వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్గిల్ ప్రత్యేకం: యుద్ధం ఎందుకు జరిగింది?(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

ద్రాస్(జమ్మూకాశ్మీర్): కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి 15ఏళ్లు అవుతున్న సందర్భంగా కార్గిల్ విజయం సాధించిన రోజు (కార్గిల్ విజయ్ దివాస్)ను జులై 26 శనివారం నాడు జరుపుకునేందుకు భారతదేశం సిద్ధమవుతోంది. భారత సైనికుల ధైర్యం, సాహాసాలతో 1999(మే-జు)లో జరిగిన కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించింది.

కార్గిల్ యుద్ధం ఎలా మొదలైంది?

భారత్-పాకిస్థాన్‌ల మధ్య మే 8న కార్గిల్ యుద్ధం ప్రారంభమైంది. మనదేశంలోని లడఖ్, ఇతర సరిహద్దుల వద్ద ఉన్న వాస్తవాధీన రేఖను దాటి పాకిస్థాన్ సైన్యం మనదేశంలోకి ప్రవేశించింది. దీంతో భారత్ యుద్ధం చేసేందుకు సిద్ధమైంది. ఈ యుద్ధం సుమారు మూడు నెలలపాటు సాగింది. 1999, జులై 4న 11 గంటలపాటు సుదీర్ఘ యుద్ధం చేసిన అనంతరం భారత్ తిరిగి టైగర్‌హిల్స్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోగలిగింది.

కార్గిల్ విజయ్ దివాస్

కార్గిల్ విజయ్ దివాస్

1999, జులై 26న కార్గిల్ యుద్ధంలో విజయం సాధించిన నాటి నుంచి జులై 26ను కార్గిల్ విజయ్ దివాస్‌గా జరుపుకోవడం జరుగుతోంది. పాకిస్థాన్ దళాలు ఆక్రమించిన మనదేశంలోని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవడం జరిగింది.

వార్ మెమోరియల్

వార్ మెమోరియల్

శ్రీనగర్-లెహ్ జాతీయ రహదారి 1డి తోలోలింగ్ హిల్స్ పాదాల వద్ద ఏర్పాటు చేసిన ద్రాస్ వార్ మెమోరియల్‌ను విజయ్‌పథ్ అని కూడా పిలుస్తారు. కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత సైనికుల గౌరవసూచకంగా ఈ మెమోరియల్‌ను నిర్మించడం జరిగింది.

భారత సైనికులే విజేతలు

భారత సైనికులే విజేతలు

ద్రాస్ ప్రపంచంలోనే రెండో అత్యంత తక్కువ ఉష్ణోగ్రత గల ప్రాంతం. ఈ ప్రాంతం నుంచే భారత సైనికులు తమ మాతృదేశం కోసం పోరాటం సాగించారు.

త్యాగాలను మరువలేం

త్యాగాలను మరువలేం

తమ లక్ష్యాన్ని సాధించడం కోసం తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టిన మన సైనికుల త్యాగాలను ఎన్నటికీ మరువలేం. వారి త్యాగాలు అమూల్యం.

అమర్ జ్యోతి

అమర్ జ్యోతి

మన సైనికులను జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన అమర్ జ్యోతి జవాన్ నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. సైనికులే దీని నిర్వహణ చూస్తారు. ప్రతి సంవత్సరం ప్రధానమంత్రి, సైనిక అధిపతి, ఇతర సీనియర్ అధికారులు ఇక్కడకు వచ్చి అమర సైనికులకు ఘన నివాళి అర్పిస్తారు.

బంగారు అక్షరాలు

బంగారు అక్షరాలు

కార్గిల్ యుద్ధంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన సైనికులు, సైనిక అధికారుల పేర్లతో కూడిన మెమోరియల్ వాల్.

జాతీయ పతాకంపైనే భారత సైనికుల దృష్టి

జాతీయ పతాకంపైనే భారత సైనికుల దృష్టి

ఈ జాతీయ పతాకాన్ని మాజీ ఎంపి నవీన్ జిందాల్ భారత సైన్యానికి బహూకరించారు. 2014లో ఫ్లాగ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాను ఆయన స్థాపించారు. ఇది మన జాతీయ పతాకం.. దీన్ని గౌరవించడం మన బాధ్యత అని ఆయన చెప్పారు.

సైన్యం గౌరవార్థం

సైన్యం గౌరవార్థం

వార్ మెమోరియల్ ఎందరో యువకులు భారత సైన్యంలో చేరేందుకు, వారి దేశభక్తిని చాటుకునేందుకు స్ఫూర్తిని అందిస్తోంది.

కార్గిల్ వార్ మెమోరియల్

కార్గిల్ వార్ మెమోరియల్

కార్గిల్ యుద్ధం జరిగి నేటికీ 15ఏళ్లు అవుతున్న సందర్భంగా జులై 26న కార్గిల్ విజయ్ దివాస్‌ను ఘనంగా జరుపనున్నారు. అమరులైన సైనికులకు ఘన నివాళులను అర్పించనున్నారు.

జులై 5 తర్వాత శ్రీనగర్ తూర్పు ప్రాంతమైన ద్రాస్‌ భారత సైన్యం ఆధీనంలోకి వచ్చింది. కాగా, అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌తో సమావేశమైన అనంతరం పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తమ సైన్యాన్ని వెనక్కి రావాల్సిందిగా ఆదేశించాడు.

అనంతరం జులై 26న భారత ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పాయి ఆపరేషన్ విజయ్(కార్గిల్ యుద్ధం) విజయవంతమైందని ప్రకటించారు. పాకిస్థాన్ దళాలు మనదేశంలో ఆక్రమించిన ప్రాంతాల నుంచి వెనుదిరిగాయని సైన్యాధికారులు వెల్లడించారు.

ఆనాటి నుంచి ప్రతీ సంవత్సరం జులైలో కార్గిల్, ద్రాస్, జమ్మూకాశ్మీర్ ప్రజలు యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన 527 మంది భారత సైనికులకు ఘన నివాళులర్పిస్తున్నారు.

English summary
As India is all set to mark the 15th anniversary of the Kargil Victory Day (Kargil Vijay Diwas) on July 26, Saturday, it is also a moment full of pride and pain for the all the Indian soldiers as they fought bravely and laid down their lives to safeguard our motherland in 1999.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X