బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Bengaluru: ఐటీ హబ్, కర్ణాటక హడల్, 34 % పెరిగిన కరోనా కేసులు, గుడ్ మార్నింగ్ చెప్పిన వైరస్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరు సిటీతో పాటు కర్ణాటకలో ఒక్కసారిగా 34 శాతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోవడంతో అక్కడి ప్రభుత్వంతో పాటు సామాన్య ప్రజలు హడలిపోతున్నారు. కేరళతో పాటు తమిళనాడులో, కర్ణాటకలో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోయింది. ఐటీ హబ్ లో కూడా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో బెంగళూరు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రద్దీగా ఉండే మార్కెట్లు కరోనా వైరస్ కు హాట్ స్పాట్ లు అవుతున్నాయని అధికారులు అంటున్నారు. ఒక్కరోజులో 34 శాతం కేసులు పెరిగిపోవడంతో ప్రజలకు కరోనా వైరస్ గుడ్ మార్నింగ్ తో పలకరించింది.

Khiladi wife: కెనడాలో కత్తిలాంటి భార్య, ఇక్కడ భర్త, మామకు పంగనామాలు, స్వాహా, చివరికి !Khiladi wife: కెనడాలో కత్తిలాంటి భార్య, ఇక్కడ భర్త, మామకు పంగనామాలు, స్వాహా, చివరికి !

 34శాతం పెరిగిన పాజిటివ్ కేసులు

34శాతం పెరిగిన పాజిటివ్ కేసులు

కర్ణాటకలో బుధవారంతో పాల్చుకుంటే గురువారం రోజు 34 శాతం ఎక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కర్ణాటకలో గత 24 గంటల్లో 2, 052 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని వైద్యశాఖ అధికారులు చెప్పారు. బుధవారం రోజు కర్ణాటకలో 1, 531 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

 ఐటీ హబ్ లో సేమ్ సీన్

ఐటీ హబ్ లో సేమ్ సీన్

ఐటీ హబ్ బెంగళూరు సిటీలో ఒక్కరోజులో 505 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. బెంగళూరు సిటీలో రద్దీగా ఉండే మార్కెట్లు కరోనా వైరస్ కు హాట్ స్పాట్ లు అవుతున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో ఇప్పటి వరకు 23, 253 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య శాఖ అధికారులు తెలిపారు.

 29 లక్షలు దాటిపోయింది

29 లక్షలు దాటిపోయింది

కర్ణాటకలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 29 లక్షల మార్క్ దాటిపోయింది. గత 24 గంటల్లో కరోనా పాజిటివ్ తో చికిత్స విఫలమై 35 మంది మరణించారని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కర్ణాటకలో ఇప్పటి వరకు కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో 36, 491 మంది చనిపోయారని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

Recommended Video

Bengaluru Emerges As World’s Fastest Growing Tech Hub || Oneindia Telugu
 సినిమా థియేటర్లు, స్కూల్స్, కాలేజ్ లు ఓపెన్

సినిమా థియేటర్లు, స్కూల్స్, కాలేజ్ లు ఓపెన్

కర్ణాటకలో మూడు నెలల సంపూర్ణ లాక్ డౌన్ తరువాత సినిమా థియేటర్లు తెరవడానికి కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇంతకాలం ఆన్ లైన్ క్లాసుల్లో చదువుకున్న విద్యార్థులు పాఠశాలకు, కాలేజ్ లకు వెళ్లడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటి వరకు కర్ణాటకలో 2, 97, 01, 032 మందికి కోవిడ్ టీకాలు వేశారు. గురువారం మాత్రం 1, 00, 224 మందికి కోవిడ్ టీకాలు వేశామని వైద్యశాఖ అధికారులు తెలిపారు.

English summary
IT Hub: Karnataka and capital Bengaluru today recorded a steep spike in Covid cases. The state reported 2,052 new cases today, 34 per cent more than Wednesday's tally of 1,531. The capital city clocked 505 cases, also 34 per cent more than Wednesday's count of 376.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X