వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: కార్గిల్ యుద్ధంలో చావు తప్పించుకున్న షరీఫ్, ముషారఫ్!

కార్గిల్ యుద్ధానికి సంబంధించి ఓ ఆశ్చర్యకరమైన వార్త వెలుగుచూసింది. పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌, ఆర్మీ మాజీ చీఫ్‌ జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ కార్గిల్‌ యుద్ధంలో త్రుటిలో చావు తప్పించుకొన్నారట.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కార్గిల్ యుద్ధానికి సంబంధించి ఓ ఆశ్చర్యకరమైన వార్త వెలుగుచూసింది.
పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌, ఆర్మీ మాజీ చీఫ్‌ జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ కార్గిల్‌ యుద్ధంలో త్రుటిలో చావు తప్పించుకొన్నారట. భారత వాయుసేన విమానం 'జాగ్వార్‌' 1999 జూన్‌ 24న పాక్‌ సైనిక స్థావరమైన గుల్తెరిపై ఉదయం 8.45 గంటలకు గురి పెట్టింది.

అయితే ఆ దాడిలో షరీఫ్, ముషారఫ్‌లు తప్పించుకున్నట్టు సమాచారం. గుల్తెరి సైనిక స్థావరంపై భారత విమానం బాంబు జారవిడవాల్సి ఉంది. అయితే, అక్కడ షరీఫ్‌, ముషారఫ్‌ ఉండటంతో బాంబు వేయొద్దని ఎయిర్‌ కమాండెంట్‌.. విమానంలోని పైలట్‌కు సూచించారట.

 Kargil war: When an IAF Jaguar had Sharif, Musharraf in its crosshairs

ఆ తర్వాత దాన్ని భారత నియంత్రణ రేఖకు సమీపంలో జారవిడిచారు. దీంతో షరీఫ్‌, ముషారఫ్‌ చావు తప్పించుకొన్నారు. గుల్తెరి పాక్‌ సైన్యం ప్రధాన స్థావరాల్లో ఒకటి. కార్గిల్‌ యుద్ధ సమయంలో సైనికులకు ఆహార, మందుగుండు, ఇతర సామగ్రిని ఇక్కడి
నుంచే సరఫరా చేసేవారు.

కాగా షరీఫ్, ముషారఫ్ ఇద్దరూ ఆ రోజే తొలిసారి షక్మా సెక్టార్‌లోని నియంత్రణ రేఖ పొడవునా పర్యటించారు. ఒక వేళ ఎయిర్ కమాండెంట్ ఆపకపోతే.. భారత సైన్యం బాంబు దాడిలో షరీఫ్, ముషారఫ్ ప్రాణాలు వదిలేవారు.

English summary
Around 8.45 am on Thursday, June 24, 1999, at the height of the Kargil War, an Indian Air Force Jaguar flying close to the Line of Control “lased over” — that is, acquired for bombing using its laser-guided system — a forward base of the Pakistan army.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X