వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్గిల్ విజయ్ దివస్: మోడీ, నిర్మలా సీతారామన్, సుష్మా స్వరాజ్ నివాళి

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఢిల్లీలోని అమర్ జవాన్ జ్యోతి వద్ద రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్, నేవీ చీఫ్ సునీల్ లంబా, ఎయిర్ మార్షల్ చీఫ్ బీరేందర్ సింగ్ తదితరులు నివాళులు అర్పించారు.

Recommended Video

కార్గిల్ వార్ వెనుక కారణాలు తెలిస్తే పాకిస్తాన్ ను ఛీ అనకుండా ఉండలేరు

ద్రాస్‌లోని స్మారక స్థూపం వద్ద కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు నార్తర్నల్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ రణ్‌బీర్ సింగ్ నివాళులు అర్పించారు. ద్రాస్‌లోని స్మారకం వద్ద సాధారణ పౌరులు కూడా నివాళి అర్పించారు.

Kargil Vijay Diwas: Atal Ji led from the front and supported our armed forces, says PM Modi

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మన దేశం కోసం కన్నుమూసిన మన హీరోలు (సైనికులు)కు సెల్యూట్ అని కేంద్రవిదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు.

ఆపరేషన్ విజయ్ సందర్భంగా దేశం కోసం పోరాడిన వారందరికీ ఈ దేశం నివాళులు అర్పిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. మన దేశంలో ప్రశాంతతను చెడగొట్టేందుకు ప్రయత్నించిన మూకల కుటిల ప్రయత్నానికి మన ధైర్యవంతులైన మన సైనికులు సరైన జవాబు ఇచ్చారని పేర్కొన్నారు. వారి సాహసం వల్లే దేశం రక్షించబడిందన్నారు.

ఆపరేషన్ విజయ్ సమయంలో అటల్ బిహారీ వాజపేయి రాజకీయంగా అద్భుతంగా నేతృత్వం వహించారని కితాబిచ్చారు. రాజకీయంగా అతను ముందుండి, మన సైన్యానికి మద్దతు పలికారన్నారు.

English summary
'On #KargilVijayDiwas, a grateful nation pays homage to all those who served the nation during Operation Vijay. Our brave soldiers ensured that India remains protected and gave a befitting answer to those who tried to vitiate the atmosphere of peace, tweets PM Modi.'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X