ఆ పార్టీలో డ్రగ్స్ వాడలేదన్న కరణ్ జోహర్ .. మద్దతుగా అలియా భట్, సోనమ్ కపూర్ తదితరులు
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణ దర్యాప్తులో రియా చక్రవర్తి పాత్ర , రియా వాట్సప్ చాట్ లో వెలుగు చూసిన డ్రగ్స్ కోణం ఆ తరువాత పరిణామాలు బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి .ఇక ఇటీవల డ్రగ్స్ కేసులో భాగంగా కరణ్ జోహార్ గత ఏడాది నవంబర్లో నిర్వహించిన పార్టీ వీడియో చర్చనీయాంశం అయింది . బాలీవుడ్ డ్రగ్స్ కేసులో తనపై వైరల్ అవుతున్న విమర్శలపై క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ కరణ్ జోహర్.
డ్రగ్స్ చాట్ చేశా.. కానీ తీసుకోలేదన్న రకుల్.. నేడు కొనసాగుతున్న దీపికా పదుకొనే విచారణ

ఆ పార్టీకి డ్రగ్స్ కు సంబంధం లేదన్న కరణ్ జోహర్
2019 నవంబర్ లో జరిగిన పార్టీ కి, డ్రగ్స్ కు , తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారన్న మీడియా వార్తలను ఆయన ఖండించారు. నిరాధారమైన ఆరోపణలు అంటూ కొట్టిపారేశారు. ఆ పార్టీలో ఎవరూ డ్రగ్స్ తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. తనపై వస్తున్న ఆరోపణల తో తను తన ఫ్యామిలీ తీవ్ర వేదనకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు కరణ్ జోహార్ . క్షితిజ్ ప్రసాద్, అనుభవ్ చోప్రాతో తనకు వ్యక్తిగత సంబంధాలు లేవని పేర్కొన్నారు .

అనుభవ్ చోప్రా కేవలం రెండు నెలలే ఓ సినిమాకి పని చేశారన్న కరణ్ జోహర్
అనుభవ్ చోప్రా కేవలం రెండు నెలల పాటు ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారని కరణ్ జోహార్ తెలిపారు. అంతేకాదు వారు ధర్మా ప్రొడక్షన్ ఉద్యోగులు కూడా కారని చెప్పారు. డ్రగ్స్ కేసులో తనపై విమర్శలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేసిన ఆయన ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలా ప్రచారం చెయ్యటం దారుణం అన్నారు. కరణ్ జోహర్ స్పందనతో
అలియా భట్, సోనమ్ కపూర్ సహా పలువురు తారలు కరణ్ జోహార్ కు మద్దతునిచ్చారు. సోషల్ మీడియా వేదికగా వారు తమ మద్దతును తెలియజేశారు.

కరణ్ కు అలియా భట్ , సోనమ్ కపూర్ తో పాటు పలువురి మద్దతు
అలియా భట్, సోనమ్ కపూర్, మలైకా అరోరా , మనీష్ మల్హోత్రా, విక్కీ కౌశల్, గౌరీ ఖాన్, సోనీ రాజ్దాన్ కరణ్ జోహార్ కు మద్దతుగా నిలిచారు. కరణ్ జోహర్ తనకు డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం లేదని చెప్తున్నారు. అయితే ఆయనను త్వరలో ఎన్సిబి విచారణ నిమిత్తం పిలిచే అవకాశముందని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఇక ఈ రోజు బాలీవుడ్ డ్రగ్స్ కేసులో దీపికా పదుకొనే, దీపికా మేనేజర్ కరిష్మా ప్రకాష్, సారా అలీ ఖాన్ , శ్రద్ధా కపూర్ లను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారిస్తోంది.