బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైద్యుల మీద దాడి కేసు, పొలీస్టేషన్ లో లొంగిపోయిన నాయకురాలు అశ్విని గౌడ!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగరంలోని విక్టోరియా ఆసుపత్రి ఆవరణంలోని మింటో ఆసుపత్రి వైద్యుల మీద దాడులు చేశారని ఆరోపిస్తూ నమోదైన కేసులో కర్ణాటక రక్షణా వేదిక (కరవే) కార్యకర్తలు పోలీసుల ముందు లొంగిపోయారు. కర్ణాటక రక్షణా వేదిక మహిళా నాయకులు అశ్విని గౌడతో సహ 13 మంది నాయకులు, కార్యకర్తలు తమ ముందు లొంగిపోయారని శుక్రవారం వీవీ పురం పోలీసులు తెలిపారు.

లేడీ టీచర్ సెక్స్ పాఠాలు, బెడ్ రూంలో ప్రియుడు, అమ్మాయిలు, అబ్బాయిలు, వీడియోలు తీసి!లేడీ టీచర్ సెక్స్ పాఠాలు, బెడ్ రూంలో ప్రియుడు, అమ్మాయిలు, అబ్బాయిలు, వీడియోలు తీసి!

మొదట లొంగిపోవాలి

మొదట లొంగిపోవాలి

కర్ణాటక రక్షణా వేదిక కార్యకర్తలు మొదట పోలీసుల ముందు లొంగిపోవాలని, తరువాత మా ఆందోళన, ధర్నాలు విరమించాలా ? వద్దా ? అని ఆలోచిస్తామని వైద్యులు, ఐఎంఎ నాయకులు అంటున్నారు. కర్ణాటక రక్షణా వేదిక కార్యకర్తలు లొంగిపోయారని, మీరు ధర్నా విరమించాలని పోలీసులు వైద్యులకు నచ్చ చెబుతున్నారు.

విక్టోరియా డీన్ తో చర్చలు

విక్టోరియా డీన్ తో చర్చలు

వైద్యులు ధర్నా విరమించే విషయంలో విక్టోరియా ఆసుపత్రి డీన్ తో ప్రభుత్వ అధికారులు, పోలీసులు చర్చలు జరుపుతున్నారు. విక్టోరియా ఆసుపత్రి డీన్, వైద్య సంఘాల నాయకులతో చర్చలు పూర్తి అయిన తరువాత ధర్నా విరమించే విషయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని వైద్యులు అంటున్నారు.

లేడీ లీడర్ అశ్విని గౌడ

లేడీ లీడర్ అశ్విని గౌడ

లొంగి పోయిన కర్ణాటక రక్షణా వేదిక మహిళా విభాగం అధ్యక్షురాలు అశ్విని గౌడతో సహ 13 మందిని కోర్టు ముందు హాజరుపరిచి విచారణ చేస్తామని బెంగళూరులోని వీవీ పురం పోలీసులు తెలిపారు. కర్ణాటక రక్షణా వేదిక నాయకుల ఆరోపణలను పోలీసులు రికార్డు చేసుకుంటున్నారు.

వైద్యుల మీద దాడులు?

వైద్యుల మీద దాడులు?

ఇప్పటికే మింటో ఆసుపత్రి వైద్యుల ఫిర్యాదు మేరకు కర్ణాటక రక్షణా వేదిక కార్యకర్తల మీద కేసు నమోదైయ్యింది. మింటో ఆసుపత్రి జూనియర్ డాక్టర్ల మీద రక్షణా వేదిక కార్యకర్తలు దాడులు చేశారని ఆరోపిస్తూ కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులు ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు.

రొగుల కోసం అరెస్టు

రొగుల కోసం అరెస్టు

అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔట్ పేషంట్ (ఓపి) సేవలు నిలిచిపోవడంతో రోగులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మింటో ఆసుపత్రి వైద్యుల డిమాండ్ మేరకు తాము పోలీసుల ముందు లొంగిపోలేదని, రోగుల ఇబ్బందు ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో లొంగిపోతున్నామని కర్ణాటక రక్షణా వేదిక కార్యకర్తలు తెలిపారు.

English summary
Bengaluru Minto Doctors strike :Karave Activists Ashwini Gowda And other 13 activists are surrendered to VV puram Police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X