వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళనాడుకు నీరు విడుదల చేయండి : కర్ణాటకకు కావేరి అథారిటీ ఆదేశం

|
Google Oneindia TeluguNews

బెంగళూరు : మంచినీటి కటకటతో తమిళనాడు హోరెత్తుతుంది. చెన్నై, కోయంబత్తూరులో నీటి సమస్య ఎక్కువగా ఉంది. దీంతో విపక్షాలు, ప్రజాసంఘాలు ఆందోళనకు దిగాయి. దీంతో కావేరి వాటర్ మేనెజ్‌మెంట్ అథారిటి స్పందించింది. తమిళనాడుకు నీరు విడుదల చేయలని కర్ణాటక రాష్ట్రాన్ని ఆదేశించింది. పుదుచ్చేరికి విడుదల చేసే నీటితో .. ఆ రెండు రాష్ట్రాలకు సర్దుబాటు చేయాలని స్పష్టంచేసింది.

నీటి కట కట ..
కర్ణాటక-తమిళనాడు మధ్య కావేరి నదిజలాల సమస్య ఉన్న సంగతి తెలిసిందే. అయితే తమిళనాడు మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న వేళ కావేరి వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ రంగంలోకి దిగింది. చైర్మన్ మసూద్ హుస్సేన్ అధ్యక్షతన సమావేశమై .. పరిస్థితిని సమీక్షించింది. కర్ణాటక విడుదల చేయాల్సిన నీటిపై క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే తమిళనాడు మంచినీటి కొరతతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ... వాటర్ బోర్డు సమావేశమై ప్రస్తుత పరిస్థితిని చర్చించింది. తర్వాత నీరు విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.

Karnataka asked to release Cauvery water for June, July to Tamil nadu

విడుదల చేయండి
తమిళనాడులో నీటి సమస్య ఉన్న నేపథ్యంలో .. వాస్తవానికి వారికి ఇవ్వాల్సిన నీటిని ఇవ్వాలని అథారిటీ స్పష్టంచేసింది. జూన్ నెలకు 9.19 టీఎంసీల నీరు, జూలైకి సంబంధించి 31.24 టీఎంసీల నీరు విడుదల చేయాలని స్పష్టంచేసింది. అయితే ఇది నెలవారీగా విడుదల చేయాల్సిన నీరని .. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ట్రిబ్యునల్ చెప్పిన అంశాల ఆధారంగా నీటి కేటాయింపులు చేసినట్టు హుస్సేన్ పేర్కొన్నారు. అయితే కావేరి జలాల నుంచి పుదుచ్చేరికి విడుదలచేయాల్సిన నీటిలో .. తమిళనాడుకు కూడా సర్దుబాటు చేసినట్టు వెల్లడించారు. అంతేకాదు కావేరి నదీలో ఉన్న నీటిని కూడా అథారిటీ సమీక్షిస్తుందని ఆయన తెలిపారు. ఒకవేళ వర్షాలు తక్కువగా ఉంటే పరిస్థితి ఏంటనే అంశం గురించి కూడా చర్చిస్తున్నామని తెలిపారు. వాస్తవానికి నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమవడంతో వర్షాలు ఆలస్యంగా కురుస్తోన్న సంగతి తెలిసిందే.

English summary
The Cauvery Water Management Authority on Tuesday directed Karnataka to release 9.19 tmc feet of water for june and 31.24 tmc feet of water for july to tamil nadu as per the monthly schedule finalised by the water tribunal and modified by the supreme court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X