమ్ సంస్థను ఆయన నెలకొల్పారు. ఓల్డ్ మంక్ తోపాటు సోలాన్ నెం.1. గోల్డెన్ ఈగల్ వంటి రెండు బ్రాండ్లను కూడా ఆయన ప్రవేశపెట్టారు.

ఓల్డ్ మంక్ అమ్మకాల జోరు

ఓల్డ్ మంక్ అమ్మకాల జోరు

కాగా, డార్క్ రమ్‌గా ఓల్డ్ మంక్ అమ్మకాలు కొన్నేళ్లపాటు జోరుగా సాగాయి. ఎలాంటి మద్యం తీసుకోని కపిల్ మోహన్ లిక్కర్ కింగ్‌గా ప్రాచుర్యం పొందినప్పటికీ.. చక్కెర, వస్త్ర పరిశ్రమలను కూడా విజయవంతంగా ముందుకు నడిపించారు.

 పద్మశ్రీ వరించింది

పద్మశ్రీ వరించింది

వ్యాపార రంగంలో మోహన్ కృషికి గానూ కేంద్ర ప్రభుత్వం 2010లో ఆయనకు పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఆయన అనారోగ్యం బారిన పడటంతో వ్యాపారాన్ని బంధువులకు అప్పగించేశారు. అప్పట్నుంచి ఓల్డ్ మంక్ అమ్మకాలు తగ్గిపోయినట్లు తెలుస్తోంది.

 ఓల్డ్ మంక్ చరిత్ర

ఓల్డ్ మంక్ చరిత్ర

ఎడ్వర్డ్ డయ్యర్ 1855లో కసౌలిలో తన పేరు మీద బ్రెవరీ సంస్థను ఏర్పాటు చేశారు. కొంత కాలం తర్వాత మరో లిక్కర్ సంస్థ హెచ్‌జీ మేకిన్‌తో చేతులు కలిపి.. డయ్యర్ మేకిన్ అండ్ కో లిమిటెడ్‌గా దేశ వ్యాప్తంగా వ్యాపారం చేయడం ప్రారంభించారు. 1935లో బర్మా ఉపఖండం నుంచి విడిపోగా.. డయ్యర్ మేకిన్ బ్రెవరీస్ లిమిటెడ్‌గా సంస్థ రూపాంతరం చెందింది. ఆ తర్వాత కపిల్ మోహన్ ఆ సంస్థను చేజిక్కించుకున్నారు. అనంతరం ఆ కంపెనీ మోహన్ మేకిన్ బ్రేవరీస్ లిమిటెడ్(1966-80)గా మారిపోయింది. మరికొంత కాలం తర్వాత దాని పేరు మోహన్ మేకిన్ లిమిటెడ్‌గా మార్చేశారు.

 తొలిసారి వెనిలా ఫ్లేయర్‌లో.. అభిమానుల్లో విషాదం

తొలిసారి వెనిలా ఫ్లేయర్‌లో.. అభిమానుల్లో విషాదం

కపిల్ మోహన్.. 1954లో మొదటిసారి వెనిలా ఫ్లేవర్‌తో ఓల్డ్ మంక్ రమ్‌ను లాంచ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రమ్ చాన్నాళ్లు అత్యధికంగా అమ్ముడుపోయింది. కపిల్ మోహన్ మృతి పట్ల ఓల్డ్ మంక్ ప్రియులు, సోషల్ మీడియా నెటిజన్లు నివాళి అర్పించారు.

గాలిలో విమానం: లండన్-ముంబై ఫ్లైట్లో కొట్టుకున్న పైలట్లపై వేటు, ఇకపై ప్రయాణికులేగాలిలో విమానం: లండన్-ముంబై ఫ్లైట్లో కొట్టుకున్న పైలట్లపై వేటు, ఇకపై ప్రయాణికులే

తనకిష్టమైన బ్రాండంటూ పూనమ్ పాండే

‘నేను నమ్మలేకపోతున్నా.. ఓల్డ్ మంక్ సృష్టకర్త ఇక లేరు. నేను టీనేజ్ నుంచే స్నేహితులతో ఆ మందు తాగాను. నేను ఆయన్నెంతో మిస్సవుతున్నా. అయితే, ఓల్డ్ మంక్ సృష్టికర్తగా ఆయన మాత్రం అందరి హృదయాల్లో జీవించే ఉంటారు' అని సినీ నటి, మోడల్ పూనమ్ పాండే వ్యాఖ్యానించారు.

పాక్‌ను వేలెత్తి చూపొద్దు: అమెరికాకు తేల్చి చెప్పిన చైనాపాక్‌ను వేలెత్తి చూపొద్దు: అమెరికాకు తేల్చి చెప్పిన చైనా

English summary
It is a sad day for the Old Monk fans. Kapil Mohan, the man behind the iconic Old Monk rum has passed away.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X