వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీ నుండి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు: యోగికి కౌంటరిచ్చిన సిద్దూ

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

కర్ణాటకలో యోగి ఆదిత్యనాథ్ ప్రచారం, ఉత్తరప్రదేశ్ శాంతి భద్రతల మాటేమిటి ?

బెంగుళూరు: మీ నుండి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాధ్‌పై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఎదురుదాడికి దిగారు.

కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీలో జరిగిన బిజెపి పరివర్తన యాత్రలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కర్ణాటక రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలపై సిద్దరామయ్య శుక్రవారం నాడు తీవ్రంగా స్పందించారు.

Karnataka assembly polls: "Need no lessons from you," Siddaramaiah attacks Yogi Adityanath

దేశంలో బీహర్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లోనే శాంతి భద్రతల పరిస్థితి బాగా లేదన్నారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య. అలాంటి మీ నుండి మేం పాఠాలను నేర్చుకోవాల్సి ఉందా అని ఆయన ప్రశ్నించారు. కర్ణాటక రాష్ట్రంలోని బెల్గావి ప్రాంతంలో నవ కర్ణాటక యాత్రలో భాగంగా సిద్దరామయ్య యోగి ఆదిత్యనాథ్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు.

కర్ణాటక రాష్ట్రంలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని యోగి ఆదిత్యనాద్ ఆరోపించారు. కులం, మతం పేరుతో సమాజాన్ని విడగొడుతోందని కాంగ్రెస్‌పై యోగి విమర్శలు గుప్పించారు.

అయితే యోగి ఆదిత్యనాధ్ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీమ్ వినూత్న రీతిలో క్యాంపెయిన్ ప్రారంభించింది. కర్ణాటక ప్రజలను యోగి ఆదిత్యనాద్ అవమానపర్చాడని ఆరోపించింది. కర్ణాటక రాష్ట్రం అభివృద్దిలో వెనుకబడిందనే ఆరోపణలను యోగి చేశారని సోషల్ మీడియా టీమ్ ప్రచారాన్ని చేస్తోంది.

నా పేరు రామ, టిప్పు జయంతే కాదు, హనుమాన్, వాల్మీకి, బసవ, కనకదాస, కిట్టూరాణి, చెన్నమ్మ సంబరాలను కూడ నిర్వహిస్తామని కర్ణాటక సీఎం సిద్దరామయ్య యోగికి కౌంటర్ ఇచ్చారు.

English summary
Karnataka Chief Minister Siddaramaiah lambasted his Uttar Pradesh counterpart a day after the latter raised questions over the law and order situation in the state. Siddaramaiah mocked Yogi Adityanath comments made during the Bharatiya Janata Party's (BJP) Parivatana Yatra in Hubballi on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X