వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరుణ ఫైట్ ఓ రాయల్ ఛాలెంజ్!!: సీఎం, మాజీ సీఎం తనయుల మధ్యే పోరు?

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: వరుణ అసెంబ్లీ నియోజకవర్గం మైసూర్ ప్యాలెస్ సిటీ శివారుల్లో నెలకొన్నది. కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తమ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇది కూడా ఒకటి. ఈ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా సీఎం సిద్దరామయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు.2008లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యస్థీకరణ తర్వాతే వరుణ అసెంబ్లీ స్థానం ఆవిర్భవించింది.
1983 నుంచి 2008 వరకు ఏడు సార్లు చాముండేశ్వరి స్థానం నుంచి సిద్దరామయ్య పోటీ చేశారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహాత్మక కారణాలతో పొరుగున ఉన్న వరుణ స్థానానికి బదిలీ అయ్యారు.

వరుణ నుంచి యతీంద్ర పోటీ రంగం సిద్ధంతాజాగా వచ్చేనెలలో జరుగనున్న ఎన్నికల్లో వరుణ స్థానం నుంచి తనయుడు యతీంద్రను బరిలోకి దించి.. తిరిగి తన కంచుకోట చాముండేశ్వరి స్థానం నుంచే పోటీ చేయాలని సిద్దరామయ్య తలపోస్తున్నారు. ఈ మేరకు యతీంద్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని సిద్దరామయ్య అధికారికంగా ప్రకటించారు. సెమీ అర్బన్ స్థానమైన 'వరుణ' అసెంబ్లీ సెగ్మెంట్ ఈ దఫా 'రాయల్ బాటిల్'కు సాక్షీభూతం కానున్నదా? అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. సిద్దరామయ్య తనయుడు యతీంద్రపై బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్ యెడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర పోటీ పడతారని భావిస్తున్నారు.

తాజాగా వచ్చేనెలలో జరుగనున్న ఎన్నికల్లో వరుణ స్థానం

తాజాగా వచ్చేనెలలో జరుగనున్న ఎన్నికల్లో వరుణ స్థానం

నుంచి తనయుడు యతీంద్రను బరిలోకి దించి.. తిరిగి తన కంచుకోట చాముండేశ్వరి స్థానం నుంచే పోటీ చేయాలని సిద్దరామయ్య తలపోస్తున్నారు. ఈ మేరకు యతీంద్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని సిద్దరామయ్య అధికారికంగా ప్రకటించారు. సెమీ అర్బన్ స్థానమైన ‘వరుణ' అసెంబ్లీ సెగ్మెంట్ ఈ దఫా ‘రాయల్ బాటిల్'కు సాక్షీభూతం కానున్నదా? అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. సిద్దరామయ్య తనయుడు యతీంద్రపై బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్ యెడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర పోటీ పడతారని భావిస్తున్నారు.

 మైసూర్‌లో మూడు, నాలుగు సార్లు మోదీ, అమిత్ షా పర్యటన

మైసూర్‌లో మూడు, నాలుగు సార్లు మోదీ, అమిత్ షా పర్యటన

ఇదిలా ఉంటే సిద్దరామయ్యకు కంచుకోటగా మారిన మైసూర్ ప్రాంతంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా చాలా కాలంగా ద్రుష్టి సారించారు. ఇప్పటికే అమిత్ షా మైసూర్ ప్రాంతాన్ని మూడు, నాలుగు సార్లు సందర్శించి రాజకీయ పరిస్థితుల్లో మార్పు తేవడానికి ప్రయత్నించారు. తద్వారా సొంత గడ్డపై సిద్దరామయ్యకు చుక్కలు చూపాలని నరేంద్రమోదీ, అమిత్ షా తలపోసినట్లు తెలుస్తోంది.

