వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక స్పీకర్‌గా రెండోసారి, ఎవరీ రమేష్?

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ గా ఎ.ఆర్. రమేష్‌ శుక్రవారం నాడు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న ఎ.ఆర్. రమేష్ రెండో దఫా కర్ణాటక స్పీకర్ గా ఎన్నికయ్యారు.గతంలో కర్ణాటక సీఎంగా ఎస్ఎం కృష్ణ సీఎంగా ఉన్న కాలంలో రమేష్ కుమార్ స్పీకర్ గా పనిచేశారు.

కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ గా శుక్రవారం నాడు ఎ.ఆర్. రమేష్ కుమార్ ఎన్నికయ్యారు. చివరి నిమిషంలో బిజెపి అభ్యర్ధి సురేష్ కుమార్ పోటీ నుండి తప్పుకోవడంతో ఎ.ఆర్ రమేష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.సిద్దరామయ్య మంత్రివర్గంలో ఎ.ఆర్. రమేష్ మంత్రిగా కూడ పనిచేశారు.

Karnataka Assembly Newly Elected speaker: who is K.R. Ramesh?

కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలోని శ్రీనివాసపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుండి సుమారు ఆరు దఫాలు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 1970లో రమేష్ కుమార్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలుత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత ఆయన జనతా పార్టీలోకి మారారు. 1980 దశకంలో జనతా పార్టీలో ఆయన కొనసాగారు. 1990 దశకంలో రమేష్ కుమార్ జనతాదళ్‌లోకి మారారు. 2000 కాలంలో రమేష్ కుమార్ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు.

1978లో రమేష్ కుమార్ తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.ఆర్ జి నారాయణరెడ్డిని 18 వేల ఓట్ల మెజారిటీతో ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేశారు.1983లో కెఆర్ రమేష్ 700 ఓట్లతో ఓటమిపాలయ్యారు. 1985లో జనతాపార్టీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన రమేష్ కుమార్ విజయం సాధించారు. 1989లో జరిగిన ఎన్నికల్లో రమేష్ కుమార్ ఓటమి పాలయ్యారు. 1994లో ఆయన విజయం సాధించారు.

1999లో ఆయన స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు.2004లో కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరారు. ఆ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. 2008 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. 2013లో ఆయన మరోసారి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో కూడ ఆయన మరోసారి విజయం సాధించారు.1994 నుండి 1999 వరకు కర్ణాటక స్పీకర్ గా ఎ.ఆర్ . రమేష్ కుమార్ పనిచేశారు. అంతేకాదు సిద్దరామయ్య మంత్రివర్గంలో వైద్య,ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు.

English summary
Ramesh Kumar is from the Indian National Congress and represents Srinivaspur constituency of Kolar district, Karnataka. Ramesh Kumar started his political career in the seventies with the Indian National Congress later on he moved to the Janata Party in the mid-eighties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X