వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్ వచ్చినా ఏంకాదు, నా వద్ద కౌంటర్లు సిద్ధం: నటుడు సాయి కుమార్

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రముఖ నటుడు సాయి కుమార్ కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన బాగేపల్లి నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎక్కువ మంది తెలుగు మాట్లాడుతారు. బాగేపల్లిలో కులప్రాబల్యం ఎక్కువ అంటుంటారు. పార్టీతో సంబంధం లేకుండా సామాజిక కోణంలో ఓట్లు ఎక్కువగా పడతాయంటున్నారు.

మూసివేత దిశగా గాలి జనార్ధన్ రెడ్డి మైనింగ్ కేసులు?మూసివేత దిశగా గాలి జనార్ధన్ రెడ్డి మైనింగ్ కేసులు?

బాగేపల్లిలో బీజేపీ - కాంగ్రెస్ - జేడీఎస్ - సీపీఎంల మధ్య పోటీ ఉంది. బీజేపీ తరఫున సాయి కుమార్ ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు. కాంగ్రెస్ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే సుబ్బారెడ్డి, సీపీఎం నుంచి శ్రీరాం రెడ్డి, జేడీఎస్ నుంచి నిర్మాత మనోహర్ బరిలో నిలిచారు. మార్పుపై ఆశలు పెట్టుకొని నటుడు సాయి కుమార్ సాగుతున్నారు.

పవన్ కళ్యాణ్ ప్రచారంపై సాయి కుమార్ స్పందన

పవన్ కళ్యాణ్ ప్రచారంపై సాయి కుమార్ స్పందన

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారని తొలుత వార్తలు వచ్చాయి. జేడీఎస్ అధినేత కుమార స్వామి కూడా పవన్ తమ తరఫున ప్రచారం చేస్తారని వెల్లడించారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా పవన్ ప్రచారం నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది. అయితే పవన్ ప్రచారానికి వస్తారనే అంశంపై సాయి కుమార్ స్పందించారు.

పవన్ కళ్యాణ్‌కు నా వద్ద కౌంటర్లు

పవన్ కళ్యాణ్‌కు నా వద్ద కౌంటర్లు

బాగేపల్లి నియోజకవర్గం నుంచి తన గెలుపు ఖాయమని సాయి కుమార్ అన్నారు. పవన్ కళ్యాణ్ వచ్చి ప్రచారం చేసినా

ఆయనకు ఇచ్చేందుకు తన వద్ద కౌంటర్లు సిద్ధంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. తెలుగువారు అధికంగా ఉండే బాగేపల్లి నియోజకవర్గంలో బీజేపీ ఘన విజయం సాధిస్తుందన్నారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. బాగేపల్లిలో మైనార్టీలు కూడా బీజేపీకే ఓటేస్తారన్నారు.

 ఏ ఓటర్లు ఎంతమంది అంటే?

ఏ ఓటర్లు ఎంతమంది అంటే?

ఇదిలా ఉండగా, బాగేపల్లిలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు కులపరమైన ఓటర్లపై ఆశలు పెట్టుకోగా, సీపీఎం సంప్రదాయ ఓటర్లపై, బీజేపీ మార్పుపై ఆశలు పెట్టుకుందని అంటున్నారు. ఇక్కడ మొత్తం 1.92 లక్షలమంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 23 వేల మంది ముస్లింలు, 60 వేల మంది ఎస్సీ, ఎస్టీలు, రెడ్డి- గౌడలు 50 వేల మంది, బలిజలు 40 వేల మంది ఉన్నారు. ఇతర సామాజిక వర్గాల ఓటర్లు 22 వేల మంది దాకా ఉన్నారు.

ఇక్కడ గెలుపెవరిదో?

ఇక్కడ గెలుపెవరిదో?

సాయికుమార్‌ 2008 ఎన్నికల్లో 26 వేల ఓట్లు సాధించారు. అప్పటి ఓట్లను కాపాడుకుంటూ ప్రస్తుతం తటస్థ, కొత్త ఓటర్లపై దృష్టి సారిస్తున్నారు. ఇక్కడి నుంచి గెలుపుపై తెలుగు ఓటర్లలోను ఆసక్తి నెలకొని ఉంది.

English summary
Actor and Bharatiya Janata Party leader Sai Kumar said that I will win from Bagepalli.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X