వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆపరేషన్ కమల రూ. 30 కోట్లు ఆఫర్, నిజం కాదు అంటున్న జేడీఎస్ ఎమ్మెల్యే, ఏసీబీ విచారణలో!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఆపరేషన్ కమలలో భాగంగా బీజేపీ నాయకులు తనకు రూ. 30 కోట్లు ఇచ్చారనే మాట అపద్దం అని కోలారు శాసన సభ నియోజక వర్గం జేడీఎస్ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ అన్నారు. అవినీతి నిరోదక దళం (ఏసీబీ) ముందు విచారణకు హాజరైన జేడీఎస్ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. బీజేపీ నాయకులు తనకు నగదు ఇచ్చారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని జేడీఎస్ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ అన్నారు.

పంతం నెగ్గించుకున్న బళ్లారి శ్రీరాములు, కాంగ్రెస్ మంత్రి బంధువుకు బీజేపీ ఎంపీ టిక్కెట్!పంతం నెగ్గించుకున్న బళ్లారి శ్రీరాములు, కాంగ్రెస్ మంత్రి బంధువుకు బీజేపీ ఎంపీ టిక్కెట్!

అపద్దం చెప్పాను !

అపద్దం చెప్పాను !

కర్ణాటకలోని కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి బీజేపీ నాయకులు ఆపరేషన్ కమలలో భాగంగా తన పదవికి రాజీనామా చేస్తే రూ. 30 కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చారని తాను మీడియా ముందు అపద్దం చెప్పానని ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ తప్పు ఒప్పుకున్నారు.

మాట మార్చిన ఎమ్మెల్యే

మాట మార్చిన ఎమ్మెల్యే

తన ఇంటికి వచ్చిన బీజేపీ నాయకులు తాను బాత్ రూంకు వెళ్లిన వెంటనే రూ. 5 కోట్లు అక్కడ పెట్టి వెళ్లారని ఇటీవల జేడీఎస్ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ అన్నారు. అయితే గురువారం ఏసీబీ ముందు విచారణకు హాజరైన ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ రివర్స్ అయ్యి తనకు ఎవ్వరూ నగదు ఆశ చూపలేదని అన్నారు.

బీజేపీ నాయకులు

బీజేపీ నాయకులు

జేడీఎస్ ను వదిలి బీజేపీలో చేరాలని ఆ పార్టీ నాయకులు సీపీ. యోగేశ్వర్, శాసన సభ్యులు ఎస్ఆర్. విశ్వనాథ్, అశ్వథ్ నారాయణ తన మీద ఒత్తిడి చేశారని గత నెల జేడీఎస్ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ ఆరోపించారు. అయితే తాను బీజేపీ నాయకుల ఆఫర్ ను తిరస్కరించానని ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ అంటున్నారు.

ప్రభుత్వం సేఫ్

ఆపరేషన్ కమల భారి నుంచి సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడటానికి తాను అలా మీడియాతో మాట్లాడవలసి వచ్చిందని ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ అన్నారు. బీజేపీ నాయకులు తనకు రూ. 30 కోట్లు ఆఫర్ ఇచ్చారని, అడ్వాన్స్ గా రూ. 5 కోట్లు ఇచ్చారని, మిగిలిన రూ. 25 కోట్లు జేడీఎస్ పార్టీకి రాజీనామా చేసిన తరువాత ఇస్తారని వారి మీద ఆరోపణలు చెయ్యడంతో ఆపరేషన్ కమలకు బ్రేక్ పడిందని శ్రీనివాసగౌడ అన్నారు.

ఫిర్యాదు చేసిన కార్యకర్తలు

ఫిర్యాదు చేసిన కార్యకర్తలు

తనకు బీజేపీ నాయకులు రూ. 30 ఆఫర్ ఇచ్చారని ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ స్వయంగా మీడియా ముందు చెప్పారని, బీజేపీ నాయకుల మీద చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త టీజే. అబ్రహాం, హనుమేగౌడ, ప్రశాంత్, కర్ణాటక అవినీతి నిరోదక దళం (ఏసీబీ) కి ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు అయ్యింది. బీజేపీ నాయకులు మీకు నగదు ఆఫర్ ఇచ్చారా ? అనే వియంలో విచారణకు హాజరు అయ్యి వివరణ ఇవ్వాలని ఏసీబీ అధికారులు సూచించడంతో జేడీఎస్ ఎమ్మెల్యే విచారణకు హాజరైనారు.

English summary
Kolar JDS MLA K Srinivasa Gowda accepted on before ACB that he was lied against BJP leaders as they offered him Rs 30 crore for Operation Kamala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X