వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Kargil Vijay Diwas: పాక్ నడ్డి విరిచిన రోజు ఇది.. గొర్రెల కాపరుల సాయంతో.. ఒళ్లు గగుర్పొడిచే వీడియోలు

|
Google Oneindia TeluguNews

''కార్గిల్ విజయం మన దేశ ఆత్మగౌరవాన్ని చిహ్నంగా మాత్రమే కాదు.. అన్యాయాన్ని నిరోధించిన చర్య కూడా. జాతీయ భద్రత పరిధిలో మనం ఏది చేసినా ఆత్మరక్షణే అవుతుంది తప్ప దాన్ని దాడి గానో, యుద్ధంగానో చూడొద్దు..'' అని నాటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజపేయి సెలవిచ్చిన మాటల్ని ప్రస్తుత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గుర్తుచేశారు. 1999, జులై 26.. నేటికి సరిగ్గా 21 ఏళ్ల కిందట కార్గిల్ కొండల్లో పాకిస్తాన్ సైన్యాలను భారత బలగాలు తరిమికొట్టిన రోజు ఇది. ఆ విజయానికి గుర్తుగా భారత్ ఏటా 'కార్గిల్ విజయ్ దివస్' జరుపుకొంటున్నది. నాటి యుద్ధం భారత ప్రతిష్టను మరింత పెచిందేకాకుండా, అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ను ఏకాకి చేయడానికి ఉపకరించింది.

కిమ్ జాంగ్ కు మోదీ సర్కార్ భారీ సాయం - కష్టకాలంలో ఉత్తరకొరియాకు ఆపన్నహస్తం - చైనా చైన్ తెగడంతో..కిమ్ జాంగ్ కు మోదీ సర్కార్ భారీ సాయం - కష్టకాలంలో ఉత్తరకొరియాకు ఆపన్నహస్తం - చైనా చైన్ తెగడంతో..

1999 మే నెలలో పాక్ సైన్యాలు.. టెర్రరిస్టుల మాదిరిగా ఎల్వోసీని దాటి జమ్మూకాశ్మీర్ లోని కార్గిల్ పర్వతాలపైకి చేరారు. సముద్ర మట్టానికి 18 వేల అడుగుల ఎత్తులో ఉండే కార్గిల్ పర్వతాల్లో నక్కి దాడి చేయడం ద్వారా ఇండియాను దెబ్బకొట్టొచ్చన్నది వారి పథకం. అయితే, పాక్ సైనికుల కదలికల్ని పసిగట్టిన కొందరు గొర్రెల కాపరులు ఆ సమాచారాన్ని సైన్యానికి చేరవేయడంతో సీన్ రివర్స్ అయింది. ఇటీవల ప్రధాని మోదీ.. చైనా సరిహద్దులోని లేహ్ ను సందర్శించిన సమయంలో ''గొర్రెల కాపరుల సాయంతోనూ యుద్ధాలు గెలిచిన చరిత్ర భారత్ కు ఉంది'' అంటూ డ్రాగన్ కు వార్నింగ్ వెనుక మతలబు ఇదే.

Kargil Vijay Diwas: Day to mark India’s victory in 1999 war against Pakistan

గొర్రెలకాపరులు ఇచ్చిన సమాచారంతో అలెర్టైన మన సైన్యం.. ముందుగా పెట్రోలింగ్ టీమ్ లను పంపి, సిట్యువేషన్ ఖరారు చేసుకున్నాక, ఎదురుదాడి ప్రారంభించింది. ఆర్మీకి తోడుగా ఎయిర్ ఫోర్స్, నేవీ సైతం రంగంలోకి దిగాయి. ఎల్వోసీ దాటకుండానే మన యుద్ధవిమానాలు.. పాక్ సైన్యాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఆ ఏడాది జూన్ 13న తొలాలింగ్ పీక్ ను మనవాళ్లు తిరిగి స్వాధీనం చేసుకోవడం నాటి యుద్ధంలో టర్నింగ్ పాయింట్.

Kargil Vijay Diwas: Day to mark India’s victory in 1999 war against Pakistan

పాకిస్తాన్ దాదాపు చతికిలపడే సమయానికి అప్పటి ప్రధాని నవాజ్ షరీప్ పై ప్రపంచ దేశాలన్నీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆంక్షల విధింపునకు హెచ్చరికలు జారీచేశాయి. ఆ సమయంలో ఐక్యరాజ్యసమితి, అమెరికాతోపాటు చైనా కూడా భారత్ కు అండగా నిలబడటంతో పాక్ ఏకాకిగా మారిపోయింది. మొత్తంగా రెండు నెలలపాటు సాగిన సాయుధ పోరులో చివరికి పాక్ మట్టికరిచింది. భారత్ అవకాశం కల్పించినప్పటికీ.. కనీసం తన సైనికుల శవాలను కూడా తీసుకెళ్లకుండా పాక్ అమానవీయంగా ప్రవర్తించింది. నాటి యుద్ధంలో మనవైపు 527 మంది జవాన్లు అమరులుకాగా, పాకిస్తాన్ వైపు దాదాపు 1000 మంది హతమయ్యాయి. అయితే పాక్ మాత్రం 357 మందే చనిపోయినట్లు చెప్పుకుంటుంది. జులై 26 నాటికి కార్గిల్ పర్వతాలన్నీ మన ఆధీనంలోకి రావడంతో ఆ తర్వాతి ఏటి నుంచి జులై 26ను 'కార్గిల్ విజయ్ దివస్'గా జరుపుకొంటున్నాం.

కార్గిల్ విజయ్ దివాస్ మన సాయుధ దళాల సంకల్పానికి, అసాధారణ శౌర్యానికి ప్రతీక అని, మాతృభూమిని రక్షించడానికి శత్రువులతో పోరాడి ప్రాణాలు అర్పించిన సైనికులకు వందనాలని, కుటుంబాలకు ఈ దేశం ఎప్పటికీ కృతజ్ఞతలు తెలుపుతుందని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తన సందేశంలో అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ ను తల్చుకుంటే, మన సాయుధ బలగాల ధైర్యసాహసాలు, సంకల్పం గుర్తుకొస్తాయని, అవి తరతరాలకూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలు రూపొందించిన ప్రత్యేక వీడియోలు నెట్టింట్ వైరల్ అయ్యాయి.

Recommended Video

India Extends Medical Support Of $1 mn To North Korea | కష్టకాలంలో ఉత్తరకొరియాకు ఆపన్నహస్తం !!

English summary
India is observing Kargil Vijay Diwas on Sunday (july 26th) to commemorate its victory over Pakistan in the high-altitude conflict in Jammu and Kashmir’s Kargil district and along the Line of Control (LoC) and pay tributes to soldiers who lost their lives more than two decades ago.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X