తండ్రి కోసం శిఖారిపుర స్థానాన్ని వదులుకున్న బీఎస్ రాఘవేంద్ర

తండ్రి కోసం శిఖారిపుర స్థానాన్ని వదులుకున్న బీఎస్ రాఘవేంద్ర

వరుణ స్థానం నుంచి యతీంద్రను బరిలోకి దింపనున్నట్లు సీఎం సిద్దరామయ్య ప్రకటించిన వెంటనే బీజేపీ కూడా శక్తిమంతమైన అభ్యర్థిని నిలిపి సిద్దరామయ్య సవాల్‌ను ఎదుర్కోవడానికి సిద్దమైనట్లు సమాచారం. దీని ప్రకారం బీఎస్ యెడ్యూరప్ప తనయులిద్దరిలో ఒకరు బీ వై రాఘవేంద్ర ఇప్పటికే శిమోగ జిల్లా శిఖారిపుర నుంచి ఎమ్మెల్యే. షిమోగా నుంచి పార్లమెంట్ స్థానానికి కూడా ప్రాతినిధ్యం వహించారు. సిద్దరామయ్య అసెంబ్లీకి ప్రాతినిధ్యం పోటీ చేసినప్పటి నుంచి రాఘవేంద్ర పక్కకు తప్పుకున్నారు.

వరుణలో విజయేంద్రకు తొలి ఎన్నికల సమరం?

వరుణలో విజయేంద్రకు తొలి ఎన్నికల సమరం?

బీజేపీ సీనియర్ నేత, సీఎం అభ్యర్థి బీఎస్ యెడ్యూరప్ప కుటుంబ సన్నిహిత వర్గాల కథనం ప్రకారం ఈ దఫా రాఘవేంద్ర పొరుగున ఉన్న రాణెబెన్నూర్ స్థానంపై కన్నేసినట్లు వినికిడి. ఇక యెడ్యూరప్ప చిన్న కొడుకు విజయేంద్ర ఇంకా తెర వెనుక కార్యక్రమాలకు మాత్రమే పరిమితమయ్యారు. ఒకవేళ పార్టీ ఆయనకు టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయిస్తే విజయేంద్రకు ఇది తొలి ఎన్నికల సమరం కానున్నది.

 2016లో రాకేశ్ మరణం వరకు యతీంద్ర ఎవరికీ తెలియదు

2016లో రాకేశ్ మరణం వరకు యతీంద్ర ఎవరికీ తెలియదు

మరోవైపు సిద్దరామయ్య తనయుడు యతీంద్ర ఒక మెడికల్ ప్రాక్టీషనర్ కావడమే కాదు ఏనాడూ రాజకీయాల పట్ల ఆసక్తి చూపలేదు. కానీ సిద్దరామయ్య పెద్ద కొడుకు రాకేశ్ 2016లో బెల్జియంలో మరణించే వరకు యతీంద్ర గురించి ఎవరికీ తెలియదు. 2016 వరకు రాకేశ్ నే సిద్దరామయ్య రాజకీయాలకు వారసుడని భావించారు మరి. కానీ రాకేశ్ మరణం తర్వాత యతీంద్ర రెండేండ్లుగా వరుణ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో విస్త్రుత పర్యటనలు చేస్తూ, స్థానికులతో మమేకం అవుతూ ముందుకు సాగుతున్నారు. స్థానిక సమస్యలపై స్పందిస్తున్నారు. యతీంద్ర మాదిరిగా కాక విజయేంద్ర మైసూర్ రాజకీయాలకు బయటి వ్యక్తి అవుతారు. షిమోగలో జన్మించిన విజయేంద్ర 10 ఏళ్లుగా బెంగళూరులో జీవనం సాగిస్తున్నారు.

