వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీజీ! అచ్ఛేదిన్ ఇదేనా?: కపిల్ శర్మ ఫైర్, ఫడ్నవీస్ వార్నింగ్

|
Google Oneindia TeluguNews

ముంబై: ప్రముఖ కమెడియన్‌, టీవీ వ్యాఖ్యాత కపిల్‌ శర్మ అవినీతిని ప్రశ్నిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ కార్యాలయంలో పనికోసం వెళ్లిన కపిల్‌కు చేదు అనుభవం ఎదురవడంతో ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వరుస ట్వీట్లతో ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

Kapil Sharma attacks PM Narendra Modi, asks 'Is this ache din?'

వివరాల్లోకి వెళితే.. తన కార్యాలయం పని నిమిత్తం ముంబైలోని ఓ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లిన కపిల్‌ను అక్కడి అధికారులు లంచం అడిగారట. దీంతో ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లారు.

'ఆదాయ పన్ను కింద గత ఐదేళ్లుగా రూ.15కోట్లు ప్రభుత్వానికి చెల్లిస్తున్నాను. అయినా సరే నా ఆఫీస్‌ను నడిపేందుకు ఇప్పుడు బొబాయి మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ)కు రూ.5లక్షల లంచం ఇవ్వాలట. మోడీ గారు ఇదేనా మీ అచ్ఛేదిన్‌?' అంటూ కపిల్‌ ప్రశ్నించారు.

ఇది ఇలా ఉండగా, కపిల్ శర్మ ట్వీట్లపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రస్థాయిలో స్పందించారు. లంచం అడిగేవారిని వదిలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం కార్యాలయాల్లో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

కాగా, కపిల్ శర్మ తనను లంచం అడిగిన అధికారి పేరును తెలుపుతూ తమకు ఫిర్యాదు చేయాలని, అతనిపై వెంటనే చర్యలు తీసుకుంటామని బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ స్పష్టం చేసింది.

English summary
Comedian Kapil Sharma has accused the system under Modi government of being corrupted and questioned his 'acche din' slogan. Kapil took to Twitter to vent out his frustration after one of BMC allegedly asked for 5 lacks bribe from him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X