బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాలి పెళ్లి అంటే మాటలా: కష్టాలు మాయం(ఫోటోలు)

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మైనింగ్ సామ్రాట్ గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె పెళ్లిని సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చేసినట్లు కళ్లకు కట్టినట్లు అతిథులకు చూపించారు. ఏడుకోండల స్వామి అంటే గాలి జనార్దన్ రెడ్డికి ఎంతో భక్తి. ఏపనైనా సరే కలియుగ శ్రీ వెంకటేశ్వరస్వామిని తలుచుకునే ఆయన తన పని మొదలు పెడుతారని గాలి జనార్దన్ రెడ్డి సన్నిహితులు అంటుంటారు.

తిరుమల తిరుపతి దేవాస్థానంలాగానే కల్యాణ మండపం సెట్టింగ్స్ వేయించారు. నిలువెత్తున శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం తయారు చేయించారు. బుధవారం ఉదయం 6.16 గంటల సమయంలో 'ధారా ముహుర్తం'లో పెళ్లి పనులు మొదలుపెట్టారు. వైష్ణవ, శైవ సాంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు చేయించారు.

గాలి అంటే మాటలా

గాలి అంటే మాటలా

దక్షిణ భారతదేశంలోని సినీరంగాలకు చెందిన ప్రముఖులు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడుకు చెందిన రాజకీయ ప్రముఖులు గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె గాలి బ్రహ్మిణి పెళ్లికి హాజరైనారు.

 వధూవరుల డ్యాన్స్ అదుర్స్

వధూవరుల డ్యాన్స్ అదుర్స్

రాజీవ్ రెడ్డి, గాలి బ్రహ్మిణి జంట పెళ్లి సందర్బంగా ఏర్పాటు చేసిన మ్యూజికల్ నైట్ లో డ్యాన్స్ లు ఇరగదీశారు. వారు స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తుంటే గాలి జనార్దన్ రెడ్డి, విక్రమ్ దేవ్ రెడ్డి కుటుంబ సభ్యలుతో పాటు పెళ్లికి వచ్చిన అతిథులు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

సాధు కోకిల మ్యూజిక్

సాధు కోకిల మ్యూజిక్

కన్నడ సినీరంగంలో సంగీత దర్శకుడిగా సత్తా చాటిన సాధుకోకిల ఆధ్వర్యంలోప్రసిద్ధి చెందిన సింగర్స్ గాలి పెళ్లిలో అందరిని ఆటాపాటలతో అలరించారు. ఆ పాటలకు గాలి కుటుంబ సభ్యులు, బంధువులు డ్యాన్స్ చేశారు.

ప్రత్యేక హెలికాప్టర్ల్ లో

ప్రత్యేక హెలికాప్టర్ల్ లో

పంచపీఠాల్లో ఒకటైన ఉజ్జయిని పీఠాధిపతి శ్రీ సిద్దలింగ దేశీకేంద్ర శివాచార్య స్వామీజి ప్రత్యేక హెలికాప్టర్ లో బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్స్ చేరుకుని గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రహ్మిణి, రాజీవ్ రెడ్డి దంపతులను ఆశిర్వదించారు.

తిరుమల నుంచి అర్చకులు

తిరుమల నుంచి అర్చకులు

తిరుమల నుంచి ఏనిమిది మంది అర్చకులు బెంగళూరు వచ్చి గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రహ్మిణి, రాజీవ్ రెడ్డిల వివాహం వైష్ణవ, శైవ సాంప్రధాయం ప్రకారం చేశారు. తిరుమల అర్చకులే గాలి కుమార్తె కంకణ భాగ్యానికి సాక్షులు అయ్యారు.

అక్కడి నుంచి ఇక్కడి వచ్చాను

అక్కడి నుంచి ఇక్కడి వచ్చాను

నేను ఎంతోకష్టపడి పైకి వచ్చాను. అనుకున్నట్లే నా కుమార్తె వివాహం చేశాను. నా కుమార్తె పెళ్లి చెయ్యడం నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. నా స్నేహితులు, అభిమానులు, శ్రేయోభిలాషులు నాకు అండగా ఉన్నారని గాలి జనార్దన్ రెడ్డి అతిథులను ఉద్దేశించి మాట్లాడారు.

 విమర్శలు మార్గదర్శకాలు: గాలి

విమర్శలు మార్గదర్శకాలు: గాలి

నా కుమార్తె పెళ్లి విషయంలో కొందరు కావాలనే విమర్శలు గుప్పించారు. అయినా నాకు ఎలాంటి భాదలేదు. వారి విమర్శలను నేను సలహాలు, మార్గదర్శకాలుగా తీసుకుని నా కుమార్తె పెళ్లి చేశానని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.

గతంలో అన్ని ఇలానే చేశాను కదా

గతంలో అన్ని ఇలానే చేశాను కదా

గాలి ఎలాంటి కార్యక్రమాలు చేసినా వైభవంగానే చేశారు. గతంలోనూ నేను ఎన్నో కార్యక్రమాలు వైభవంగానే చేశాను. అయితే నా కుమార్తె పెళ్లి వేడుకలు 9 రోజుల పాటు జరగడంతో తాను గతంలో అనుభవించిన అన్ని కష్టాలు మరిచిపోయానని గాలి జనార్దన్ రెడ్డి ఆయన అభిమానుల ఉద్దేశించి అన్నారు.

90 వేల మందికి భోజనాలు

90 వేల మందికి భోజనాలు

గాలి కుమార్తె బ్రహ్మిణి వివాహానికి హాజరైన దాదాపు 90 వేల మందికి భోజనాలు సరిపడేలా చేశారు. ఆంధ్రా వంటకాలతో పాటు ఉత్తర కర్ణాటక వంటకాలు పెళ్లిలో వడ్డించారు.

 చెట్లను పెంచండి, పరిసరాలు కాపాడండి

చెట్లను పెంచండి, పరిసరాలు కాపాడండి

మొక్కలు, చెట్లు పెంచడం వలన పరిసర ప్రాంతాలను పచ్చదనంతో కాపాడవచ్చని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. పెళ్లికి వచ్చిన అతిథులకు లక్ష్మి తులసి, శ్రీగంధం మొక్తలు, లడ్డులు ఉన్న బ్యాగులు ఆయన అందజేశారు.

English summary
The big fat wedding is over. Many prominent faces were seen at the gali Janardhan Reddy’s celebrations spreasd over 5 days in Bengaluru's palace grounds.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X