గత ఎన్నికల్లో సిద్దుపై యెడ్యూరప్ప సహాయకుడి ఓటమి

గత ఎన్నికల్లో సిద్దుపై యెడ్యూరప్ప సహాయకుడి ఓటమి

మైసూర్ ప్యాలెస్ పరిధిలోని బీజేపీ నాయకులు కూడా పలు కారణాల రీత్యా సీఎం సిద్దరామయ్య తనయుడు యతీంద్రను ఎదుర్కొనడానికి విజయేంద్ర మాత్రమే సరైన అభ్యర్థి అని చెబుతున్నారు. కాంగ్రెస్, సెక్యులర్ జనతాదళ్ పార్టీలకు కంచుకోటగా ఉన్న ఓల్డ్ మైసూర్ రీజియన్ పరిధిలో బీజేపీకి సమర్థులైన అభ్యర్థుల కొరత దండిగా ఉన్నది మరి. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో మైసూర్ రీజియన్ పరిధిలోని అన్ని జిల్లాల్లో బీజేపీ ఖాతా కూడా తెరువలేదు. గత ఎన్నికల్లో వరుణ స్థానం నుంచి యెడ్యూరప్ప వ్యక్తిగత సహాయకుడు కాపు సిద్దలింగస్వామి.. కేజేపీ టిక్కెట్‌పై పోటీ చేసి 30 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

తర్వాతీ స్థానంలో ఎస్టీలు ప్లస్ కురుబలు

తర్వాతీ స్థానంలో ఎస్టీలు ప్లస్ కురుబలు

వరుణ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో గణనీయమైన రీతిలో వీరశైవుల జనాభా ఉన్నది. లింగాయత్‌లకు మైనారిటీ మత హోదా కల్పించినందుకు సిద్దరామయ్యపై వీరశైవులు దిగ్భ్రాంతికి గురయ్యారని చెబుతున్నారు. స్థానికుల సమాచారం ప్రకారం సుమారు 60 వేల మంది వీరశైవులు, 40 వేల మంది ఎస్టీ నాయకులు, 15 వేల మంది కురుబలు, 10 వేల వొక్కలిగలతోపాటు 50 వేల మందికి పైగా దళితులు వరుణ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ ఓట్లలో చీలికతోపాటు వీర శైవులు తమకు అనుకూలంగా మారతారని బీజేపీ ఆశాభావంతో ఉంది.

విజయేంద్ర పోటీపై మౌనం వహిస్తున్న బీఎస్ యెడ్యూరప్ప

విజయేంద్ర పోటీపై మౌనం వహిస్తున్న బీఎస్ యెడ్యూరప్ప

కానీ గతంలో కూడా వీరశైవులు, ఇతర సామాజిక వర్గాలన్నీ తనకే ఓటేశారని సిద్దరామయ్య, ఇకముందు కూడా ఓటేస్తారని సిద్దరామయ్య తెలిపారు. ప్రజలను విడదీయడంలో బీజేపీకి మంచి సంప్రదాయాలు కలిగి ఉన్నదన్నారు. కానీ తాము ప్రజలను విడదీయబోమని తెలిపారు. తాను పోటీ చేసినా, తన కొడుకు పోటీ చేసినా వారంతా తమకు ఓటేస్తారని సిద్దరామయ్య చెప్పారు. తన కొడుకు విజయేంద్ర పోటీ చేసే విషయమై యెడ్యూరప్ప మౌనం వహిస్తున్నారు. కానీ వరుణ బ్లాక్ బీజేపీ కమిటీ మాత్రం వరుణ అసెంబ్లీ స్థానం నుంచి విజయేంద్రను బరిలోకి దించాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు వినతి పత్రం సమర్పించడం గమనార్హం.

English summary
Bengaluru: Varuna, in the outskirts of palace city Mysore, is one of the best known Assembly seats in Karnataka, courtesy its incumbent MLA and Chief Minister Siddaramaiah. Varuna came into existence as an Assembly seat only in 2008 after the delimitation of constituencies. Siddaramaiah, who contested seven elections from Chamundeshwari between 1983 and 2008, shifted to neighbouring Varuna for strategic reasons. He has now decided to field son Yatheendra from there, shifting his own base to Chamundeshwari again.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X