వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గవర్నర్ తో సీఎం ఆకస్మిక భేటీ: ఏం జరుగుతోందని చర్చలు, ప్రభుత్వం, మంత్రి వర్గ విస్తరణ!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ఒక్కసారిగా ఆ రాష్ట్ర గవర్నర్ వాజుబాయ్ వాలాతో భేటీ అయ్యారు. గవర్నర్ వాజుబాయ్ వాలా, సీఎం కుమారస్వామి భేటీ కావడంతో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్రస్థాయిలో చర్చ మొదలైయ్యింది.

సీఎం కుమారస్వామి ఆకస్మికంగా ఎందుకు గవర్నర్ తో భేటీ అయ్యారు అంటూ కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల నాయకులు వారికి తోచినట్లు వారు చర్చించుకుంటున్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో సీఎం కుమారస్వామి ఏమైనా సంచలన నిర్ణయం తీసుకున్నారా ? అంటు చర్చ మొదలైయ్యింది.

Karnatak CM HD Kumaraswamy met Karnataka governor Vajubhai Vala

అంతే కాకుండా మీడియా మీద చాల అసహనంతో ఉన్న సీఎం కుమారస్వామి వారికి కళ్లేం వెయ్యాలని గవర్నర్ వాజుబాయ్ వాలాకు మనవి చేస్తారా ? అంటూ చర్చ జరుగుతోంది. కర్ణాటకలో మంత్రి వర్గ విస్తరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్త మంత్రి వర్గ విస్తరణ విషయంలో సీఎం కుమారస్వామి, గవర్నర్ చర్చలు జరిపారా అనే విషయం కచ్చితంగా తెలియడం లేదు.

మొత్తం మీద సీఎం కుమారస్వామి గవర్నర్ తో భేటీ కావడంతో వివిధ రకాలుగా చర్చలు మొదలైనాయి. కర్ణాటకలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను బీజేపీ నాయకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎలాంటి అవకాశం చిక్కినా సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ నాయకులు వేచి చూస్తున్నారు.

English summary
Karnatak CM HD Kumaraswamy met Karnataka governor Vajubhai Vala today. Kumaraswmy ask time of governor to cabinet expansion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X